Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




జెకర్యా 14:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 కొండల మధ్య నేను ఏర్పరచిన ఆ లోయ ఆజేలు వరకు ఉంటుంది కాబట్టి మీరు ఆ కొండలోయ గుండా పారిపోతారు. యూదా రాజైన ఉజ్జియా కాలంలో భూకంపం వచ్చినప్పుడు మీరు పారిపోయినట్లు మీరు పారిపోతారు. అప్పుడు నా దేవుడైన యెహోవా తన పరిశుద్ధులందరితో కలిసి వస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 కొండలమధ్య కనబడులోయ ఆజీలువరకు సాగగా మీరు ఆ కొండలోయలోనికి పారిపోవుదురు. యూదారాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు, అప్పుడు నీతోకూడ పరిశుద్ధులందరును వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 కొండల మధ్య ఏర్పడిన లోయ ఆజీలు వరకు వ్యాపిస్తుంది. మీరు ఆ కొండ లోయగుండా పారిపోతారు. గతంలో యూదా రాజు ఉజ్జియా రోజుల్లో కలిగిన భూకంపానికి భయపడి పారిపోయినట్టు మీరు పారిపోతారు. నీతోబాటు పరిశుద్ధులందరూ వస్తారు. అప్పుడు నా దేవుడు యెహోవా ప్రత్యక్షం అవుతాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

5 ఆ పర్వతలోయ మీకు మరి సన్నిహితంగా రావటంతో మీరు పారిపోవటానికి ప్రయత్నిస్తారు. యూదా రాజైన ఉజ్జియా కాలంలో భూకంపం వచ్చినప్పుడు మీరు పారిపోయిన రీతిగా మీరిప్పుడు పారిపోతారు. కాని, నా దేవుడైన యెహోవా వస్తాడు. ఆయనయొక్క పవిత్ర జనులందరూ ఆయనతో ఉంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 కొండల మధ్య నేను ఏర్పరచిన ఆ లోయ ఆజేలు వరకు ఉంటుంది కాబట్టి మీరు ఆ కొండలోయ గుండా పారిపోతారు. యూదా రాజైన ఉజ్జియా కాలంలో భూకంపం వచ్చినప్పుడు మీరు పారిపోయినట్లు మీరు పారిపోతారు. అప్పుడు నా దేవుడైన యెహోవా తన పరిశుద్ధులందరితో కలిసి వస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




జెకర్యా 14:5
30 ပူးပေါင်းရင်းမြစ်များ  

యెహోవా రాబోతున్నారు. భూలోకానికి తీర్పు తీరుస్తారు. నీతిని బట్టి లోకానికి, తన నమ్మకత్వాన్ని బట్టి ప్రజలకు తీర్పు తీరుస్తారు.


యెహోవా లోకానికి తీర్పరిగా, రాజుగా రాబోతున్నారు. ఆయన పరిపాలన ఆయన తీర్పులు న్యాయసమ్మతమైనవి.


ఉరుముతో, భూకంపంతో, గొప్ప శబ్దంతో సుడిగాలి తుఫానుతో దహించే అగ్నిజ్వాలలతో సైన్యాల యెహోవా వస్తారు.


ప్రతి వైపు ఉన్న అన్ని దేశాల్లారా, త్వరగా రండి, అక్కడ సమకూడండి. యెహోవా, మీ వీరులను తీసుకురండి!


యూదాకు రాజుగా ఉజ్జియా, ఇశ్రాయేలు రాజుగా యెహోయాషు కుమారుడైన యరొబాము ఉన్న సమయంలో, భూకంపం రావడానికి రెండు సంవత్సరాలు ముందే ఇశ్రాయేలు ప్రజలను గురించి తెకోవలోని గొర్రెల కాపరులలో ఒకడైన ఆమోసు చూసిన దర్శనము.


షాఫీరు వాసులారా, దిగంబరులై సిగ్గు పడుతూ దాటి వెళ్లండి. జయనాను నివాసులు బయటకు రారు. బేత్-ఏజెల్ శోకంలో ఉంది; అది ఇక ఎన్నడు మిమ్మల్ని కాపాడదు.


“మహా పర్వతమా! నీవు ఎంతటి దానివి? జెరుబ్బాబెలు ఎదుట నీవు నేలమట్టం అవుతావు. అప్పుడు ‘దేవుడు దీవిస్తారు గాక! దేవుడు దీవిస్తారు గాక!’ అని కేకలు వేస్తుండగా అతడు పైరాయిని తీసుకువస్తాడు.”


వారి కేకలు విని చుట్టూరా ఉన్న ఇశ్రాయేలీయులు, “మనలను కూడా భూమి మ్రింగివేస్తుంది!” అని అంటూ అరుస్తూ పారిపోయారు.


ఎందుకంటే మనుష్యకుమారుడు తన తండ్రి మహిమతో తన దూతలతో కూడ రాబోతున్నాడు. అప్పుడు ఆయన ప్రతివానికి వాని పనుల ప్రకారం ప్రతిఫలం ఇస్తాడు.


యేసు ఒలీవల కొండమీద కూర్చుని ఉన్నప్పుడు, తన శిష్యులు ఆయన దగ్గరకు ఒంటరిగా వచ్చారు. వారు, “ఈ సంగతులు ఎప్పుడు జరుగుతాయి, నీ రాకడకు యుగాంతం కావడానికి సూచనలు ఏమైనా కనబడతాయా?” మాకు చెప్పుమని అడిగారు.


మనుష్యకుమారుడు తన మహిమలో, దేవదూతలందరితో వచ్చేటప్పుడు, ఆయన తన మహిమగల సింహాసనం మీద కూర్చుని ఉంటాడు.


అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావంతో గొప్ప మహిమతో మేఘాల మీద రావడం చూస్తారు.


అతడు ఇలా అన్నాడు: “యెహోవా సీనాయి పర్వతం నుండి వచ్చారు శేయీరు నుండి వారి మీద ఉదయించారు; పారాను పర్వతం నుండి ప్రకాశించారు. వేవేల పరిశుద్ధులతో ఆయన వచ్చారు, దక్షిణం నుండి, పర్వత వాలు నుండి వచ్చారు.


మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో కలిసివచ్చినపుడు మన తండ్రియైన దేవుని ముందు మీరు నిందారహితులుగా పవిత్రులుగా ఉండడానికి ఆయన మీ హృదయాలను బలపరచును గాక.


ఆ దుర్మార్గుడు బయలుపరచబడినప్పుడు, ప్రభువైన యేసు తన నోటి ఊపిరితో అతన్ని పడగొట్టి, తన రాకడ ప్రకాశంతో అతన్ని నాశనం చేస్తారు.


మీరు కూడా ఓపిక కలిగి ఉండండి. ప్రభువు రాకడ దగ్గరలో ఉన్నది కాబట్టి మీ హృదయాలను బలపరచుకోండి.


సరిగ్గా అదే గంటలో ఒక పెద్ద భూకంపం వచ్చి ఆ పట్టణంలో పదవ భాగం కూలిపోయింది. ఏడు వేలమంది ప్రజలు చనిపోయారు, అయితే మిగిలిన వారికి భయం కలిగి పరలోకం నుండి పరిపాలిస్తున్న దేవుని మహిమపరిచారు.


అప్పుడు నేను ఒక తెల్లని సింహాసనాన్ని దాని మీద కూర్చున్న ఒకరిని చూశాను. భూమి ఆకాశాలు ఆయన సన్నిధి నుండి పారిపోయాయి వాటికి ఎక్కడ స్థలం లేదు.


అప్పుడు తీర్పు తీర్చడానికి అధికారం ఇవ్వబడినవారు కూర్చుని ఉన్న సింహాసనాలను నేను చూశాను. యేసును గురించి సాక్ష్యాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి తలలు నరికివేయబడి హతులైనవారి ఆత్మలను నేను చూశాను. వారు ఆ మృగాన్ని గాని వాని విగ్రహాన్ని గాని పూజించలేదు, వారు దాని ముద్రను తమ నుదుటి మీద గాని చేతి మీద గాని వేయించుకోలేదు. వారు బ్రతికివచ్చి క్రీస్తుతో పాటు వెయ్యి సంవత్సరాలు పరిపాలించారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ