Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




రూతు 2:13 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

13 అందుకు ఆమె, “నా ప్రభువా, నేను మీ పనివారిలో ఒకదాన్ని కానప్పటికి, మీరు నన్నాదరించి దయతో మాట్లాడారు. నేను మీ దృష్టిలో దయ సంపాదించుకోవడం కొనసాగాలి” అన్నది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

13 అందుకు ఆమె–నా యేలినవాడా, నేను నీ పనికత్తెలలో ఒకదానను కాకపోయినను, నీవు నన్నాదరించి నీ దాసురాలినగు నాయందు ప్రేమ గలిగి మాటలాడితివి గనుక నాయెడల నీకు కటాక్షము కలుగనిమ్మని చెప్పెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

13 అందుకు ఆమె “అయ్యా, నేను నీ దగ్గర పని చేసేదాన్ని కాకపోయినా, నన్ను ఆదరించారు. నీ దాసినైన నాతో దయగా మాట్లాడారు. నాపై మరింత దయ ఉంచండి” అని చెప్పింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

13 “అయ్యా! నేను కేవలం ఒక పనిమనిషిని, మీ పని మనుషుల్లో కనీసం ఒకదానితో సమానము కాను నేను. అయినా నన్ను గూర్చి ఎంతో దయగా మాట్లాడి, నన్ను ఆదరించారు. మీ దయ నాకు ఉంటే చాలు” ఆన్నది రూతు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

13 అందుకు ఆమె, “నా ప్రభువా, నేను మీ పనివారిలో ఒకదాన్ని కానప్పటికి, మీరు నన్నాదరించి దయతో మాట్లాడారు. నేను మీ దృష్టిలో దయ సంపాదించుకోవడం కొనసాగాలి” అన్నది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




రూతు 2:13
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆ దూతలు యాకోబు దగ్గరకు తిరిగివచ్చి, “నీ సోదరుడు ఏశావు దగ్గరకు వెళ్లాం, ఇప్పుడు అతడు నిన్ను కలవడానికి వస్తున్నాడు, అతనితో నాలుగువందలమంది మనుష్యులు ఉన్నారు” అని అన్నారు.


యాకోబు ఇలా అన్నాడు, “దయచేసి, వద్దు! నీ దృష్టిలో నేను దయ పొందితే, ఈ బహుమానం అంగీకరించాలి. నిన్ను చూస్తే దేవుని ముఖం చూసినట్టే ఉంది, దయతో నీవు నన్ను చేర్చుకున్నావు.


అందుకు ఏశావు, “అలాగైతే నా మనుష్యుల్లో కొందరిని మీతో ఉంచుతాను” అని అన్నాడు. “అలా ఎందుకు? నా ప్రభువు దృష్టిలో దయ ఉంటే చాలు” అని యాకోబు అన్నాడు.


ఏశావు, “ఈ మందలు, పశువులన్నీ నాకు ఎందుకు?” అని అడిగాడు. “నా ప్రభువా, నీ దృష్టిలో దయ పొందడానికి” అని యాకోబు అన్నాడు.


అతడు యాకోబు కుమార్తె దీనాపై మనస్సు పడ్డాడు; ఆ యువతిని అతడు ప్రేమించాడు, ఆమెతో ప్రేమగా మాట్లాడాడు.


సర్వశక్తిగల దేవుడు ఆ మనుష్యుని ఎదుట కరుణ చూపును గాక తద్వారా మీ ఇంకొక సోదరుడు బెన్యామీను మీతో తిరిగి వచ్చేలా అనుమతిస్తాడు. నా మట్టుకైతే, ఒకవేళ నేను కోల్పోవలసి వస్తే కోల్పోతాను.”


అప్పుడు రాజు సీబాతో, “మెఫీబోషెతుకు చెందినదంతా ఇప్పుడు నీది” అని అన్నాడు. అందుకు సీబా, “నా ప్రభువా రాజా, మీ దయ నాపై ఉండును గాక, మీకు నా దండాలు” అన్నాడు.


యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానం నేర్చుకోడానికి సాధనము ఘనతకు ముందు వినయం ఉంటుంది.


యెహోవా ఇలా అంటున్నారు, “ఆ రోజున నీవు నన్ను, ‘నా భర్తవు’ అని అంటావు; నీవు నన్ను ఇక ఎన్నడు ‘నా బయలు’ అని పిలువవు.


స్వార్థపూరిత ఆశలతో లేదా వ్యర్థమైన గర్వంతో ఏమి చేయకండి. దానికి బదులు, వినయంతో ఇతరులకు మీకంటే ఎక్కువ విలువను ఇస్తూ,


ఆమె భర్త తనను బ్రతిమాలి తీసుకువద్దామని ఆమె దగ్గరకు వెళ్లాడు. అతడు వెళ్తూ తనతో తన పనివాన్ని, రెండు గాడిదలను తీసుకెళ్లాడు. ఆమె అతన్ని తన తండ్రి ఇంట్లోకి తీసుకెళ్లినప్పుడు ఆమె తండ్రి అతన్ని చూసి సంతోషంగా అతన్ని ఆహ్వానించాడు.


యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును గాక. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చావు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును గాక.”


భోజన సమయంలో బోయజు ఆమెతో, “నీవిక్కడికి రా, భోజనం చేసి, పులిసిన ద్రాక్షరసంలో రొట్టె ముంచి తిను” అన్నాడు. ఆమె పనివారితో కూర్చున్నప్పుడు, అతడు ఆమెకు కాల్చిన ధాన్యం కొంత ఇచ్చాడు. ఆమె తృప్తిగా తిని కొంత మిగిల్చింది.


ఆమె అతనితో, “నీ దాసురాలు నీ దయ పొందును గాక” అన్నది. తర్వాత ఆమె తన దారిన వెళ్లి భోజనం చేసింది; ఆ రోజు నుండి ఆమె ఎన్నడు దుఃఖపడుతూ కనబడలేదు.


ఆమె లేచి మోకరించి తల నేలపై ఆనించి, “నా ప్రభుని ఇష్టం; నా ప్రభుని సేవకులకు సేవ చేసి కాళ్లు కడగడానికి నేను సిద్ధంగా ఉన్నాను” అని చెప్పింది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ