Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




జెకర్యా 12:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 “ఆ రోజున నేను యూదా నాయకులను కట్టెల క్రింద నిప్పులా పనల క్రింద దివిటీలా చేస్తాను. వారు నాలుగు వైపుల ఉన్న ప్రజలందరినీ కాల్చివేస్తారు, కాని యెరూషలేము దాని స్థానంలో చెక్కుచెదరకుండా ఉంటుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 ఆ దినమున నేను యూదా అధికారులను కట్టెల క్రింది నిప్పులుగాను పనల క్రింది దివిటీగాను చేతును, వారు నలుదిక్కులనున్న జనములనందరిని దహించుదురు. యెరూషలేమువారు ఇంకను తమ స్వస్థలమగు యెరూషలేములో నివసించుదురు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 ఆ దినాన నేను యూదా అధికారులను కట్టెల కింద మంటగా చేస్తాను, పనల కింద కాగడాగా చేస్తాను, వారు నాలుగు దిక్కుల్లో ఉన్న ప్రజలందరినీ దహించివేస్తారు. యెరూషలేము నివాసులు తమ స్వస్థలంలో స్థిరంగా నివసిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

6 ఆ సమయంలో యూదా నాయకులను అరణ్యంలో చెలరేగిన అగ్నిలా నేను చేస్తాను. అగ్ని ఎండు గడ్డిని దగ్ధం చేసినట్లు, వారు తమ శత్రువులను నాశనం చేస్తారు. చుట్టూవున్న వారి శత్రువులను వారు నాశనం చేస్తారు. యెరూషలేము ప్రజలు మళ్లీ తీరికగా కూర్చుని విశ్రాంతి తీసుకుంటారు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 “ఆ రోజున నేను యూదా నాయకులను కట్టెల క్రింద నిప్పులా పనల క్రింద దివిటీలా చేస్తాను. వారు నాలుగు వైపుల ఉన్న ప్రజలందరినీ కాల్చివేస్తారు, కాని యెరూషలేము దాని స్థానంలో చెక్కుచెదరకుండా ఉంటుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




జెకర్యా 12:6
25 ပူးပေါင်းရင်းမြစ်များ  

నీవు కుడి వైపుకు ఎడమవైపుకు వ్యాపిస్తావు; నీ వారసులు దేశాలను స్వాధీనం చేసుకుని నిర్జనమైన వారి పట్టణాల్లో స్థిరపడతారు.


కుడి ప్రక్కన దానిని వారు మ్రింగుతారు కాని ఇంకా ఆకలితోనే ఉంటారు. ఎడమ ప్రక్కన దానిని తింటారు కాని తృప్తి పొందరు. వారిలో ప్రతిఒక్కరు తన సంతానం యొక్క మాంసాన్ని తింటారు.


“యెహోవా ఇలా అంటున్నారు: “ ‘నేను యాకోబు ఇంటివారిని చెర నుండి తిరిగి రప్పించి, అతని నివాసాలపై కనికరం చూపుతాను. పట్టణం దాని శిథిలాల మీద మరలా కట్టబడుతుంది, రాజభవనం దాని స్థలంలోనే ఉంటుంది.


యాకోబు అగ్నిలా, యోసేపు మంటలా ఉంటారు; ఏశావు కొయ్యకాలులా ఉంటాడు, వారు అతనికి నిప్పంటించి నాశనం చేస్తారు. ఏశావు వారిలో నుండి ఎవరూ తప్పించుకోలేరు” అని యెహోవా చెప్పారు.


“సీయోను కుమార్తె, లేచి, కళ్ళం త్రొక్కు, నేను నీకు ఇనుప కొమ్ములు ఇస్తాను; ఇత్తడి డెక్కలు ఇస్తాను. నీవు అనేక దేశాలను ముక్కలుగా విరగ్గొడతావు.” నీవు వారి అన్యాయపు సంపదను యెహోవాకు సమర్పిస్తావు. వారి ఆస్తులను సర్వలోక ప్రభువుకు సమర్పిస్తావు.


“కాబట్టి యెహోవా చెప్పే మాట ఇదే: ‘నేను కనికరంతో యెరూషలేము వైపు తిరుగుతాను, అక్కడ నా మందిరం తిరిగి కట్టబడుతుంది. యెరూషలేము మీద నిర్మాణకులు కొలతలు వేస్తారు’ అని సైన్యాల యెహోవా చెప్తున్నారు.


లెబానోనూ! అగ్ని వచ్చి నీ దేవదారు చెట్లను కాల్చివేయునట్లు, నీ తలుపులు తీయి.


అప్పుడు యూదా నాయకులు తమ హృదయాల్లో, ‘యెరూషలేము ప్రజలకు వారి దేవుడైన సైన్యాల యెహోవా తోడుగా ఉన్నందుకు వారు బలంగా ఉన్నారు’ అనుకుంటారు.


పరిశుద్ధ దేశంలో యెహోవా యూదాను తన స్వాస్థ్యంగా సొంతం చేసుకుంటారు, యెరూషలేమును మళ్ళీ ఎన్నుకుంటారు.


అతనితో ఇలా అన్నాడు: “నీవు ఆ యువకుని దగ్గరికి పరుగెత్తుకొని వెళ్లి ఇలా చెప్పు, ‘యెరూషలేములో మనుష్యులు పశువులు విస్తారంగా ఉన్నందుకు, అది గోడలులేని పట్టణంలా ఉంటుంది.


సైన్యాల యెహోవా వారిని కాపాడతారు. వారు నాశనం చేస్తూ వడిసెల రాళ్లతో గెలుస్తారు. వారు త్రాగి, ద్రాక్షారసాన్ని త్రాగినట్లుగా వారు గర్జిస్తారు; బలిపీఠం మూలల్లో చిలకరించడానికి ఉపయోగించే గిన్నెలా వారు నిండుగా ఉంటారు.


సత్యంగా మాట్లాడంలో దేవుని శక్తిలో; కుడిచేతిలో ఎడమ చేతిలో నీతి అనే ఆయుధాలను కలిగి;


వారు భూమి అంతటా ప్రయాణించి దేవుని ప్రజలు ఉన్నచోటును, ఆయన ప్రేమించిన పట్టణాన్ని ముట్టడిస్తారు. కానీ పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేస్తుంది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ