Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

కీర్తన 98 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


కీర్తన 98
ఒక కీర్తన.

1 యెహోవాకు క్రొత్త పాట పాడండి, ఎందుకంటే ఆయన ఆశ్చర్యకార్యాలు చేశారు; ఆయన కుడిచేయి ఆయన పవిత్రమైన బాహువు విజయాన్ని కలిగిస్తాయి.

2 యెహోవా రక్షణను వెల్లడించారు. దేశాల ఎదుట తన నీతిని వెల్లడించారు.

3 ఇశ్రాయేలుకు తన ప్రేమను నమ్మకత్వాన్ని చూపాలని ఆయన జ్ఞాపకం చేసుకున్నారు; మన దేవుని రక్షణ భూమ్యంతాల వరకు కనపడింది.

4 భూ సమస్తమా, యెహోవాకు ఆనందంతో కేకలు వేయి, సంగీతంతో ఉత్సాహ గానం చేయి;

5 వీణతో యెహోవాకు సంగీత నాదం చేయి, వీణతో, గాన ధ్వనితో,

6 బూరలు, పొట్టేలు కొమ్ము ఊదుతూ, రాజైన యెహోవా ఎదుట ఆనంద ధ్వనులు చేయి.

7 సముద్రం, అందులో ఉన్నదంతా, లోకం, అందులో జీవించేవారంతా ప్రతిధ్వని చేయును గాక.

8 యెహోవా సన్నిధిలో నదులు చప్పట్లు కొడతాయి. పర్వతాలు ఆనందంగా పాడతాయి.

9 యెహోవా లోకానికి తీర్పరిగా, రాజుగా రాబోతున్నారు. ఆయన పరిపాలన ఆయన తీర్పులు న్యాయసమ్మతమైనవి.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ