కీర్తన 123 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)యాత్రకీర్తన. 1 ఆకాశమందు ఆసీనుడవైనవాడా, నీతట్టు నా కన్ను లెత్తుచున్నాను. 2 దాసుల కన్నులు తమ యజమానుని చేతితట్టును దాసి కన్నులు తన యజమానురాలి చేతితట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించువరకు మన కన్నులు ఆయనతట్టు చూచుచున్నవి. 3 యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతిమి అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మామీదికి అధికముగా వచ్చియున్నవి. 4 మమ్మును కరుణింపుము మమ్మును కరుణింపుము. |
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India