Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




పరమగీతము 7:13 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

13 పుత్రదాత ఫలం సువాసన ఇస్తున్నది, నా ప్రియుడా, మా ద్వారబంధాల దగ్గరే అనేక రకాల శ్రేష్ఠఫలాలున్నాయి, నీకోసం వాటిని దాచి వుంచాను, క్రొత్తవి పాతవి అందులో ఉన్నాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

13 పుత్రదాత వృక్షము సువాసన నిచ్చుచున్నది నా ప్రియుడా, నేను నీకొరకు దాచియుంచిన నానావిధ శ్రేష్ఠఫలములు పచ్చివియు పండువియు మా ద్వారబంధములమీద వ్రేలాడుచున్నవి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

13 మాండ్రేక్ మొక్కలు కమ్మని సువాసనలీనుతున్నాయి. మా ఇంటి తలుపు దగ్గర చవులూరించే రక రకాల పళ్ళు కొత్తవీ పాతవీ ఉన్నాయి. ప్రియా, నేను నీ కోసం వాటిని దాచి ఉంచాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

13 ప్రేమ వర్ధక మండ్రేక ఔషధుల్నీ మా గుమ్మాన వేలాడే పరిమళభరితమైన పువ్వుల్నీ చూడు! ఓ నా ప్రియుడా, నీకై దాచి ఉంచాను ఎన్నెన్నో పండువీ, దోరవీ పండ్లు, తిని చూడు!

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

13 పుత్రదాత ఫలం సువాసన ఇస్తున్నది, నా ప్రియుడా, మా ద్వారబంధాల దగ్గరే అనేక రకాల శ్రేష్ఠఫలాలున్నాయి, నీకోసం వాటిని దాచి వుంచాను, క్రొత్తవి పాతవి అందులో ఉన్నాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




పరమగీతము 7:13
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

గోధుమ కోతకాలంలో రూబేను పొలాలకు వెళ్లాడు, అక్కడ ఉన్న పుత్రదాత వృక్షం పండ్లు కొన్ని తెచ్చి, తల్లి లేయాకు ఇచ్చాడు. రాహేలు లేయాతో, “నీ కుమారుడు తెచ్చిన పండ్లలో కొన్ని నాకు దయచేసి ఇవ్వు” అని అడిగింది.


అడవి చెట్ల మధ్య ఆపిల్ వృక్షంలా నా ప్రియుడు యువకుల మధ్య ఉన్నాడు, ఆయన నీడలో ఆనందమయినై కూర్చుండిపోయాను, ఆయన ఫలం నా రుచికి మధురము.


నీ మొక్కలు ఒక దానిమ్మతోట కోరుకున్న ఫలములతో, గోరింట జటామాంసి చెట్లతో,


ఉత్తర వాయువూ, మేలుకో, దక్షిణ వాయువూ, రా! నా ఉద్యానవనం మీద వీచండి, తద్వారా అందలి పరిమళ వాసన అన్ని వైపుల వ్యాపించాలి. నా ప్రియుడు తన ఉద్యాన వనానికి వచ్చి నచ్చిన పండ్లు రుచి చేయును గాక.


లోయలో గుబురుగా పెరిగిన అక్షోట చెట్ల దగ్గరకు లోయలో నూతన చిగురులను చూడాలని, ద్రాక్షచెట్లు చిగిరించాయో లేదో, దానిమ్మ చెట్లు పూత పట్టాయో లేదో చూడాలని వెళ్లాను.


ఒకవేళ నీవు నాకు సోదరుడిలా ఉంటే, నా తల్లి స్తనముల దగ్గర పెంచబడిన వాడవైయుంటే! అప్పుడు, నేను నిన్ను బయట కనుగొని ఉంటే, నిన్ను ముద్దాడేదాన్ని, నన్ను ఎవరూ నిందించేవారు కారు.


అయినా దాని లాభం, దాని సంపాదన యెహోవాకు చెందుతుంది; వాటిని నిల్వ ఉంచరు, కూడబెట్టరు. దాని లాభాలు యెహోవా సన్నిధిలో నివసించేవారికి సమృద్ధి ఆహారం, విలువైన వస్త్రాలు అందించడానికి ఉపయోగించబడతాయి.


యేసు వారితో, “పరలోక రాజ్యాన్ని గురించి ఉపదేశం పొంది దానిని పాటించే ప్రతి ధర్మశాస్త్ర ఉపదేశకుడు, తన ధననిధి నుండి పాత వాటిని క్రొత్త వాటిని బయటకు తెచ్చే ఒక ఇంటి యజమాని వంటివాడు” అని చెప్పారు.


“అందుకు ఆ రాజు, ‘ఈ నా సహోదర సహోదరీలలో బహు అల్పులైనవారికి చేశారు కాబట్టి, నాకు చేసినట్లే అని ఖచ్చితంగా మీతో చెప్తున్నాను’ అని వారితో అంటాడు.


మీరు నా శిష్యులుగా ఉండి ఎక్కువగా ఫలిస్తే నా తండ్రికి మహిమ కలుగుతుంది.


ప్రతి వారంలో మొదటి రోజున మీలో ప్రతి ఒక్కరు మీ సంపాదన బట్టి కొంత ధనాన్ని ప్రక్కన పెట్టి దాచి ఉంచండి. దానివల్ల నేను వచ్చినపుడు కానుకలు సేకరించాల్సిన అవసరం ఉండదు.


అయితే దీని గురించి: “ఎవరూ చూడని ఎవరూ వినని ఏ మనుష్యుని మనస్సు ఊహించనివాటిని దేవుడు తనను ప్రేమించేవారి కోసం సిద్ధపరచారు” అని వ్రాయబడి ఉంది.


ఎందుకంటే వెలుగు ఫలం సమస్త మంచితనాన్ని, నీతిని, సత్యాన్ని కలిగి ఉంటుంది.


మీరు మాటల్లో కాని పనులలో కాని, ఏమి చేసినా ప్రభువైన యేసు నామంలో చేయండి, తండ్రియైన దేవునికి ఆయన ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండండి.


ఎవరైనా మాట్లాడితే, వారు దేవుని మాటలే మాట్లాడాలి. ఎవరైనా సేవ చేస్తే, దేవుడు ఇచ్చే శక్తితోనే సేవ చేయాలి. అప్పుడు అన్ని విషయాల్లో యేసు క్రీస్తు ద్వారా దేవుడు స్తుతించబడతారు. ఆయనకే మహిమ, ప్రభావం నిరంతరం కలుగును గాక ఆమేన్.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ