రూతు 3:15 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 అంతేకాక, “నీవు కప్పుకున్న దుప్పటి తీసుకువచ్చి దాన్ని పట్టుకో” అని చెప్పాడు. ఆమె అలా చేసినప్పుడు, అతడు ఆరు కొలతల యవలను పోసి ఆమెపై పెట్టాడు. తర్వాత అతడు పట్టణానికి తిరిగి వెళ్లాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 మరియు అతడు–నీవు వేసికొనిన దుప్పటి తెచ్చిపట్టుకొనుమని చెప్పగా ఆమె దాని పట్టెను. అతడు ఆరు కొలల యవలను కొలచి ఆమె భుజముమీద నుంచగా ఆమె పురములోనికి వెళ్లెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 తరువాత అతడు “నువ్వు కప్పుకున్న దుప్పటి పట్టు” అనగా ఆమె దాన్ని పట్టింది. అతడు ఆరు కొలతల బార్లీ గింజలు కొలిచి ఆమె భుజానికెత్తాడు. ఆమె ఊళ్లోకి వెళ్ళిపోయింది. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్15 “నీ దుప్పటి నా దగ్గరకు తీసుకురా, దాన్ని తెరచి పట్టుకో” అన్నాడు బోయజు. అందుచేత రూతు తన దుప్పటి తెరచి పట్టుకుంది. ఆమె అత్తగారైన నయోమికి కానుకగా ఒక తూమెడు యవలు కోలిచి ఇచ్చాడు బోయజు. ఆ దుప్పటిని మూట కట్టి ఆమె భుజంమీద పెట్టి, బోయజు ఊళ్లోకి వెళ్లిపోయాడు. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 అంతేకాక, “నీవు కప్పుకున్న దుప్పటి తీసుకువచ్చి దాన్ని పట్టుకో” అని చెప్పాడు. ఆమె అలా చేసినప్పుడు, అతడు ఆరు కొలతల యవలను పోసి ఆమెపై పెట్టాడు. తర్వాత అతడు పట్టణానికి తిరిగి వెళ్లాడు. အခန်းကိုကြည့်ပါ။ |