Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




జెఫన్యా 1:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 మిద్దెమీద ఎక్కి ఆకాశ నక్షత్ర సమూహాన్ని పూజించేవారిని, యెహోవా పేర మోలెకు దేవత పేర మొక్కి ఒట్టు వేసుకునేవారిని నేను నాశనం చేస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 మిద్దెలమీద ఎక్కి ఆకాశసమూహములకు మ్రొక్కువారిని యెహోవా పేరునుబట్టియు, బయలుదేవత తమకు రాజను దాని నామమునుబట్టియు మ్రొక్కి ప్రమాణము చేయువారిని నేను నిర్మూలము చేసెదను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 మిద్దెల మీద ఎక్కి ఆకాశ సమూహాలకు మొక్కే వాళ్ళను, యెహోవా పేరును బట్టి ఒట్టు పెట్టుకుంటూ, ఆయన్ని పూజిస్తూ మిల్కోము దేవుడి పేరు స్మరించే వారిని నాశనం చేస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

5 నక్షత్రాలను పూజించుటకు వారి యింటి కప్పుల మీదికి వెళ్ళే వారందరినీ నేను తొలగించి వేస్తాను. ఆ బూటకవు యాజకులను ప్రజలు మరచి పోతారు. కొంతమంది నన్ను పూజిస్తున్నామని అంటారు. ఆ ప్రజలు నన్ను ఆరాధిస్తామని వాగ్దానం చేసారు. కాని ఇప్పుడు వారు బూటకపు దేవత మిల్కోమును పూజిస్తున్నారు. కనుక ఆ ప్రజలను ఆ స్థలంనుండి నేను తొలగించి వేస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 మిద్దెమీద ఎక్కి ఆకాశ నక్షత్ర సమూహాన్ని పూజించేవారిని, యెహోవా పేర మోలెకు దేవత పేర మొక్కి ఒట్టు వేసుకునేవారిని నేను నాశనం చేస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




జెఫన్యా 1:5
30 ပူးပေါင်းရင်းမြစ်များ  

నేనిలా చేయడానికి కారణం వారు సొలొమోను తండ్రియైన దావీదులా నా మార్గాలను అనుసరించక నన్ను విడిచిపెట్టి సీదోనీయుల అష్తారోతు దేవతను, మోయాబీయుల కెమోషు దేవున్ని, అమ్మోనీయుల మిల్కోము దేవున్ని పూజిస్తూ, నా దృష్టికి సరియైనది చేయలేదు, నా శాసనాలను నియమాలను పాటించలేదు.


సొలొమోను సీదోనీయుల దేవత అష్తారోతునూ, అమ్మోనీయుల అసహ్యమైన దేవత మిల్కోమును అనుసరించాడు.


ఏలీయా ప్రజల దగ్గరకు వెళ్లి, “మీరు ఎంతకాలం రెండు అభిప్రాయాల మధ్య తడబడుతూ ఉంటారు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలు దేవుడైతే అతన్ని అనుసరించండి” అని అన్నాడు. అయితే ప్రజలు ఏమి బదులు చెప్పలేదు.


వారు యెహోవాను ఆరాధించారు కాని ఎత్తైన స్థలాల్లో ఉన్న క్షేత్రాల్లో అన్ని రకాల ప్రజలను యాజకులుగా చేసుకున్నారు.


వారు యెహోవాను ఆరాధించారు కాని వారు తాము ఏ దేశాల నుండి వచ్చారో, ఆ దేశాల ఆచారాల ప్రకారం తమ దేవుళ్ళను కూడా సేవించారు.


ఈ ప్రజలు యెహోవాను ఆరాధిస్తున్ననూ, విగ్రహాలను కూడా సేవించారు. ఈనాటికీ వారి పిల్లలు, పిల్లల పిల్లలు వారి పూర్వికులు చేసినట్టే చేస్తున్నారు.


అతడు ఆహాజు మేడమీది పైకప్పు మీద యూదా రాజులు కట్టించిన బలిపీఠాన్ని, యెహోవా మందిరం యొక్క రెండు ఆవరణాల్లో మనష్షే కట్టించిన బలిపీఠాన్ని పడగొట్టాడు. వాటిని అక్కడినుండి తీసివేసి, ముక్కలు ముక్కలుగా చేసి, ఆ ముక్కలను కిద్రోను లోయలో పారవేశాడు.


దర్శనపు లోయకు వ్యతిరేకంగా ప్రవచనం: ఏ కారణంగా మీరందరు మేడల మీదికి ఎక్కారు?


కొంతమంది, ‘నేను యెహోవా వాడను’ అని అంటారు; ఇతరులు యాకోబు పేరుతో తమను తాము పిలుచుకుంటారు; ఇంకా కొందరు తమ చేతిపై ‘యెహోవా వారము’ అని రాసుకుని ఇశ్రాయేలు పేరును పెట్టుకుంటారు.


నా ఎదుట ప్రతి మోకాలు వంగుతుందని ప్రతి నాలుక నాతోడని ప్రమాణం చేస్తుందని నేను నా పేరిట ప్రమాణం చేశాను. నీతిగల నా నోటి నుండి వచ్చిన మాట ఏదీ వ్యర్థం కాదు.


“యాకోబు వారసులారా, ఇశ్రాయేలు అనే పేరుతో పిలువబడి యూదా కుటుంబం నుండి వచ్చే వారలారా వినండి, యెహోవా పేరిట ప్రమాణం చేస్తూ ఇశ్రాయేలు దేవుని వేడుకుంటూ సత్యాన్ని గాని నీతి గాని అనుసరించని వారలారా వినండి.


వారు ఒకప్పుడు బయలుపై ప్రమాణం చేయడం నా ప్రజలకు బోధించినట్లే, ఇప్పుడు ‘సజీవుడైన యెహోవా పేరిట’ అని నా పేరు మీద ప్రమాణం చేయడానికి నా ప్రజల మార్గాలను బాగా నేర్చుకుంటే వారు నా ప్రజలమధ్య స్థిరపడతారు.


యెరూషలేములోని ఇల్లు, యూదా రాజుల భవనాలు ఆ తోఫెతు స్థలంలా అపవిత్రం చేయబడతాయి. అన్ని ఇళ్ల మీద ప్రజలు ఆకాశ సైన్యాలకు ధూపం వేసి, ఇతర దేవుళ్ళకు పానార్పణలు అర్పించారు.’ ”


ఈ పట్టణంపై దాడి చేస్తున్న బబులోనీయులు లోపలికి వచ్చి దానికి నిప్పు పెడతారు; బయలుకు ఏ ఇంటి పైకప్పుల మీద ధూపం వేసి, ఇతర దేవుళ్ళకు పానార్పణలు అర్పించి ప్రజలు నాకు కోపాన్ని రేపారో ఆ ఇళ్ళతో పాటు వారు దానిని కాల్చివేస్తారు.


మీరు నిజాయితీ, న్యాయం నీతిగల మార్గంలో ఉండి, ‘సజీవుడైన యెహోవా మీద’ అని ప్రమాణం చేస్తే, అప్పుడు నిన్ను బట్టి దేశాలు ఆశీర్వాదాలు పొందుతాయి, వారు యెహోవా పట్ల వారి అభిమానాన్ని చాటుకుంటారు.”


అమ్మోనీయుల గురించి: యెహోవా ఇలా చెప్తున్నారు: “ఇశ్రాయేలుకు కుమారులు లేరా? ఇశ్రాయేలుకు వారసుడు లేడా? మోలెకు గాదును ఎందుకు స్వాధీనం చేసుకున్నాడు? అతని ప్రజలు దాని పట్టణాల్లో ఎందుకు నివసిస్తున్నారు?


వారు, ‘సజీవుడైన యెహోవా మీద ప్రమాణం’ అని అన్నప్పటికీ, వారు అబద్ధపు ప్రమాణమే చేస్తున్నారు.”


“నేను నిన్ను ఎందుకు క్షమించాలి? మీ పిల్లలు నన్ను విడిచి, దేవుళ్ళు కాని దేవుళ్ళపై ప్రమాణం చేశారు. వారి అవసరాలన్నీ నేను తీర్చాను, అయినప్పటికీ వారు వ్యభిచారం చేశారు వేశ్యల ఇళ్ళకు గుమికూడారు.


తర్వాత వచ్చి నా పేరుతో పిలువబడే ఈ మందిరంలో నా ముందు నిలబడి, “మేము క్షేమంగా ఉన్నాము” ఈ అసహ్యకరమైన వాటన్నిటిని చేయడానికి క్షేమంగా ఉన్నాము అని అంటారా?


“ ‘నీవు దొంగిలిస్తూ, హత్య చేస్తూ, వ్యభిచారం చేస్తూ, అబద్ధ ప్రమాణం, దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తూ, బయలుకు ధూపం వేస్తూ, నీకు తెలియని ఇతర దేవుళ్ళను అనుసరిస్తూ,


వారు ప్రేమించి సేవించిన వారు అనుసరించిన, సంప్రదించిన పూజించిన సూర్యునికి చంద్రునికి ఆకాశమండలం లోని అన్ని నక్షత్రాలకు బహిర్గతమవుతారు. వారు పోగుచేయబడక, పాతిపెట్టబడక, నేలమీద పడి ఉన్న పెంటలా ఉంటారు.


వారి హృదయం కపటమైనది, ఇప్పుడు వారు తమ అపరాధానికి శిక్షను భరించాలి. యెహోవా వారి బలిపీఠాలను పడగొట్టి, వారి పవిత్ర రాళ్లను నాశనం చేస్తారు.


“ఇశ్రాయేలూ, నీవు వ్యభిచారం చేసినా సరే, యూదా అపరాధం చేయకూడదు. “గిల్గాలుకు వెళ్లవద్దు; బేత్-ఆవెనుకు వెళ్లవద్దు. ‘యెహోవా జీవం తోడు’ అని ఒట్టు పెట్టుకోవద్దు.


మీరు మీ సక్కూతు రాజ దేవుని క్షేత్రాన్ని, మీ కైవాన్ విగ్రహాలను, మీ కోసం మోసుకొచ్చారు. అది మీరు మీ కోసం చేసుకుంది.


“ఎవ్వరూ ఇద్దరు యజమానులకు సేవచేయలేరు. వారు ఒకరిని ద్వేషించి మరొకరిని ప్రేమిస్తారు లేదా ఒక యజమానికి అంకితమై మరొకనిని తృణీకరిస్తారు. మీరు దేవున్ని ధనాన్ని రెండింటిని ఒకేసారి సేవించలేరు.


వారు బయలుదేరి ప్రయాణమై పట్టణాన్ని చేరుకోబోతున్నప్పటికి మరుసటిరోజు సుమారు మధ్యాహ్న సమయంలో, పేతురు ప్రార్థన చేసుకోవడానికి ఇంటి పైకప్పుకు వెళ్లాడు.


దీని కోసం లేఖనంలో, “ప్రభువు ఇలా చెప్తున్నారు, ‘నా జీవం తోడని ప్రమాణం చేస్తున్నాను, ప్రతి మోకాలు నా ఎదుట వంగుతుంది, ప్రతి నాలుక దేవుని స్తుతిస్తుంది’” అని వ్రాయబడి ఉంది.


మీ దేవుడైన యెహోవాకు భయపడి, ఆయనను సేవించండి. ఆయనను గట్టిగా పట్టుకుని ఆయన పేరిట ప్రమాణాలు చేయండి.


మీరు ఆకాశం వైపు కళ్ళెత్తి ఆకాశ సైన్యాలైన సూర్యచంద్ర నక్షత్రాలను చూసిన వాటిచే ఆకర్షించబడి, మీ దేవుడైన యెహోవా ఆకాశం క్రింద సమస్త దేశాల కోసం పంచి ఇచ్చిన వాటికి నమస్కరించి వాటికి సేవచేయకుండ మీరు జాగ్రత్తపడండి.


మీ మధ్య ఉన్న ఈ దేశాలతో సహవాసం చేయవద్దు; వారి దేవతల పేర్లు ఎత్తవద్దు; వాటిపై ప్రమాణం చేయవద్దు. మీరు వాటిని సేవించవద్దు లేదా వాటికి నమస్కరించవద్దు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ