Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




జెకర్యా 1:1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 దర్యావేషు పరిపాలన రెండవ సంవత్సరం ఎనిమిదో నెలలో, ఇద్దో కుమారుడు బెరక్యా, బెరక్యా కుమారుడైన జెకర్యా ప్రవక్తకు వచ్చిన యెహోవా వాక్కు:

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము ఎనిమిదవ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడునైన జెకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 దర్యావేషు పాలించే కాలంలో రెండవ సంవత్సరం ఎనిమిదవ నెలలో యెహోవా వాక్కు బెరక్యా కొడుకు, ఇద్దో మనుమడు, ప్రవక్త అయిన జెకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చిన వాక్కు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

1 బెరక్యా కుమారుడు జెకర్యా. యెహోవా నుండి జెకర్యాకు ఒక వర్తమానం వచ్చింది. అది పర్షియా (పారశీకం) రాజైన దర్యావేషు పాలనలో రెండవ సంవత్సరం, ఎనిమిదవ నెలలో వచ్చింది. (జెకర్యా తండ్రి పేరు బెరక్యా. బెరక్యా ఇద్దో కుమారుడు. ఇద్దో ఒక ప్రవక్త.) ఆ వర్తమానం ఇలా ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 దర్యావేషు పరిపాలన రెండవ సంవత్సరం ఎనిమిదో నెలలో, ఇద్దో కుమారుడు బెరక్యా, బెరక్యా కుమారుడైన జెకర్యా ప్రవక్తకు వచ్చిన యెహోవా వాక్కు:

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




జెకర్యా 1:1
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

కాబట్టి యెరూషలేములో జరుగుతున్న దేవుని మందిరం పని ఆగిపోయింది. పర్షియా రాజైన దర్యావేషు హయాములో రెండవ సంవత్సరం వరకు పని ఆగిపోయింది.


ప్రవక్తయైన హగ్గయి ఇద్దోకు వారసుడు, ప్రవక్తయైన జెకర్యా యూదాలో, యెరూషలేములో ఉన్న యూదులకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా పేరట ప్రవచించారు.


ఇద్దో కుటుంబానికి జెకర్యా; గిన్నెతోను కుటుంబానికి మెషుల్లాము;


ఇద్దో, గిన్నెతోయి, అబీయా,


రాజైన దర్యావేషు పరిపాలనలో రెండవ సంవత్సరం ఆరో నెల మొదటి రోజున ప్రవక్తయైన హగ్గయి ద్వారా యూదాదేశపు అధికారియు షయల్తీయేలు కుమారుడునైన జెరుబ్బాబెలుకు, ప్రధాన యాజకుడైన యెహోజాదాకు కుమారుడైన యెహోషువకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలా చెప్పింది:


ఆరో నెల ఇరవై నాల్గవ రోజున ప్రారంభించారు. రాజైన దర్యావేషు పరిపాలించిన రెండవ సంవత్సరంలో,


అప్పుడు యెహోవా వాక్కు ప్రవక్తయైన హగ్గయి ద్వారా చెప్పింది ఏంటంటే:


రాజైన దర్యావేషు పరిపాలనలో రెండవ సంవత్సరం తొమ్మిదో నెల ఇరవై నాల్గవ రోజున యెహోవా వాక్కు ప్రవక్తయైన హగ్గయి దగ్గరకు వచ్చి తెలియజేసింది ఏంటంటే:


అదే నెల ఇరవై నాల్గవ రోజున యెహోవా వాక్కు ప్రవక్తయైన హగ్గయి దగ్గరకు రెండవసారి వచ్చి తెలియజేసింది ఏంటంటే:


దర్యావేషు పరిపాలనలో రెండవ సంవత్సరం శెబాతు అనే పదకొండవ నెల ఇరవై నాల్గవ రోజున ఇద్దో కుమారుడైన బెరక్యా, బెరక్యా కుమారుడైన జెకర్యా ప్రవక్తకు వచ్చిన యెహోవా వాక్కు.


యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:


రాజైన దర్యావేషు పరిపాలన నాలుగవ సంవత్సరం కిస్లేవు అనే తొమ్మిదవ నెల నాలుగో రోజున యెహోవా వాక్కు జెకర్యా దగ్గరకు వచ్చింది.


నీతిమంతుడు హేబెలు రక్తం మొదలుకొని బలిపీఠం దేవాలయానికి మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడు జెకర్యా రక్తం వరకు భూమి మీద చిందించబడిన నీతిమంతుల నిరపరాధ రక్తదోషం అంతా మీ మీదికి వస్తుంది.


అనగా, హేబెలు రక్తం మొదలుకొని బలిపీఠం దేవాలయానికి మధ్య చంపబడిన జెకర్యా రక్తం వరకు. అవును, నేను చెప్పేది నిజం, ఈ తరం వారే దానంతటికి బాధ్యులుగా ఎంచబడతారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ