Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




జెకర్యా 2:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 పరిశుద్ధ దేశంలో యెహోవా యూదాను తన స్వాస్థ్యంగా సొంతం చేసుకుంటారు, యెరూషలేమును మళ్ళీ ఎన్నుకుంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 మరియు తనకు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశములో యూదాను స్వతంత్రించుకొనును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 ప్రతిష్ఠితమైన దేశంలో యెహోవా యూదాను తన సొత్తుగా సొంతం చేసుకుంటాడు. ఆయన యెరూషలేమును మళ్ళీ కోరుకుంటున్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

12 యెహోవా మళ్లీ యెరూషలేమును తన ప్రత్యేక నగరంగా ఎంపిక చేస్తాడు. మరియు యూదా పవిత్ర భూమిలో తన భాగంగా ఉంటుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 పరిశుద్ధ దేశంలో యెహోవా యూదాను తన స్వాస్థ్యంగా సొంతం చేసుకుంటారు, యెరూషలేమును మళ్ళీ ఎన్నుకుంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




జెకర్యా 2:12
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

అయితే ఇప్పుడు నా పేరు ఉండేలా యెరూషలేమును ఎన్నుకున్నాను. నా ప్రజలైన ఇశ్రాయేలును పరిపాలించడానికి దావీదును ఎన్నుకున్నాను.’


హామాను తనకు జరిగిందంతా తన భార్య జెరషుకు, తన స్నేహితులందరికి తెలియజేశాడు. అతని సలహాదారులు, అతని భార్య జెరెషు అతనితో అన్నారు, “ఎవరి ఎదుట నీ పతనం ప్రారంభమైందో, ఆ మొర్దెకై యూదుడు కాబట్టి, అతని ఎదుట నీవు నిలబడలేవు, నీవు ఖచ్చితంగా పడిపోతావు.”


“నేను అభిషేకించిన వారిని మీరు ముట్టకూడదు; నా ప్రవక్తలకు హాని చేయకూడదు.”


యెహోవా సీయోనును ఏర్పరచుకున్నారు, దానిని తన నివాస స్థలంగా ఆయన కోరుకున్నారు.


“ఇది నిత్యం నాకు విశ్రాంతి స్థలంగా ఉంటుంది; ఇక్కడ నేను సింహాసనాసీనుడనవుతాను, ఎందుకంటే నేను దీనిని కోరుకున్నాను.


యెహోవా తన కోసం యాకోబును ఎన్నుకున్నారు. ఇశ్రాయేలును తన విలువైన స్వాస్థ్యంగా ఎన్నుకున్నారు.


యెహోవాను దేవునిగా కలిగిన దేశం ధన్యమైనది. తన వారసత్వంగా ఆయన తన కోసం ఎంచుకున్న ప్రజలు ధన్యులు.


ఓ దేవా, లేవండి, భూమికి తీర్పు తీర్చండి, ఎందుకంటే అన్ని దేశాలు మీ వారసత్వంగా ఉన్నాయి.


యెహోవా యాకోబుపై జాలి చూపుతారు; ఆయన మరలా ఇశ్రాయేలును ఏర్పరచుకొని వారిని వారి స్వదేశంలో స్థిరపరుస్తారు. విదేశీయులు వారిని కలుసుకుంటారు యాకోబు వారసులతో ఏకమై ఉంటారు.


సాయంకాలంలో ఆకస్మిక భయం! ఉదయం కాక ముందే వారు కనుమరుగవుతారు! మమ్మల్ని దోచుకునేవారి భాగం ఇదే, మా సొమ్ము దొంగతనం చేసేవారికి దొరికేది ఇదే.


భూమి అంచుల నుండి నేను మిమ్మల్ని తీసుకువచ్చాను, మారుమూల ప్రాంతాల నుండి పిలుచుకున్నాను. నేను అన్నాను, ‘నీవు నా సేవకుడవు’; నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నిన్ను త్రోసివేయలేదు.


యాకోబులో భాగమైన వాడు వీటిలాంటివాడు కాదు, ఆయన తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు గోత్రంతో పాటు, అన్నిటిని సృజించారు. ఆయన పేరు సైన్యాల యెహోవా.


“ ‘అయితే నిన్ను మ్రింగివేసేవాళ్లంతా మ్రింగివేయబడతారు; నీ శత్రువులందరూ బందీలుగా కొనిపోబడతారు. నిన్ను దోచుకునేవారు దోచుకోబడతారు; నిన్ను పాడుచేసే వారందరిని నేను పాడుచేస్తాను.


యాకోబులో భాగమైన వాడు వీటిలాంటివాడు కాదు, ఆయన తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు గోత్రంతో పాటు, అన్నిటిని సృజించారు, ఆయన పేరు సైన్యాల యెహోవా.


“ఇది కూడా నీవు ప్రకటించు: సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: ‘నా పట్టణాలు మళ్ళీ అభివృద్ధితో నిండుతాయి, యెహోవా మళ్ళీ సీయోనును ఆదరిస్తారు, యెరూషలేమును ఎన్నుకుంటారు.’ ”


అప్పుడు యెహోవా సాతానుతో, “సాతానా, యెహోవా నిన్ను గద్దిస్తారు! యెరూషలేమును ఎన్నుకున్న యెహోవా నిన్ను గద్దిస్తారు! ఈ మనిషి మంటలో నుండి తీసిన మండుతున్న కర్రలాంటి వాడు కాదా?” అని అన్నారు.


ఆయన అతన్ని ఎడారి ప్రదేశంలో, శబ్దాలు వినబడే బంజరు భూమిలో కనుగొన్నారు. తన గూడును కదిలించి, తన పిల్లల పైగా అల్లాడుతూ ఉండే, వాటిని పైకి తీసుకెళ్లడానికి దాని రెక్కలు చాపి వాటిని పైకి మోసుకెళ్లే గ్రద్దలా, ఆయన అతన్ని చుట్టూ ఆవరించి సంరక్షిస్తూ, తన కనుపాపలా ఆయన అతన్ని కాపాడారు.


యెహోవా ప్రజలే ఆయన భాగం, యాకోబు ఆయనకు కేటాయించబడిన వారసత్వము.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ