Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

కీర్తన 124 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)


యాత్రకీర్తన. దావీదుది.

1 మనుష్యులు మనమీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడైయుండనియెడల

2 వారి ఆగ్రహము మనపైని రగులుకొనినప్పుడు

3 యెహోవా మనకు తోడైయుండనియెడలవారు మనలను ప్రాణముతోనే మ్రింగివేసియుందురు

4 జలములు మనలను ముంచివేసియుండును ప్రవాహము మన ప్రాణములమీదుగా పొర్లి పారి యుండును

5 ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణములమీదుగా పొర్లి పారియుండును అని ఇశ్రాయేలీయులు అందురు గాక.

6 వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినొందును గాక.

7 పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరినుండి తప్పించుకొని యున్నది ఉరి తెంపబడెను మనము తప్పించుకొని యున్నాము.

8 భూమ్యాకాశములను సృజించిన యెహోవా నామమువలననే మనకు సహాయము కలుగుచున్నది.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ