Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

హోషేయ 6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


పశ్చాత్తాపపడని ఇశ్రాయేలు

1 “రండి, మనం యెహోవా దగ్గరకు తిరిగి వెళ్దాము. ఆయన మనల్ని ముక్కలుగా చీల్చారు కాని ఆయనే మనల్ని బాగుచేస్తారు; ఆయన మనల్ని గాయపరచారు కాని ఆయన మన గాయాలను కడతారు.

2 రెండు రోజుల తర్వాత ఆయన మనల్ని బ్రతికిస్తారు, ఆయన సన్నిధిలో మనం బ్రతికేటట్టు, మూడవ రోజున ఆయన మనల్ని పునరుద్ధరిస్తారు.

3 మనం యెహోవా గురించి తెలుసుకుందాం; ఆయనను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సూర్యోదయం ఎంత నిశ్చయమో, ఆయన ప్రత్యక్షమవ్వడం అంతే నిశ్చయం; ఆయన శీతాకాలం వర్షాల్లా, భూమిని తడిపే తొలకరి వానలా దగ్గరకు వస్తారు.”

4 “ఎఫ్రాయిమూ, నిన్ను నేనేం చేయాలి? యూదా, నిన్ను నేనేం చేయాలి? మీ ప్రేమ ప్రొద్దున వచ్చే పొగమంచులా, ఉదయకాలపు మంచులా అదృశ్యమవుతుంది.

5 కాబట్టి నా ప్రవక్తల ద్వారా మిమ్మల్ని ముక్కలు చేశాను, నా నోటిమాటల ద్వారా మిమ్మల్ని చంపాను, అప్పుడు నా తీర్పులు మెరుపులా ప్రకాశిస్తాయి.

6 ఎందుకంటే నేను దయను కోరుతున్నాను బలిని కాదు, దహనబలుల కంటే దేవుని గురించిన జ్ఞానం నాకు ఇష్టము.

7 ఆదాములా వారు నా నిబంధనను మీరారు; వారు నాకు నమ్మకద్రోహం చేశారు.

8 గిలాదు దుర్మార్గుల పట్టణం, దానిలో రక్తపు అడుగుజాడలు ఉన్నాయి.

9 బందిపోటు దొంగల్లా మాటున పొంచి ఉన్నట్లు, యాజకుల గుంపు పొంచి ఉంది; షెకెము మార్గంలో వారు హత్య చేస్తారు, దుర్మార్గపు కుట్రలు చేస్తూ ఉంటారు.

10 నేను ఇశ్రాయేలులో ఘోరమైన విషయాన్ని చూశాను: అక్కడ ఎఫ్రాయిం వ్యభిచారానికి అప్పగించుకుంది, ఇశ్రాయేలు అపవిత్రపరచబడింది.

11 “నేను నా ప్రజలను మునుపటి స్థితికి తీసుకువచ్చినప్పుడు, “యూదా వారలారా, మీ కోసం కూడా కోత సిద్ధంగా ఉంది.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ