Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




జెఫన్యా 3:10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 చెదిరిపోయిన నన్ను ఆరాధించే నా ప్రజలు కూషు నదుల అవతల నుండి నాకు అర్పణలు తెస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 చెదరిపోయినవారై నాకు ప్రార్థనచేయు నా జనులు కూషుదేశపు నదుల అవతలనుండి నాకు నైవేద్యముగా తీసికొని రాబడుదురు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 చెదరి పోయి నాకు ప్రార్థన చేసే నా ప్రజలను కూషు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యంగా తీసుకు వస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

10 కూషు దేశంలోని నది ఆవలివైపున, అంత దూరంనుండి ప్రజలు వస్తారు. చెదరిపోయిన నా ప్రజలు నా దగ్గరకు వస్తారు. నా భక్తులు వస్తారు. మరియు నాకు వారు కానుకలు తెస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 చెదిరిపోయిన నన్ను ఆరాధించే నా ప్రజలు కూషు నదుల అవతల నుండి నాకు అర్పణలు తెస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




జెఫన్యా 3:10
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఈజిప్టు నుండి రాయబారులు వస్తారు. కూషు తనను తాను దేవునికి సమర్పించుకుంటుంది.


ఆ రోజున తన ప్రజల్లో మిగిలి ఉన్న శేషాన్ని అష్షూరు, ఈజిప్టు, పత్రూసు, కూషు, ఏలాము, బబులోను, హమాతులలో నుండి, మధ్యధరా సముద్ర ద్వీపాల్లో నుండి విడిపించి రప్పించడానికి యెహోవా రెండవసారి తన చేయి చాపుతారు.


దేశాల కోసం ఆయన ఒక జెండా పైకి ఎత్తుతారు చెరగొనిపోబడిన ఇశ్రాయేలీయులను పోగుచేస్తారు; భూమి నలుదిక్కుల నుండి ఆయన చెదరిపోయిన యూదా ప్రజలను సమకూర్చుతారు.


కూషు నదుల అవతల సందడి చేసే రెక్కల దేశమా, నీకు శ్రమ!


ఆ కాలంలో ఎత్తైన వారు నునుపైన చర్మం గల ప్రజలు దూరంలోనున్న భయపెట్టే ప్రజలు నదులు పారుచున్న దేశం కలిగి దౌర్జన్యం చేసి వింత భాష కలిగిన దేశం సైన్యాల యెహోవాకు కానుకలు తెస్తారు. సైన్యాల యెహోవా నామానికి నివాసస్థలమైన సీయోను పర్వతానికి ఆ కానుకలు తీసుకువస్తారు.


తూర్పుదిక్కు నుండి పడమటిదిక్కు వరకు ఇతర దేశాల మధ్య నా నామం ఘనపరచబడుతుంది. ప్రతిచోటా ధూపద్రవ్యాలు, పవిత్రమైన అర్పణలు వారు నాకు తెస్తారు. నా పేరు ఇతర దేశాల్లో గొప్పగా ఉంటుంది” అని సైన్యాల యెహోవా చెప్తున్నారు.


అప్పుడు యూదుల నాయకులు ఒకరితో ఒకరు, “మనం కనుగొనలేని ఏ స్థలానికి ఇతడు వెళ్లబోతున్నాడు? గ్రీసు దేశస్థుల మధ్య చెదరిపోయి జీవిస్తున్న మన ప్రజల దగ్గరకు ఆయన వెళ్లి, గ్రీసు దేశస్థులకు బోధిస్తాడా?


“నేను అనేక సంవత్సరాల తర్వాత, నా ప్రజల్లోని పేదవారికి దానధర్మం చేసి దేవునికి అర్పణలను అర్పించడానికి యెరూషలేము పట్టణానికి వచ్చాను.


అతడు బయలుదేరి వెళ్తునప్పుడు, ఆ మార్గంలో ఇతియొపీయుల రాణియైన కందాకే యొక్క ధనాగారం అంతటికి ముఖ్య అధికారిగా ఉన్న ఇతియొపీయుడైన నపుంసకుని కలుసుకున్నాడు. ఇతడు ఆరాధించడానికి యెరూషలేముకు వెళ్లాడు,


యేసు క్రీస్తు అపొస్తలుడైన పేతురు, దేవునిచేత ఎన్నుకోబడినవారు ఎవరైతే పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితూనియ ప్రాంతాలకు చెదరిపోయి ప్రవాసులుగా జీవిస్తున్నారో వారికి వ్రాయునది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ