Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




జెఫన్యా 3:15 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

15 యెహోవా నీ శిక్షను తొలగించారు, నీ శత్రువును తిప్పికొట్టారు. ఇశ్రాయేలు రాజైన యెహోవా నీకు తోడుగా ఉన్నారు; ఇంకెప్పుడు ఏ హానికి నీవు భయపడవు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

15 తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసియున్నాడు; మీ శత్రువులను ఆయన వెళ్లగొట్టియున్నాడు; ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

15 మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేశాడు. మీ శత్రువులను ఆయన వెళ్లగొట్టాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయం సంభవించదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

15 ఎందుకంటే, నీ శిక్షను యెహోవా నిలిపివేశాడు గనుక! నీ శత్రువుల బలమైన దుర్గాలను ఆయన నాశనం చేశాడు! ఇశ్రాయేలు రాజా, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఏ చెడు విషయం జరుగుతున్నా దాన్నిగూర్చి నీవు దిగులు పడాల్సిన అవసరం లేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

15 యెహోవా నీ శిక్షను తొలగించారు, నీ శత్రువును తిప్పికొట్టారు. ఇశ్రాయేలు రాజైన యెహోవా నీకు తోడుగా ఉన్నారు; ఇంకెప్పుడు ఏ హానికి నీవు భయపడవు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




జెఫన్యా 3:15
48 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆమె గర్భవతియై ఒక కుమారునికి జన్మనిచ్చింది. “దేవుడు నా నిందను తొలగించారు” అని అన్నది.


ఇశ్రాయేలీయులు తమ సృష్టికర్తలో సంతోషించును గాక; సీయోను ప్రజలు తమ రాజులో ఆనందించుదురు గాక.


యెహోవా పట్ల భయం స్వచ్ఛమైనది, నిరంతరం నిలుస్తుంది. యెహోవా శాసనాలు నమ్మదగినవి, అవన్నీ నీతియుక్తమైనవి.


మీ ఉగ్రతను మీరు ప్రక్కన పెట్టారు మీ భయంకర కోపాగ్నిని చల్లార్చుకున్నారు.


సీయోను ప్రజలారా, బిగ్గరగా కేకలువేస్తూ సంతోషంతో పాడండి, ఎందుకంటే, మీ మధ్య ఉన్న ఇశ్రాయేలు పరిశుద్ధుడు గొప్పవాడు.”


శాశ్వతంగా ఆయన మరణాన్ని మ్రింగివేస్తారు. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖం మీది కన్నీటిని తుడిచివేస్తారు; సమస్త భూమి మీద నుండి తన ప్రజల అవమానాన్ని తొలగిస్తారు. యెహోవా ఇది తెలియజేశారు.


యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు; మనల్ని రక్షించేది ఆయనే.


యెహోవా విడిపించిన వారు తిరిగి వస్తారు. వారు పాటలు పాడుతూ సీయోనులో ప్రవేశిస్తారు; నిత్యమైన ఆనందం వారి తలల మీద కిరీటంగా ఉంటుంది. వారు ఆనంద సంతోషాలతో నిండి ఉంటారు. దుఃఖం, నిట్టూర్పు పారిపోతాయి.


తన ప్రజల కోసం వాదించే నీ దేవుడు నీ ప్రభువైన యెహోవా చెప్పే మాట ఇదే: “చూడు, నిన్ను తడబడేలా చేసే పాత్రను, నా ఉగ్రత పాత్రను నీ చేతిలో నుండి తీసివేశాను. నీవు మరలా దానిని త్రాగవు.


యెహోవా తన ప్రజలను ఆదరించారు, ఆయన యెరూషలేమును విడిపించారు. కాబట్టి యెరూషలేము శిథిలాల్లారా, కలిసి సంతోషంతో పాటలు పాడండి.


నీవు నీతిలో స్థాపించబడతావు: బాధించేవారు నీకు దూరంగా ఉంటారు. నీవు దేనికి భయపడే అవసరం లేదు. భయం నీకు దూరంగా ఉంటుంది. అది నీ దగ్గరకు రాదు.


ఇకపై నీ దేశంలో హింస అనేది వినబడదు, నీ సరిహద్దులలో నాశనం గాని విధ్వంసం గాని వినపడదు. అయితే నీవు నీ గోడలను రక్షణ అని నీ గుమ్మాలను స్తుతి అని పిలుస్తావు.


నేను యెరూషలేము గురించి సంతోషిస్తాను నా ప్రజల్లో ఆనందిస్తాను; ఏడ్పు రోదన శబ్దం ఇకపై దానిలో వినపడవు.


సుదూరదేశం నుండి నా ప్రజల మొరను ఆలకించు: “యెహోవా సీయోనులో లేడా? ఆమె రాజు ఇక ఇప్పుడు అక్కడ లేరా?” “వారు తమ చిత్రాలతో, తమ పనికిమాలిన పరదేశి విగ్రహాలతో ఎందుకు నాకు కోపం రప్పించారు?”


“ ‘యెహోవానైన నేను అక్కడ ఉన్నప్పటికీ, “ఈ రెండు జాతులు, దేశాలు మనవే; మనం వాటిని స్వాధీనం చేసుకుందాం” అని మీరు చెప్పారు.


ఇకపై మిమ్మల్ని దేశాలు దూషించడం మీరు వినరు, ఇకపై మిమ్మల్ని జనాంగాల అవమానించవు, మీ జాతిని పతనమయ్యేలా చేయరు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”


అప్పుడు ఇశ్రాయేలీయుల మీద నేను నా ఆత్మను కుమ్మరిస్తాను, కాబట్టి వారికిక నా ముఖాన్ని దాచను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.”


“దాని చుట్టూ విస్తీర్ణం 18,000 మూరలు. “అప్పటినుండి ఆ పట్టణానికి, ‘యెహోవా షమ్మా అని పేరు.’ ”


“అప్పుడు మీ దేవుడైన యెహోవానైన నేను నా పవిత్ర కొండయైన సీయోను మీద నివసిస్తానని మీరు తెలుసుకుంటారు. యెరూషలేము పరిశుద్ధంగా ఉంటుంది; ఇక ఎన్నడు ఇతర దేశాల సైన్యాలు దానిని ఆక్రమించరు.


నేను ఇశ్రాయేలును తమ స్వదేశంలో నాటుతాను, నేను వారికిచ్చిన దేశంలో నుండి వారు ఇక ఎన్నడు పెళ్లగించబడరు,” అని మీ దేవుడైన యెహోవా చెప్తున్నారు.


అప్పుడు నా శత్రువు దాన్ని చూసి, ఇలా జరగడం చూసి సిగ్గుపడుతుంది. “నీ దేవుడైన యెహోవా ఎక్కడ?” అని నాతో అన్న ఆమె నా కళ్లు ఆమె పతనం చూస్తాయి; ఇప్పుడు కూడా ఆమె వీధిలోని బురదలా కాళ్లక్రింద త్రొక్కబడుతుంది.


లెబానోనుపై నీవు చేసిన హింస నీ మీదికే వస్తుంది, పశువులను నాశనం చేసినందుకు నీ మీదికి భయంకరమైన తీర్పు వస్తుంది. నీవు మనుష్యులను హత్య చేసినందుకు, దేశాలను పట్టణాలను వాటి నివాసులను నాశనం చేసినందుకు ఇలా జరుగుతుంది.


నీవు అనేక దేశాలను దోచుకున్నావు కాబట్టి, మిగిలి ఉన్న ప్రజలంతా నిన్ను దోచుకుంటారు. నీవు నరహత్యలు చేసినందుకు, భూములను పట్టణాలను వాటిలోని వారందరినీ నాశనం చేసినందుకు ప్రజలు నిన్ను దోచుకుంటారు.


నీ దేవుడైన యెహోవా, రక్షించే పరాక్రమశాలి నీకు తోడుగా ఉన్నారు. ఆయన నిన్ను చూసి చాలా సంతోషిస్తారు; ఆయన తన ప్రేమను బట్టి ఆయన ఇకపై నిన్ను గద్దించరు, పాడుతూ నిన్ను చూసి సంతోషిస్తారు.”


అయితే యెహోవా నీతిమంతుడు; ఆయన తప్పు చేయరు. అనుదినం ఆయన మానకుండా, ఉదయాన్నే తన న్యాయాన్ని అమలుచేస్తారు, అయినప్పటికీ నీతిలేని వానికి సిగ్గు తెలియదు.


భూమిపై ఉన్న దేశాలన్నీ దానికి వ్యతిరేకంగా సమకూడినప్పుడు, ఆ రోజున నేను యెరూషలేమును అన్ని దేశాలకు బరువైన బండగా చేస్తాను. దాన్ని తొలగించడానికి ప్రయత్నించే వారందరూ తమను తాము గాయపరచుకుంటారు.


మనుష్యులు దానిలో నివసిస్తారు; ఇక ఎన్నడు అది నాశనం కాదు. యెరూషలేము క్షేమంగా ఉంటుంది.


సీయోను కుమారీ, గొప్పగా సంతోషించు! యెరూషలేము కుమారీ, ఆనందంతో కేకలు వేయి! ఇదిగో నీతిమంతుడు, జయశీలియైన మీ రాజు దీనుడిగా గాడిద మీద, గాడిదపిల్ల మీద స్వారీ చేస్తూ మీ దగ్గరకు వస్తున్నాడు.


అప్పుడు నతనయేలు, “రబ్బీ, నీవు దేవుని కుమారుడవు; నీవు ఇశ్రాయేలుకు రాజువు” అని సమాధానం ఇచ్చాడు.


“సీయోను కుమారీ, భయపడకు! ఇదిగో, గాడిదపిల్ల మీద కూర్చుని నీ రాజు వస్తున్నాడు.”


పిలాతు సిలువకు వ్రాతపూర్వక ఉత్తర్వును తగిలించాడు. అది ఇలా ఉంది: నజరేతువాడైన యేసు, యూదుల రాజు.


నా అంతట నేనే ఏమి చేయలేను. నేను విన్నదానిని బట్టి తీర్పు తీరుస్తాను, నా తీర్పు న్యాయమైనది. ఎందుకంటే నన్ను పంపినవాని ఇష్టాన్నే నేను చేస్తాను తప్ప నా ఇష్టాన్ని కాదు.


అప్పుడు పరలోకంలో ఒక గొప్ప స్వరం, “ఇదిగో, రక్షణ, అధికారం, రాజ్యం మన దేవునివి అయ్యాయి. ఆయన క్రీస్తుకు అధికారం వచ్చింది. ఎలాగంటే మన సహోదరీ సహోదరుల మీద రాత్రింబగళ్ళు మన దేవుని ముందు నేరాలను మోపుతున్న అపవాది క్రిందికి పడద్రోయబడ్డాడు.


“పరలోకమా ఆమెను బట్టి ఆనందించండి. దేవుని ప్రజలారా, ఆనందించండి. అపొస్తలులారా, ప్రవక్తలారా ఆనందించండి. ఎందుకంటే, ఆమె మీకు విధించిన తీర్పును బట్టి దేవుడు ఆమెకు తీర్పు తీర్చారు.”


ఆయన ధరించిన వస్త్రాల మీద ఆయన తొడ మీద ఈ పేరు వ్రాసి ఉంది: రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు.


అందుకే, “వీరు దేవుని సింహాసనం ముందు ఉండి, ఆయన మందిరంలో రాత్రింబగళ్ళు ఆయనను ఆరాధిస్తున్నారు, కాబట్టి ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు తన సన్నిధితో వారిని సంరక్షిస్తాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ