కీర్తన 70 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019ప్రధాన సంగీతకారుని కోసం, దావీదు రాసిన జ్ఞాపకార్థ కీర్తన. 1 దేవా, నన్ను విడిపించడానికి త్వరగా రా. యెహోవా, నాకు సహాయం చేయడానికి త్వరగా రా. 2 నన్ను చంపాలని, బాధించాలని చూసేవారు సిగ్గుపడి అవమానం పాలవుతారు గాక. 3 ఆహా ఆహా అని పలికేవారు సిగ్గుపడి వెనక్కి తిరిగి వెళ్తారు గాక. 4 నిన్ను వెతికే వారంతా నీలో ఆనందించి సంతోషిస్తారు గాక. నీ రక్షణను ప్రేమించే వారంతా దేవునికే మహిమ కలగాలి అని ఎప్పుడూ చెప్పుకుంటారు గాక. 5 నేను పేదవాణ్ణి. అక్కరలో ఉన్నవాణ్ణి. నన్ను రక్షించడానికి వేగమే రా. నాకు సహాయం నువ్వే. నా రక్షణకర్తవు నువ్వే. యెహోవా, ఆలస్యం చేయవద్దు. |
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.