Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




పరమగీతము 6:10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 తెల్లవారుజాములా, జాబిల్లిలా అందంగా, సూర్యునిలా ప్రకాశవంతంగా, నక్షత్రాల్లా గంభీరంగా కనిపించే ఈమె ఎవరు?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందముగలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళలునుగలదై వ్యూహితసైన్య సమభీకర రూపిణియునగు ఈమె ఎవరు?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 తొలిసంధ్యలా విరాజిల్లుతూ, జాబిల్లిలా మనోజ్ఞంగా, భానుతేజ ప్రకాశంతో, వ్యూహంగా ఏర్పడిన సైన్యమంత భయద సౌందర్యం గల ఈమె ఎవరు?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

10 ఎవరా యువతి? అరుణోదయంలా మెరుస్తోంది. చంద్రబింబమంత అందమైనది సూర్యుడంత ధగ ధగలాడుతోంది, పరలోక సేనలంతటి విభ్రాంతి గొలుపు ఆ యువతి ఎవరు?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 తెల్లవారుజాములా, జాబిల్లిలా అందంగా, సూర్యునిలా ప్రకాశవంతంగా, నక్షత్రాల్లా గంభీరంగా కనిపించే ఈమె ఎవరు?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




పరమగీతము 6:10
24 ပူးပေါင်းရင်းမြစ်များ  

అతడు మబ్బులు లేని ఉదయాన సూర్యోదయపు వెలుగులాంటివాడు, వాన వెలిసిన తర్వాతి వచ్చే తేజస్సులాంటివాడు; అది భూమి నుండి గడ్డిని మొలిపిస్తుంది.’


అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నకాల ప్రకాశం కన్నా ఎక్కువ ప్రకాశిస్తుంది. చీకటి ఉన్నా అది ఉదయపు వెలుగులా ఉంటుంది.


నేను సూర్యుడిని దాని ప్రకాశంలో చంద్రుడు వైభవంలో కదులుతున్నట్లు భావించి,


వారు అక్కడ, భయంతో మునిగిపోయి ఉన్నారు, ఎందుకంటే దేవుడు నీతిమంతుల గుంపులో ఉన్నారు.


నీతిమంతుల మార్గం ఉదయించే సూర్యునిలా, పూర్తి పగటి వెలుగు వచ్చేవరకు ప్రకాశిస్తుంది.


నా ప్రియురాలా, నీవు ఎంత అందమైనదానవు! ఓ, ఎంతో అందాలరాశివి! నీ కళ్లు గువ్వలు.


ధూమ స్తంభాకరంలో వర్తకుల దగ్గర సుగంధ చూర్ణాలన్నిటితో తయారుచేయబడిన బోళం పరిమళ వాసనతో అరణ్య మార్గాన నడిచి వస్తున్నదేంటి?


నా ప్రియురాలా, నీవు తిర్సా పట్టణంలా అందంగా ఉన్నావు, యెరూషలేములా మనోహరంగా ఉన్నావు, జెండాలు పట్టుకున్న సైన్యంలా గంభీరంగా ఉన్నావు.


తన ప్రియుని ఆనుకుని అరణ్యంలో నుండి నడచి వస్తున్నది ఎవరు? ఆపిల్ చెట్టు క్రింద నేను నిన్ను లేపాను; అక్కడ నీ తల్లి నిన్ను గర్భం దాల్చింది, అక్కడ ప్రసవ వేదనలో ఆమె నీకు జన్మనిచ్చింది.


అప్పుడు మీ వెలుగు ఉదయకాంతిలా ప్రకాశిస్తుంది. మీకు వెంటనే స్వస్థత కలుగుతుంది; అప్పుడు మీ నీతి మీ ముందుగా నడుస్తుంది యెహోవా మహిమ మీ వెనుక కాపలాగా ఉంటుంది.


రక్తపు మరకలు కలిగిన బట్టలు వేసుకుని ఎదోము నుండి బొస్రానుండి వస్తున్న ఇతడెవరు? రాజ వస్త్రాలను ధరించి గంభీరంగా నడుస్తూ గొప్ప బలంతో వస్తున్న ఇతడెవరు? “విజయాన్ని ప్రకటిస్తూ రక్షించగల సమర్థుడనైన నేనే.”


కాబట్టి నా ప్రవక్తల ద్వారా మిమ్మల్ని ముక్కలు చేశాను, నా నోటిమాటల ద్వారా మిమ్మల్ని చంపాను, అప్పుడు నా తీర్పులు మెరుపులా ప్రకాశిస్తాయి.


అయితే నా పేరుకు భయపడే మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు, అతని కిరణాలతో స్వస్థత కలుగుతుంది. మీరు శాలలోనుండి బయటకు వెళ్లిన క్రొవ్వినదూడల్లా ఉల్లాసంగా గంతులు వేస్తారు.


అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యునిలా ప్రకాశిస్తారు. వినడానికి చెవులుగలవారు విందురు గాక!” అని అన్నారు.


అక్కడ ఆయన వారి ముందు రూపాంతరం పొందారు. అప్పుడు ఆయన ముఖం సూర్యునిలా ప్రకాశించింది, ఆయన వస్త్రాలు వెలుగువలె తెల్లగా మారాయి.


అయినా మనల్ని ప్రేమించినవాని ద్వారా మనం అన్ని విషయాల్లో జయించినవారి కన్నా అధికంగా ఉన్నాము.


దాన్ని కళంకంగానీ, మడతలుగానీ అలాంటిది మరేది లేకుండా పరిశుద్ధంగా, నిర్దోషంగా మహిమ కలదిగా తన ముందు నిలబెట్టుకోవాలని, దాని కోసం తనను తాను సమర్పించుకున్నారు.


ఆయన కుడిచేతిలో ఏడు నక్షత్రాలను పట్టుకున్నాడు; ఆయన నోటి నుండి పదును గల రెండు అంచుల ఖడ్గం బయటకు వస్తుంది; ఆయన ముఖం పూర్తి తేజస్సుతో ప్రకాశిస్తున్న సూర్యునిలా ఉంది.


బలమైన మరొక దేవదూత మేఘాన్ని ధరించుకొని, తన తలమీద వానవిల్లు కలిగి పరలోకం నుండి దిగి రావడం నేను చూశాను. ఆ దేవదూత ముఖం సూర్యునిలా, కాళ్లు అగ్ని స్తంభాల్లా ఉన్నాయి.


అప్పుడు పరలోకంలో ఒక గొప్ప సూచన కనిపించింది: ఒక స్త్రీ సూర్యుని ధరించుకొని, కాళ్లక్రింద చంద్రుని, తన తలమీద పన్నెండు నక్షత్రాల కిరీటాన్ని పెట్టుకొని ఉంది.


ఆ పట్టణంపై సూర్యుడు గాని చంద్రుడు గాని ప్రకాశించాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుని మహిమ దానికి వెలుగు ఇస్తుంది గొర్రెపిల్ల దానికి దీపము.


“యేసు అనే నేను సంఘాల కోసమైన ఈ సాక్ష్యం మీకు ఇవ్వమని నా దూతను పంపాను. నేను దావీదు వేరును సంతానాన్ని, ప్రకాశవంతమైన వేకువ చుక్కను.”


అక్కడ రాత్రి ఉండదు. ప్రభువైన దేవుడే వారికి కాంతిని ఇస్తారు కాబట్టి వారికి దీపకాంతి గాని సూర్యకాంతి గాని అవసరం లేదు. వారు ఎల్లకాలం పరిపాలిస్తూ ఉంటారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ