Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




జెకర్యా 9:13 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

13 నా విల్లును వంచినట్లు నేను యూదాను వంచుతాను ఎఫ్రాయిము అనే నా బాణంతో దానిని నింపుతాను. సీయోనూ, నీ కుమారులను పురికొల్పి నిన్ను యోధుని కత్తిలా మార్చుతాను; గ్రీసు దేశస్థులారా! సీయోను కుమారులను మీ మీదికి పురికొల్పుతాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

13 యూదావారిని నాకు విల్లుగా వంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను. సీయోనూ, నీ కుమారులను రేపుచున్నాను, శూరుడు ఖడ్గము ప్రయోగించునట్లు నేను నిన్ను ప్రయోగింతును. గ్రేకీయులారా, సీయోను కుమారులను మీమీదికి రేపుచున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

13 యూదా వారిని నాకు విల్లుగా వంచుతున్నాను. ఎఫ్రాయిము వారిని బాణాలుగా చేస్తున్నాను. సీయోనూ, నీ కుమారులను రేపుతున్నాను. శూరుడు కత్తి ఝలిపించినట్టు నేను నిన్ను ప్రయోగిస్తాను. గ్రీసు దేశవాసులారా, సీయోను కుమారులను మీ మీదికి రేపుతున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

13 యూదా, నిన్ను నేను ఒక విల్లులా వినియోగిస్తాను. ఎఫ్రాయిమూ, నిన్ను నేను బాణాల్లా వినియోగిస్తాను. ఇశ్రాయేలూ, గ్రీసుతో యుద్ధం చేయటానికి నిన్ను ఒక బలమైన కత్తిలా ఉపయోగిస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

13 నా విల్లును వంచినట్లు నేను యూదాను వంచుతాను ఎఫ్రాయిము అనే నా బాణంతో దానిని నింపుతాను. సీయోనూ, నీ కుమారులను పురికొల్పి నిన్ను యోధుని కత్తిలా మార్చుతాను; గ్రీసు దేశస్థులారా! సీయోను కుమారులను మీ మీదికి పురికొల్పుతాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




జెకర్యా 9:13
31 ပူးပေါင်းရင်းမြစ်များ  

నా కొండయైన యెహోవాకు స్తుతి కలుగును గాక, యుద్ధము కోసం నా చేతులకు శిక్షణ, నా వ్రేళ్ళకు పోరాటం నేర్పారు.


వారి నోళ్ళలో దేవుని స్తుతి వారి చేతుల్లో రెండంచుల ఖడ్గం ఉండును గాక.


బలాఢ్యుడా, మీ ఖడ్గాన్ని నడుముకు కట్టుకోండి; వైభవం ప్రభావాలను ధరించుకోండి.


ఆయన నా నోటిని పదునైన ఖడ్గంగా చేశారు, తన చేతి నీడలో నన్ను దాచారు; నన్ను మెరుగుపెట్టిన బాణంలా చేసి తన అంబులపొదిలో నన్ను దాచారు.


“నీవు నాకు గండ్రగొడ్డలివంటివాడవు, యుద్ధ ఆయుధంవంటివాడవు నీతో నేను దేశాలను చిన్నాభిన్నం చేస్తాను, నీతో రాజ్యాలను నాశనం చేస్తాను,


ప్రశస్తమైన సీయోను పిల్లలు ఎలా అయిపోయారు, ఒకప్పుడు వారి విలువ బంగారంతో తూగేది, ఇప్పుడు మట్టి కుండలుగా, కుమ్మరి చేతి పనిగా పరిగణించబడుతున్నారు!


“అంతేకాక నేను మీ సంతానం నుండి ప్రవక్తలను, మీ యవకులలో నుండి నాజీరులను లేవనెత్తాను. ఇశ్రాయేలీయులారా! ఇది నిజం కాదా?” అని యెహోవా ప్రకటిస్తున్నారు.


ఏశావు పర్వతాలను పరిపాలించడానికి రక్షకులు సీయోను పర్వతం ఎక్కుతారు, రాజ్యం యెహోవాది అవుతుంది.


“వీరు ఏమి చేయడానికి వస్తున్నారు?” అని నేను అడిగాను. అందుకాయన, “ఎవ్వరూ తమ తల ఎత్తకుండ యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే, అయితే కంసాలులు వారిని భయభ్రాంతులకు గురిచేసి, యూదా దేశంలోని ప్రజలను చెదరగొట్టడానికి తమ కొమ్ములను ఎత్తిన దేశాల కొమ్ములను పడగొట్టడానికి వచ్చారు” అని అన్నారు.


రక్షణ అనే శిరస్త్రాణాన్ని, దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోండి.


నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు పందాన్ని ముగించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను.


దేవుని వాక్యం సజీవమైనది చురుకైనది. అది రెండంచులు కలిగిన ఏ ఖడ్గం కన్నా పదును కలిగి, ప్రాణాన్ని, ఆత్మను, కీళ్ళను, మూలుగను వేరు చేస్తూ లోనికి చొచ్చుకొని పోతూ, హృదయం యొక్క ఆలోచనలను, వైఖరిని పరీక్షిస్తుంది.


ఆయన కుడిచేతిలో ఏడు నక్షత్రాలను పట్టుకున్నాడు; ఆయన నోటి నుండి పదును గల రెండు అంచుల ఖడ్గం బయటకు వస్తుంది; ఆయన ముఖం పూర్తి తేజస్సుతో ప్రకాశిస్తున్న సూర్యునిలా ఉంది.


ఈ రాజులందరూ మృగంతో పాటు కలిసి గొర్రెపిల్లకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తారు కాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు కాబట్టి ఆయన వారందరి మీద విజయం పొందుతాడు. ఆయనతో పాటు ఆయనచే పిలువబడిన వారు, ఏర్పరచబడినవారు ఆయనను నమ్మకంగా వెంబడించినవారు ఉంటారు.


దేశాలను నరకడానికి ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గం బయటకు వస్తుంది. “ఆయన ఒక ఇనుపదండంతో వారిని పరిపాలిస్తారు.” ఆయన సర్వశక్తిగల దేవుని తీవ్రమైన ఉగ్రత అనే ద్రాక్ష గానుగ తొట్టిని త్రొక్కుతారు.


మిగిలిన వారు ఆ గుర్రం మీద కూర్చుని స్వారీ చేస్తూ వస్తున్న వాని నోటి నుండి బయటకు వస్తున్న ఖడ్గంతో చంపబడ్డారు. అప్పుడు పక్షులన్నీ వారి మాంసాన్ని కడుపారా తిన్నాయి.


“పెర్గములో ఉన్న సంఘ దూతకు వ్రాసే సందేశం: పదునైన రెండు అంచులు గల ఖడ్గం కలవాడు ఈ మాటలు చెప్తున్నాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ