Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




జెకర్యా 3:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 అప్పుడు నేను, “అతని తలపై శుభ్రమైన తలపాగా పెట్టండి” అని చెప్పగా, యెహోవా దూత ప్రక్కన నిలబడి ఉండగా వారు అతని తలపై శుభ్రమైన తలపాగా ఉంచి, అతనికి బట్టలు తొడిగించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 –అతని తలమీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవిచేయగా వారు అతని తలమీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి; యెహోవాదూత దగ్గర నిలుచుండెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 “అతని తల మీద తెల్లని పాగా పెట్టించండి” అని ఆయన చెప్పినప్పుడు వారు యెహోవా దూత సమక్షంలో అతని తలకు తెల్లని పాగా పెట్టి, దుస్తులు ధరింపజేసి అతణ్ణి అలంకరించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

5 అప్పుడు నేను, “అతని తలపై శుభ్రమైన తలపాగా ఉంచు” అని అన్నాను. కావున ఒక శుభ్రమైన తల పాగాను వారతని తలపై పెట్టారు. యెహోవా దూత అక్కడ నిలబడి వుండగా వారు అతనికి నూతన వస్త్రాలు తొడిగారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 అప్పుడు నేను, “అతని తలపై శుభ్రమైన తలపాగా పెట్టండి” అని చెప్పగా, యెహోవా దూత ప్రక్కన నిలబడి ఉండగా వారు అతని తలపై శుభ్రమైన తలపాగా ఉంచి, అతనికి బట్టలు తొడిగించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




జెకర్యా 3:5
13 ပူးပေါင်းရင်းမြစ်များ  

నేను నీతిని నా దుస్తులుగా ధరించాను; న్యాయం నాకు వస్త్రం నా తలపాగా అయ్యింది.


అతని తలమీద తలపాగాను పెట్టి పవిత్ర చిహ్నాన్ని తలపాగాకు తగిలించాలి.


అద్దాలు, సన్నపునారతో చేసిన ముసుగులు, తలపాగాలు, శాలువాల్ని తీసివేస్తారు.


యాజకునిలా తలపాగా ధరించిన పెండ్లికుమారునిలా నగలతో అలంకరించుకున్న పెండ్లికుమార్తెలా ఆయన నాకు రక్షణ వస్త్రాలను ధరింపచేశారు ఆయన నీతి అనే పైబట్టను నాకు ధరింపచేశారు కాబట్టి యెహోవాలో నేను ఎంతో ఆనందిస్తున్నాను. నా దేవునిలో నా ఆత్మ సంతోషిస్తుంది.


యాజకులు పరిశుద్ధ ఆవరణంలోకి ప్రవేశించిన తర్వాత, వారు పరిచర్య చేసే వస్త్రాలను విప్పివేసే వరకు వారు బయటి ఆవరణంలోనికి వెళ్లకూడదు, ఎందుకంటే ఇవి పరిశుద్ధమైనవి. ప్రజలు ఉండే స్థలానికి వెళ్లేటప్పుడు యాజకులు వేరే బట్టలు ధరించాలి.”


తర్వాత యెహోవా దూత యెహోషువకు ఈ ఆదేశం ఇచ్చాడు:


వారి నుండి వెండి బంగారాలు తీసుకుని కిరీటం చేసి దానిని ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువ తలమీద పెట్టి,


ఇరవైనలుగురు పెద్దలు లేచి సింహాసనం మీద ఆసీనుడై ఎల్లకాలం జీవిస్తున్నవాని ముందు సాగిలపడి ఆరాధిస్తూ, గౌరవంతో తమ కిరీటాలు తీసి ఆ సింహాసనం ముందు వేసి ఇలా చెప్పారు:


ఆ సింహాసనం చుట్టూ మరో ఇరవైనాలుగు సింహాసనాలు, వాటి మీద ఇరవైనలుగురు పెద్దలు కూర్చుని ఉన్నారు. వారు తెల్లని వస్త్రాలు ధరించుకొని తలల మీద బంగారు కిరీటాలు కలిగి ఉన్నారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ