Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

కీర్తన 13 - పవిత్ర బైబిల్


సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

1 యెహోవా, ఎన్నాళ్లు నన్ను మరచిపోతావు? నీవు నన్ను శాశ్వతంగా మరచిపోతావా? నీవు నన్ను స్వీకరించకుండా ఎన్నాళ్లు నిరాకరిస్తావు?

2 నీవు ఒకవేళ నన్ను మరచిపోయావేమోనని ఇంకెన్నాళ్లు నేను తలంచాలి? ఇంకెన్నాళ్లు నేను నా హృదయంలో దుఃఖ అనుభూతిని పొందాలి? ఇంకెన్నాళ్లు నా శత్రువు నా మీద విజయాలు సాధిస్తాడు?

3 నా దేవా, యెహోవా, నన్ను చూడుము. నా ప్రశ్నలకు జవాబిమ్ము. నన్ను ఆ జవాబు తెలుసుకోనిమ్ము. లేదా నేను చనిపోతాను!

4 అప్పుడు నా శత్రువు, “నేనే వానిని ఓడించాను” అనవచ్చు. నేను అంతం అయ్యానని నా శత్రువు సంతోషిస్తాడు.

5 యెహోవా, నాకు సహాయం చేయుటకు నీ ప్రేమనే నేను నమ్ముకొన్నాను. నీవు నన్ను రక్షించి, నన్ను ఆనందింపజేశావు.

6 యెహోవా నాకు మేలైన కార్యాలు చేశాడు. కనుక నేను యెహోవాకు ఒక ఆనందగీతం పాడుతాను.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ