Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

కీర్తన 20 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)


ప్రధానగాయకునికి. దావీదు కీర్తన.

1 ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక.

2 పరిశుద్ధ స్థలములోనుండి ఆయన నీకు సహాయము చేయును గాక సీయోనులోనుండి నిన్ను ఆదుకొనును గాక.

3 ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకము చేసికొనును గాక నీ దహనబలులను అంగీకరించును గాక.

4 నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక.

5 యెహోవా నీ రక్షణనుబట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమునుబట్టి మా ధ్వజము ఎత్తు చున్నాము నీ ప్రార్థనలన్నియు యెహోవా సఫలపరచునుగాక.

6 యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నా కిప్పుడు తెలియును రక్షణార్థమైన తన దక్షిణహస్తబలము చూపును తన పరిశుద్ధాకాశములోనుండి అతనికి ఉత్తరమిచ్చును.

7 కొందరు రథములనుబట్టియు కొందరు గుఱ్ఱములను బట్టియు అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యెహోవా నామమునుబట్టి అతిశయపడుదము.

8 వారు క్రుంగి నేలమీద పడియున్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము.

9 యెహోవా, రక్షించుము మేము మొఱ్ఱపెట్టునపుడు రాజు మాకు ఉత్తరమిచ్చును గాక.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ