Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




జెకర్యా 1:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 ఆ తర్వాత నాతో మాట్లాడుతున్న దూత ఇలా అన్నాడు, “నీవు ఈ మాటను ప్రకటించు: సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: ‘యెరూషలేము, సీయోను గురించి నేనెంతో ఆసక్తి కలిగి ఉన్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 కాబట్టి నాతో మాటలాడుచున్నదూత నాతో ఇట్లనెను–నీవు ప్రకటన చేయ వలసినదేమనగా–సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు – నేను యెరూషలేము విషయములోను సీయోనువిషయములోను అధికాసక్తి కలిగియున్నాను;

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 అప్పుడు నాతో మాట్లాడుతున్న దూత నాతో ఇలా అన్నాడు “నువ్వు ఈ విధంగా ప్రకటించాలి, సేనల ప్రభువు యెహోవా ఇలా చెబుతున్నాడు. నాకు యెరూషలేము, సీయోనుల విషయంలో అమితమైన ఆసక్తి ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

14 తరువాత దేవదూత నాతో ఇలా అన్నాడు: ఈ విషయాలను ప్రజలకు చెప్పు. సర్వశక్తిమంతుడైన యెహోవా యిలా చెపుతున్నాడు: “యెరూషలేముపట్ల, సీయోనుపట్ల నాకు గాఢమైన ఆసక్తి ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 ఆ తర్వాత నాతో మాట్లాడుతున్న దూత ఇలా అన్నాడు, “నీవు ఈ మాటను ప్రకటించు: సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: ‘యెరూషలేము, సీయోను గురించి నేనెంతో ఆసక్తి కలిగి ఉన్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




జెకర్యా 1:14
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

యెరూషలేము నుండి శేషం వస్తుంది, సీయోను పర్వతం నుండి తప్పించుకున్నవారు వస్తారు. సైన్యాల యెహోవా రోషం దీన్ని సాధిస్తుంది.


హిజ్కియా, “నేను యెహోవా ఆలయానికి వెళ్తాను అనడానికి గుర్తు ఏంటి?” అని అడిగాడు.


నా ప్రజలను ఓదార్చండి, ఓదార్చండి, అని మీ దేవుడు చెప్తున్నారు.


యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి ఆమె యుద్ధకాలం ముగిసిందని ఆమె పాపదోషం తీరిపోయిందని యెహోవా చేతిలో ఆమె పాపాలన్నిటి కోసం రెండింతల ఫలం పొందిందని ఆమెకు తెలియజేయండి.


“మొరపెట్టు” అని ఒక స్వరం అంటుంది, నేను, “నేనేమని మొరపెట్టాలి?” అన్నాను. “ప్రజలందరు గడ్డి వంటివారు, వారి నమ్మకత్వమంతా పొలంలోని పువ్వు వంటిది.


యెహోవా శూరునిలా బయలుదేరతారు యోధునిలా ఆయన తన రోషాన్ని రేకెత్తిస్తారు; ఆయన హుంకరిస్తూ యుద్ధ నినాదం చేస్తూ, తన శత్రువుల మీద గెలుస్తారు.


ఆయన నీతిని తన కవచంగా ధరించారు, రక్షణను తన తలమీద శిరస్త్రాణంగా ధరించారు; ఆయన ప్రతీకార వస్త్రాలను ధరించారు పై వస్త్రం ధరించినట్లు ఆయన తనను తాను ఆసక్తితో చుట్టుకున్నారు.


పరలోకం నుండి, గంభీరమైన, పరిశుద్ధమైన మహిమగల సింహాసనం నుండి క్రిందికి చూడండి. మీ ఆసక్తి మీ బలము ఏవి? మా పట్ల మీకున్న జాలి కనికరం మా నుండి నిలిపివేయబడ్డాయి.


ఆయన ప్రభుత్వానికి, సమాధానానికి గొప్పతనానికి ముగింపు ఉండదు. ఆయన అప్పటినుండి ఎల్లకాలం వరకు దావీదు సింహాసనం మీద, అతని రాజ్యాన్ని ఏలుతూ, న్యాయంతోను నీతితోను రాజ్యాన్ని స్థాపించి స్థిరంగా ఉంచుతారు. సైన్యాలకు అధిపతియైన యెహోవా ఆసక్తి దీనిని నెరవేరుస్తుంది.


ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: చుట్టూ ఉన్న దేశాలు, ఎదోము వారంతా ద్వేషంతో, ఆనందంతో ఉప్పొంగుతూ నా దేశాన్ని దోపుడు సొమ్ముగా తీసుకున్నారు, కాబట్టి నేను తీవ్రమైన రోషంలో నేను వారికి వ్యతిరేకంగా మాట్లాడాను.’


“ఎఫ్రాయిమూ, నిన్ను ఎలా వదిలేయగలను? ఇశ్రాయేలూ, నిన్ను ఎలా అప్పగించగలను? నిన్ను ఎలా అద్మాలా పరిగణించగలను? సెబోయిములా నిన్ను ఎలా చేయగలను? నా హృదయం నాలో మారింది; నా జాలి అంతా ఉప్పొంగుతుంది.


అప్పుడు యెహోవా తన దేశంపట్ల ఆసక్తి చూపి, ప్రజలను కనికరించారు.


యెహోవా రోషం గలవారు ప్రతీకారం తీర్చుకునే దేవుడు; యెహోవా పగ తీర్చుకునేవారు ఉగ్రత గలవారు. యెహోవా తన శత్రువులపై ప్రతీకారం తీర్చుకుంటారు, తన శత్రువులపై తన ఉగ్రతను వెళ్లగ్రక్కుతారు.


కాబట్టి నాతో మాట్లాడుతున్న ఆ దూతకు యెహోవా దయగల ఆదరణ కలిగించే మాటలు చెప్పారు.


“ఇది కూడా నీవు ప్రకటించు: సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: ‘నా పట్టణాలు మళ్ళీ అభివృద్ధితో నిండుతాయి, యెహోవా మళ్ళీ సీయోనును ఆదరిస్తారు, యెరూషలేమును ఎన్నుకుంటారు.’ ”


అప్పుడు నేను, “నా ప్రభువా, ఇవి ఏంటి?” అని అడిగాను. నాతో మాట్లాడుతున్న ఆ దూత, “అవేంటో నీకు చూపిస్తాను” అని చెప్పాడు.


అప్పుడు నాతో మాట్లాడిన దూత తిరిగివచ్చి నిద్రపోతున్న వాన్ని లేపినట్లు నన్ను లేపాడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ