Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




జెకర్యా 12:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 భూమిపై ఉన్న దేశాలన్నీ దానికి వ్యతిరేకంగా సమకూడినప్పుడు, ఆ రోజున నేను యెరూషలేమును అన్ని దేశాలకు బరువైన బండగా చేస్తాను. దాన్ని తొలగించడానికి ప్రయత్నించే వారందరూ తమను తాము గాయపరచుకుంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైనజనులకు బరువైన రాయిగా చేతును, దానిని ఎత్తి మోయువారందరు మిక్కిలి గాయ పడుదురు, భూజనులందరును దానికి విరోధులై కూడుదురు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 భూమిపై ఉన్న ఇతర జాతులన్నీ యెరూషలేముకు విరోధంగా సమకూడతాయి. ఆ రోజుల్లో నేను యెరూషలేమును సమస్త జాతులకు బరువైన రాయిగా చేస్తాను, దాన్ని తొలగించాలని చూసేవాళ్ళంతా గాయాలపాలు అవుతారు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

3 కాని నేను యెరూషలేమును ఒక బరువైన బండలా చేస్తాను. దానిని తీసుకోడానికి ఎవరైనా ప్రయత్నిస్తే అది అతనినే గాయపర్చుతుంది. ఆ ప్రజలు నిజంగా నరకబడతారు, గీకబడతారు. కాని భూమిపైగల దేశాలన్నీ కలిసి యెరూషలేము మీద యుద్ధానికి వస్తాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 భూమిపై ఉన్న దేశాలన్నీ దానికి వ్యతిరేకంగా సమకూడినప్పుడు, ఆ రోజున నేను యెరూషలేమును అన్ని దేశాలకు బరువైన బండగా చేస్తాను. దాన్ని తొలగించడానికి ప్రయత్నించే వారందరూ తమను తాము గాయపరచుకుంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




జెకర్యా 12:3
31 ပူးပေါင်းရင်းမြစ်များ  

నిన్ను సేవించని దేశమైనా రాజ్యమైనా నాశనమవుతుంది; అది పూర్తిగా నాశనమవుతుంది.


యాకోబు అగ్నిలా, యోసేపు మంటలా ఉంటారు; ఏశావు కొయ్యకాలులా ఉంటాడు, వారు అతనికి నిప్పంటించి నాశనం చేస్తారు. ఏశావు వారిలో నుండి ఎవరూ తప్పించుకోలేరు” అని యెహోవా చెప్పారు.


నా మాట వినని దేశాల మీద కోపంతో, క్రోధంతో ప్రతీకారం తీసుకుంటాను.”


యాకోబు సంతానంలో మిగిలినవారు దేశాల మధ్య, అనేక జనాల మధ్య, అడవి మృగాలలో సింహంలా, గొర్రెల మందలలో దూరి, ఎవ్వరూ విడిపించలేనంతగా వాటిని త్రొక్కి చీల్చే కొదమసింహంలా ఉంటారు.


లెబానోనుపై నీవు చేసిన హింస నీ మీదికే వస్తుంది, పశువులను నాశనం చేసినందుకు నీ మీదికి భయంకరమైన తీర్పు వస్తుంది. నీవు మనుష్యులను హత్య చేసినందుకు, దేశాలను పట్టణాలను వాటి నివాసులను నాశనం చేసినందుకు ఇలా జరుగుతుంది.


ఆ సమయంలో నిన్ను హింసించిన వారందరిని నేను శిక్షిస్తాను. కుంటివారిని నేను రక్షిస్తాను; చెదరగొట్టబడిన వారిని సమకూరుస్తాను. వారు అవమానానికి గురైన ప్రతి దేశంలో నేను వారికి కీర్తిని, ఘనతను ఇస్తాను.


నేను రాజ సింహాసనాలను కూలదోసి ఇతర రాజ్యాల అధికారాన్ని నాశనం చేస్తాను. నేను రథాలను రథసారథులను కూలదోస్తాను; గుర్రాలు గుర్రపురౌతులు ఒకరి ఖడ్గం చేత ఒకరు కూలిపోతారు.


ఆ రోజు, మెగిద్దో మైదానంలో హదద్-రిమ్మోనులో జరిగిన రోదన కంటే యెరూషలేములోని రోదన అధికంగా ఉంటుంది.


ఆ రోజున నేను ప్రతి గుర్రానికి భయాన్ని, దాని రౌతుకు వెర్రిని పుట్టిస్తాను” అని యెహోవా చెప్తున్నారు. “నేను యూదాపై నా దృష్టి ఉంచి ఇతర ప్రజల గుర్రాలన్నిటికి గుడ్డితనం కలిగిస్తాను.


“ఆ రోజున నేను యూదా నాయకులను కట్టెల క్రింద నిప్పులా పనల క్రింద దివిటీలా చేస్తాను. వారు నాలుగు వైపుల ఉన్న ప్రజలందరినీ కాల్చివేస్తారు, కాని యెరూషలేము దాని స్థానంలో చెక్కుచెదరకుండా ఉంటుంది.


“ఆ రోజున పాపాన్ని అపవిత్రతను శుభ్రం చేసుకోవడానికి దావీదు వంశీయులకు, యెరూషలేము నివాసులకు ఒక నీటి ఊట తెరవబడుతుంది.


ఆ రోజున యెహోవా ప్రజల్లో గొప్ప భయాన్ని పుట్టిస్తారు. వారంతా శత్రువులుగా మారి ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటారు.


ఆ రోజున సూర్యకాంతి ఉండదు, చలి ఉండదు, చీకటి ఉండదు.


ఈ రాయి మీద పడినవారు ముక్కలైపోతారు గాని ఎవరి మీద ఈ రాయి పడుతుందో వారు దాని క్రింద నలిగిపోతారు” అని చెప్పారు.


ఈ రాయి మీద పడిన ప్రతివారు ముక్కలైపోతారు, కాని ఎవరి మీద రాయి పడుతుందో వారు దాని క్రింద నలిగిపోతారు” అని చెప్పారు.


అవి సూచకక్రియలను చేసే దయ్యపు ఆత్మలు. సర్వశక్తిమంతుడైన దేవుని మహాదినాన యుద్ధం చేయడానికి భూలోకమంతటిలో ఉన్న రాజులను పోగుచేయడానికి అవి వారి దగ్గరకు వెళ్లాయి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ