Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

కీర్తన 136 - పవిత్ర బైబిల్

1 యెహోవా మంచివాడు గనుక ఆయనను స్తుతించండి. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.

2 దేవుళ్లకు దేవుణ్ణి స్తుతించండి! ఆయన నిజమైన ప్రేమ నిరంతరం ఉంటుంది.

3 యెహోవా దేవున్ని స్తుతించండి. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.

4 ఆశ్చర్యకరమైన అద్భుతాలు చేసే ఆయన్ని మాత్రమే స్తుతించండి. ఆయన నిజమైన ప్రేమ ఎల్లప్పుడు ఉంటుంది.

5 జ్ఞానంచేత ఆకాశాన్ని సృజించిన దేవుణ్ణి స్తుతించండి. ఆయన నిజమైన ప్రేమ ఎల్లకాలం ఉంటుంది.

6 దేవుడు సముద్రం మీద ఆరిన నేలను చేశాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.

7 దేవుడు గొప్ప జ్యోతులను చేశాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.

8 దేవుడు పగటిని ఏలుటకు సూర్యుణ్ణి చేసాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.

9 దేవుడు రాత్రిని ఏలుటకు చంద్రున్న్, నక్షత్రాలను చేసాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.

10 దేవుడు ఈజిప్టు మనుష్యులలో మొదటివారిని, జంతువులలోను మొదటివాటిని చంపేసాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.

11 దేవుడు ఈజిప్టునుండి ఇశ్రాయేలును విడిపించాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.

12 దేవుడు తన గొప్ప శక్తిని బలాన్ని చూపించాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.

13 దేవుడు ఎర్రసముద్రాన్ని రెండు పాయలుగా చేసాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.

14 దేవుడు తన ఇశ్రాయేలును ఎర్రసముద్రంలో నడిపించాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.

15 దేవుడు ఫరోను, అతని సైన్యాన్ని ఎర్రసముద్రంలో ముంచివేశాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.

16 దేవుడు తన ప్రజలను ఎడారిలో నడిపించాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.

17 దేవుడు శక్తిగల రాజులను ఓడించాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.

18 దేవుడు బలమైన రాజులను ఓడించాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.

19 దేవుడు అమోరీయుల రాజైన సీహోనును ఓడించాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.

20 దేవుడు బాషాను రాజైన ఓగును ఓడించాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.

21 దేవుడు వారి దేశాన్ని ఇశ్రాయేలీయులకు యిచ్చాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.

22 దేవుడు ఆ దేశాన్ని ఒక కానుకగా ఇశ్రాయేలీయులకు యిచ్చాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.

23 దేవుడు, మనం ఓడించబడినప్పుడు మనలను జ్ఞాపకం చేసికొన్నాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.

24 దేవుడు మన శత్రువుల నుండి మనలను రక్షించాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.

25 దేవుడు ప్రతి ప్రాణికి ఆహారం యిస్తాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.

26 పరలోకపు దేవుణ్ణి స్తుతించండి! ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ