Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

కీర్తన 111 - పవిత్ర బైబిల్

1 యెహోవాను స్తుతించండి! మంచి మనుష్యులు సమావేశమయ్యే సమాజంలో నేను నా హృదయపూర్తిగా యెహోవాకు వందనాలు చెల్లిస్తాను.

2 యెహోవా ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. దేవుని నుండి లభ్యమయ్యే మంచిది ప్రతి ఒక్కటి ప్రజలకు కావాలి.

3 దేవుడు వాస్తవంగా మహిమగల ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆయన మంచితనం నిరంతరం కొనసాగుతుంది.

4 దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. కనుక యెహోవా దయ, జాలి గలవాడని మనం జ్ఞాపకం చేసుకొంటాము.

5 దేవుడు తన అనుచరులకు ఆహారం ఇస్తాడు. దేవుడు తన ఒడంబడికను శాశ్వతంగా జ్ఞాపకం ఉంచుకొంటాడు.

6 దేవుడు చేసిన శక్తివంతమైన పనులు ఆయన తన ప్రజలకు వారి దేశాన్ని ఇస్తున్నాడని తెలియజేస్తున్నాయి.

7 దేవుడు చేసే ప్రతిది మంచిది, న్యాయమయింది కూడా. ఆయన ఆదేశాలు అన్నీ నమ్మదగినవి.

8 దేవుని ఆదేశాలు నిత్యం కొనసాగుతాయి. ఆ ఆదేశాలు ఇవ్వటంలోగల దేవుని కారణాలు నిజాయితీగలవి, పవిత్రమైనవి.

9 దేవుడు తన ప్రజలను రక్షిస్తాడు. దేవుడు తన ఒడంబడికను శాశ్వతంగా కొనసాగేందుకు చేసాడు. దేవుని నామం అద్భుతం, పవిత్రం!

10 దేవుడంటే భయము, భక్తి ఉంటేనే జ్ఞానం ప్రారంభం అవుతుంది. దేవుణ్ణి గౌరవించే ప్రజలు చాలా జ్ఞానంగలవారు. శాశ్వతంగా దేవునికి స్తుతులు పాడుతారు.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ