కీర్తన 87 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019కోరహు వారసుల కీర్తన. ఒక పాట. 1 పవిత్ర పర్వతాలపై ప్రభువు పట్టణపు పునాది ఉంది. 2 యాకోబు గుడారాలన్నిటికంటే సీయోను ద్వారాలు యెహోవాకు ఇష్టం. 3 దేవుని పట్టణమా, నీ గురించి చాలా గొప్ప విషయాలు చెప్పుకున్నారు. సెలా 4 రాహాబును, బబులోనును నా అనుచరులకు గుర్తు చేస్తాను. చూడండి, ఫిలిష్తీయ, తూరు, ఇతియోపియా ఉన్నాయి గదా, ఇది అక్కడే పుట్టింది. 5 సీయోను గురించి ఇలా అంటారు, వీళ్ళంతా ఆమెకే పుట్టారు. సర్వోన్నతుడు తానే ఆమెను సుస్థిరం చేస్తాడు. 6 యెహోవా జనాభా లెక్కలు రాయించేటప్పుడు, ఈ ప్రజ అక్కడే పుట్టింది అంటాడు. సెలా 7 గాయకులు, నర్తకులు, మా ఊటలన్నీ నీలోనే ఉన్నాయి అంటారు. |
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.