యోబు 35 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 ఇంకా ఎలీహు అన్నాడు: 2 “ఇది న్యాయమని నీవనుకుంటున్నావా? ‘నా నీతి దేవుని నీతి కన్నా గొప్పది.’ 3 అయితే, నా పాపం వలన నాకు లాభమేంటి? ‘పాపం చేయకపోవడం వలన నేను పొందేదేంటి?’ అని నీవు అడుగుతున్నావు. 4 “నేను నీ స్నేహితులకు నీకు జవాబు చెప్పాలనుకుంటున్నాను. 5 ఆకాశం వైపు తేరి చూడండి; మీకన్నా ఎంతో ఎత్తుగా ఉన్న మేఘాల వైపు చూడండి. 6 నీవు పాపం చేస్తే, అది ఆయన మీద ఎలా ప్రభావం చూపుతుంది? నీ పాపాలు ఎక్కువగా ఉంటే, అది ఆయనకేమి చేస్తుంది? 7 నీవు నీతిమంతుడవైతే, నీవు ఆయనకేమి ఇస్తావు, నీ చేతి నుండి ఆయన ఏం పొందుకుంటారు? 8 నీ దుష్టత్వం నీలాంటి మనుష్యుల మీద, నీ నీతి ఇతరుల మీద మాత్రమే ప్రభావం చూపుతుంది. 9 “ఒత్తిళ్ళ భారాన్ని బట్టి ప్రజలు ఆక్రందన చేస్తారు; బలవంతుల చేతి నుండి విడుదల కోసం విన్నవించుకొంటారు. 10-11 అయితే, ‘రాత్రివేళ పాటలు ఇచ్చే, భూజంతువుల కంటే మనకు ఎక్కువ బోధించే, ఆకాశపక్షుల కన్నా మనలను జ్ఞానవంతులుగా చేసే, నా సృష్టికర్తయైన దేవుడు ఎక్కడున్నాడు?’ అని ఎవరు అనరు. 12 దుర్మార్గుల గర్వం కారణంగా ప్రజలు మొరపెట్టినా ఆయన జవాబివ్వరు. 13 నిజానికి, వారి ఖాళీ మనవిని దేవుడు వినరు; సర్వశక్తిమంతుడు వాటిని లెక్క చేయడు. 14 అయితే, మీరు అతన్ని చూడలేదని, మీ వాదన అతని ముందు ఉందని, మీరు అతని కోసం వేచి ఉండాలని, 15 ఇంకా ఎంత తక్కువ చెప్పినా అతడు వింటాడా? అతని కోపం ఎప్పుడూ శిక్షించదు అతడు దుర్మార్గాన్ని కనీసం పట్టించుకోడు. 16 కాబట్టి యోబు వ్యర్థంగా మాట్లాడుతున్నాడు; తెలివి లేకుండా ఎన్నో మాటలు పలికాడు.” |
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica, Inc.