Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

కీర్తన 144 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)


దావీదు కీర్తన.

1 నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింప బడును గాక ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడైయున్నాడు.

2 ఆయన నాకు కృపానిధి నా కోట నా దుర్గము నన్ను తప్పించువాడు నా కేడెము నే నాశ్రయించువాడు ఆయన నా జనులను నాకు లోబరచువాడైయున్నాడు.

3 యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటివారు? నీవు వారిని ఎన్నికచేయుటకు మనష్యులు ఏపాటివారు?

4 నరులు వట్టి ఊపిరిని పోలియున్నారువారి దినములు దాటిపోవు నీడవలె నున్నవి.

5 యెహోవా, నీ ఆకాశమును వంచి దిగిరమ్ము పర్వతములు పొగ రాజునట్లు నీవు వాటిని ముట్టుము

6 మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము.

7 పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము మహా జలములలోనుండి అన్యులచేతిలోనుండి నన్ను విడిపింపుము.

8 వారి నోరు వట్టిమాటలాడుచున్నదివారి కుడిచేయి అబద్ధముతోకూడియున్నది.

9 దేవా, నిన్నుగూర్చి నేనొక క్రొత్త కీర్తన పాడెదను పదితంతుల సితారాతో నిన్ను కీర్తించెదను.

10 నీవే రాజులకు విజయము దయచేయువాడవు దుష్టుల ఖడ్గమునుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు

11 నన్ను తప్పింపుము అన్యుల చేతిలోనుండి నన్ను విడి పింపుమువారి నోరు వట్టిమాటలాడుచున్నదివారి కుడిచేయి అబద్ధముతోకూడియున్నది.

12 మా కుమారులు తమ యౌవన కాలమందు ఎదిగిన మొక్కలవలె ఉన్నారు మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూలకంబములవలె ఉన్నారు.

13 మా కొట్లు నింపబడి పలువిధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి మా గొఱ్ఱెలు వేలకొలదిగాను పదివేలకొలదిగాను మా గడ్డి బీళ్లలో పిల్లలు వేయుచున్నవి.

14 మా యెడ్లు గొప్ప బరువులు మోయగలవి మా వీధులలో చొరబడుటయైనను ఉరుకులెత్తుట యైనను లేదు వాటిలో శ్రమగలవారి మొఱ్ఱ వినబడుటయైనను లేదు

15 ఇట్టి స్థితిగలవారు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ