కీర్తన 4 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)ప్రధానగాయకునికి. తంతివాద్యములతో పాడదగినది. దావీదు కీర్తన. 1 నా నీతికి ఆధారమగు దేవా, నేను మొఱ్ఱపెట్టునప్పుడు నాకు ఉత్తరమిమ్ము ఇరుకులో నాకు విశాలత కలుగజేసినవాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన నంగీకరించుము. 2 నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమాన ముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైనదానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైనవాటిని వెదకెదరు? 3 యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొను చున్నాడని తెలిసికొనుడి. నేను యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆలకించును. 4 భయమునొంది పాపము చేయకుడి మీరు పడకలమీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసికొని ఊరకుండుడి (సెలా.) 5 నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి 6 –మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు. యెహోవా, నీ సన్నిధికాంతి మామీద ప్రకాశింపజేయుము. 7 వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిననాటి సంతో షముకంటె అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. 8 యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. |
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India