కీర్తన 123 - పవిత్ర బైబిల్యాత్ర కీర్తన. 1 దేవా, నేను నీవైపు చూచి ప్రార్థిస్తున్నాను. నీవు పరలోకంలో రాజుగా కూర్చుని ఉన్నావు. 2 బానిసలు వారి అవసరాల కోసం వారి యజమానుల మీద ఆధారపడతారు. బానిస స్త్రీలు వారి యజమానురాండ్ర మీద ఆధారపడతారు. అదే విధంగా మేము మా దేవుడైన యెహోవా మీద ఆధారపడతాము. దేవుడు మా మీద దయ చూపించాలని మేము ఎదురుచూస్తాము. 3 యెహోవా, మా మీద దయ చూపించుము. మేము చాలాకాలంగా అవమానించబడ్డాము. కనుక దయ చూపించుము. 4 ఆ గర్విష్ఠుల ఎగతాళితో మా ప్రాణం అధిక భారాన్ని పొందింది. మా హింసకుల తిరస్కారంతో వారు సుఖంగా వున్నారు. |
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International
Bible League International