Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




జెకర్యా 8:9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “ఇప్పుడు ఈ మాటలు వినండి, ‘మందిరాన్ని కట్టడానికి మీ చేతులను బలపరచుకోండి.’ సైన్యాల యెహోవా మందిర పునాది వేసినప్పుడు ఉన్న ప్రవక్తలు చెప్పింది ఇదే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చు నదేమనగా–సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరమును కట్టుటకై దాని పునాదివేసిన దినమున ప్రవక్తల నోట పలుకబడిన మాటలు ఈ కాలమున వినువారలారా, ధైర్యము తెచ్చుకొనుడి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే సేనల ప్రభువు యెహోవా మందిరాన్ని కట్టడానికి దాని పునాది వేసిన దినాన ప్రవక్తల నోట పలకబడిన మాటలు ఈ కాలంలో వినే మీరంతా ధైర్యం తెచ్చుకోండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

9 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “ధైర్యంగా ఉండండి! సర్వశక్తిమంతుడైన యెహోవా ముందుగా తన ఆలయాన్ని నిర్మించటానికి పునాదులు వేసినప్పుడు ప్రవక్తలు ఇచ్చిన సందేశాన్నే ప్రజలైన మీరు ఈనాడు వింటున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “ఇప్పుడు ఈ మాటలు వినండి, ‘మందిరాన్ని కట్టడానికి మీ చేతులను బలపరచుకోండి.’ సైన్యాల యెహోవా మందిర పునాది వేసినప్పుడు ఉన్న ప్రవక్తలు చెప్పింది ఇదే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




జెకర్యా 8:9
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

అప్పుడు ఇశ్రాయేలీయుల గురించి యెహోవా మోషేకు ఇచ్చిన నియమనిబంధనలను నీవు జాగ్రత్తగా పాటిస్తే, నీవు విజయం సాధిస్తావు. ధైర్యంగా దృఢంగా ఉండు. భయపడకు, నిరుత్సాహపడకు.


దావీదు తన కుమారుడైన సొలొమోనుతో ఇంకా మాట్లాడుతూ ఇలా చెప్పాడు, “దృఢంగా, ధైర్యంగా ఉంటూ పని చేయి. నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉంటారు కాబట్టి భయపడకు దిగులుపడకు. యెహోవా ఆలయ సేవకు సంబంధించిన పనులన్నీ ముగిసేవరకు ఆయన నిన్ను ఏమాత్రం విడిచిపెట్టరు.


అయితే మీరు మాత్రం ధైర్యంగా ఉండండి, ఆశ వదులుకోవద్దు, ఎందుకంటే మీ పనికి ప్రతిఫలం లభిస్తుంది.”


ప్రవక్తయైన హగ్గయి, ఇద్దో కుమారుడైన జెకర్యాల ప్రవచనాలను బట్టి యూదుల పెద్దలు పనిని సక్రమంగా కొనసాగించారు. ఇశ్రాయేలీయుల దేవుని ఆజ్ఞ ప్రకారం పర్షియా రాజులైన కోరెషు, దర్యావేషు, అర్తహషస్తల ఆదేశాలను అనుసరించి వారు మందిరాన్ని కట్టడం ముగించారు.


బలహీనమైన చేతులను బలపరచండి, వణుకుతున్న మోకాళ్లను స్థిరపరచండి;


భయపడేవారితో ఇలా అనండి: “ధైర్యంగా ఉండండి, భయపడకండి; మీ దేవుడు వస్తారు ఆయన ప్రతీకారంతో వస్తారు. దైవిక ప్రతీకారంతో ఆయన మిమ్మల్ని రక్షించడానికి వస్తారు.”


రాజైన దర్యావేషు పరిపాలనలో రెండవ సంవత్సరం ఆరో నెల మొదటి రోజున ప్రవక్తయైన హగ్గయి ద్వారా యూదాదేశపు అధికారియు షయల్తీయేలు కుమారుడునైన జెరుబ్బాబెలుకు, ప్రధాన యాజకుడైన యెహోజాదాకు కుమారుడైన యెహోషువకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలా చెప్పింది:


షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, యెహోజాదాకు కుమారుడును ప్రధాన యాజకుడునైన యెహోషువ, మిగిలి ఉన్న ప్రజలందరూ తమ దేవుడైన యెహోవా మాట విని, తమ దేవుడైన యెహోవా ప్రవక్తయైన హగ్గయిని పంపి తెలియజేసిన సందేశానికి లోబడి యెహోవా పట్ల భయభక్తులు చూపించారు.


‘మీరు బాగా ఆలోచించండి. ఈ రోజు నుండి, తొమ్మిదవ నెల ఇరవై నాలుగవ రోజు నుండి, అంటే యెహోవా ఆలయ పునాది వేయబడిన రోజు నుండి జరిగిన వాటిని గురించి జాగ్రత్తగా ఆలోచించండి:


యూదాదేశపు అధికారియైన జెరుబ్బాబెలుతో ఇలా చెప్పు, నేను ఆకాశాన్ని భూమిని కదిలించబోతున్నాను.


యూదా, ఇశ్రాయేలూ, మీరు ఇతర ప్రజల్లో ఎలా శాపానికి గురై ఉన్నారో అలాగే మీరు దీవెనకరంగా ఉండేలా నేను మిమ్మల్ని రక్షిస్తాను. మీరు దీవెనకరంగా ఉంటారు. భయపడకండి, మీ చేతులు బలం కలిగి ఉండనివ్వండి.”


సైన్యాల యెహోవా వాక్కు నా దగ్గరకు వచ్చింది.


చివరిగా, ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయనలో బలవంతులై ఉండండి.


నా కుమారుడా, క్రీస్తు యేసులోని కృప చేత బలపడుతూ ఉండు.


దృఢంగా, ధైర్యంగా ఉండు, ఎందుకంటే నేను వారసత్వంగా ఇస్తానని వారి పూర్వికులతో ప్రమాణం చేసిన దేశానికి నీవు వారిని నడిపిస్తావు.


ఈ ధర్మశాస్త్ర గ్రంథం ఎప్పుడు నీ పెదాల మీద ఉండాలి; పగలు రాత్రి దానిని ధ్యానించాలి, తద్వార నీవు దానిలో వ్రాయబడి ఉన్న ప్రతిదీ శ్రద్ధగా చేయగలవు. అప్పుడు నీవు విజయవంతంగా వర్ధిల్లుతావు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ