Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

కీర్తన 150 - పవిత్ర బైబిల్

1 యెహోవాను స్తుతించండి! దేవుని ఆలయంలో ఆయనను స్తుతించండి! ఆకాశంలో ఆయన శక్తిని బట్టి ఆయనను స్తుతించండి!

2 ఆయన గొప్ప కార్యములను బట్టి ఆయనను స్తుతించండి! ఆయన గొప్పతనమంతటి కోసం ఆయనను స్తుతించండి!

3 బూరలతో, కొమ్ములతో ఆయనను స్తుతించండి! స్వరమండలాలతో, సితారాలతో ఆయనను స్తుతించండి!

4 తంబురలతో, నాట్యంతో దేవుని స్తుతించండి! తీగల వాయిద్యాలతో, పిల్లన గ్రోవితో ఆయనను స్తుతించండి!

5 పెద్ద తాళాలతో దేవుణ్ణి స్తుతించండి! పెద్దగా శబ్దం చేసే తాళాలతో ఆయనను స్తుతించండి!

6 సజీవంగా ఉన్న ప్రతీది యెహోవాను స్తుతించాలి! యెహోవాను స్తుతించండి.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ