Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

కీర్తన 90 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)


చతుర్థ స్కంధము.
దైవజనుడైన మోషేచేసిన ప్రార్థన.

1 ప్రభువా, తరతరములనుండి మాకు నివాసస్థలము నీవే.

2 పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు

3 నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు –నరులారా, తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు.

4 నీ దృష్టికి వేయి సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి రాత్రియందలి యొక జామువలెనున్నవి.

5 వరదచేత నైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దునవారు పచ్చ గడ్డివలె చిగిరింతురు

6 ప్రొద్దున అది మొలిచి చిగిరించును సాయంకాలమున అది కోయబడి వాడబారును.

7 నీ కోపమువలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతనుబట్టి దిగులుపడుచున్నాము.

8 మా దోషములను నీవు నీ యెదుట నుంచుకొని యున్నావు నీ ముఖకాంతిలో మా రహస్యపాపములు కనబడుచున్నవి.

9 నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నియు గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపు కొందుము.

10 మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధికబలమున్నయెడల ఎనుబది సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము.

11 నీ ఆగ్రహబలము ఎంతో ఎవరికి తెలియును? నీకు చెందవలసిన భయముకొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియును?

12 మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము.

13 యెహోవా, తిరుగుము ఎంతవరకు తిరుగకయుందువు? నీ సేవకులను చూచి సంతాపపడుము.

14 ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నియు ఉత్సహించి సంతోషించెదము.

15 నీవు మమ్మును శ్రమపరచిన దినముల కొలది మేము కీడనుభవించిన యేండ్లకొలది మమ్మును సంతోషపరచుము.

16 నీ సేవకులకు నీ కార్యము కనుపరచుమువారి కుమారులకు నీ ప్రభావము చూపింపుము.

17 మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీదనుండును గాక మా చేతిపనిని మాకు స్థిరపరచుము మా చేతిపనిని స్థిరపరచుము.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ