Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




రూతు 1:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 అలా అనగానే వారు బిగ్గరగా ఏడ్చారు. అప్పుడు ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొని వెళ్లిపోయింది, కాని రూతు తన అత్తను అంటిపెట్టుకునే ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 వారు ఎలుగెత్తి యేడ్వగా ఓర్పా తన అత్తను ముద్దుపెట్టుకొనెను, రూతు ఆమెను హత్తు కొనెను. ఇట్లుండగా

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 వాళ్ళు మళ్ళీ గట్టిగా ఏడ్చారు. అప్పుడు ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకుంది, రూతు ఆమెను అంటి పెట్టుకునే ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

14 అప్పుడు ఆ స్త్రీలు మరింతగా ఏడ్చేశారు. ఓర్పా నయోమిని ముద్దు పెట్టుకుని వెళ్లిపోయింది. కాని రూతు ఆమెను హత్తుకుని ఉండిపోయింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 అలా అనగానే వారు బిగ్గరగా ఏడ్చారు. అప్పుడు ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొని వెళ్లిపోయింది, కాని రూతు తన అత్తను అంటిపెట్టుకునే ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




రూతు 1:14
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

నేను నా మనవళ్లకు ముద్దుపెట్టనివ్వలేదు, నా కుమార్తెలను సాగనంపనివ్వలేదు. నీవు బుద్ధిలేని పని చేశావు.


మర్నాడు వేకువజామున లాబాను మనవళ్లను, అతని కుమార్తెలను ముద్దు పెట్టుకుని దీవించాడు. తర్వాత తన ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు.


అప్పుడు ప్రజలందరు, రాజు యొర్దాను నది దాటారు. రాజు బర్జిల్లయిని ముద్దు పెట్టుకుని దీవించాడు. తర్వాత బర్జిల్లయి తన ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు.


అప్పుడు ఎలీషా ఎడ్లను విడిచిపెట్టి ఏలీయా వెంబడి పరుగెత్తి, “నేను వెళ్లి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని వీడ్కోలు చెప్పి మీ వెంట వస్తాను” అని అన్నాడు. అందుకు ఏలీయా, “వెనుకకు వెళ్లు. కాని నేను నీకు చేసిన దాని గురించి ఆలోచించు” అన్నాడు.


నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు, ఆపదల్లో అట్టి వాడు సహోదరునిగా ఉంటాడు.


నమ్మదగని స్నేహితులను కలిగి ఉన్నవాడు త్వరలోనే పతనానికి సమీపిస్తాడు, కాని ఒక స్నేహితుడు ఉన్నాడు సోదరుడి కంటే దగ్గరగా అంటిపెట్టుకుని ఉండేవాడు.


యెహోవా యాకోబుపై జాలి చూపుతారు; ఆయన మరలా ఇశ్రాయేలును ఏర్పరచుకొని వారిని వారి స్వదేశంలో స్థిరపరుస్తారు. విదేశీయులు వారిని కలుసుకుంటారు యాకోబు వారసులతో ఏకమై ఉంటారు.


సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “ఆ రోజుల్లో, ఇతర ప్రజల్లో ఆయా భాషల్లో మాట్లాడే పదిమంది ఒక యూదుని చెంగు పట్టుకుని, ‘దేవుడు మీకు తోడుగా ఉన్నారని మేము విన్నాము. మేము కూడా మీతో వస్తాం’ అంటారు.”


“తన తండ్రిని గాని తల్లిని గాని నా కంటే ఎక్కువగా ప్రేమించేవారు నాకు యోగ్యులు కారు. తన కుమారుని గాని కుమార్తెను గాని నా కంటే ఎక్కువగా ప్రేమించేవారు నాకు యోగ్యులు కారు.


అప్పుడు యేసు తన శిష్యులను చూసి, “ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటే, తనను తాను తిరస్కరించుకుని, తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి.


అయితే ఆ యవ్వనస్థుడు ఆ మాట విని, విచారంగా వెళ్లిపోయాడు, ఎందుకంటే గొప్ప ఆస్తి కలవాడు.


అయితే వారిలో కొందరు పౌలు చెప్పిన మాటలను నమ్మి అతని అనుచరులయ్యారు. వారిలో అరేయొపగు సభ సభ్యుడైన దియొనూసియు, దమరి అనే పేరుగల ఒక స్త్రీ, వీరితో పాటు మరికొంతమంది కూడా ఉన్నారు.


మీ దేవుడైన యెహోవాకు భయపడి, ఆయనను సేవించండి. ఆయనను గట్టిగా పట్టుకుని ఆయన పేరిట ప్రమాణాలు చేయండి.


కాని మీ దేవుడైన యెహోవాను నమ్మకంగా పట్టుకుని ఉన్న మీరందరు ఈ రోజు వరకు బ్రతికి ఉన్నారు.


దేమా ఈ లోకాన్ని ప్రేమించి, నన్ను వదిలి థెస్సలొనీక వెళ్లాడు. క్రేస్కే గలతీయకు, తీతు దల్మతీయకు వెళ్లారు.


అయితే మనం వెనుతిరిగి నశించేవారితో లేము, కానీ విశ్వాసం కలిగి, తమ ఆత్మలను కాపాడుకునేవారితో ఉన్నాము.


వారు ఎదిగే వరకు మీరు వేచి ఉంటారా? వారి కోసం పెళ్ళి చేసుకోకుండ ఉంటారా? వద్దు, నా బిడ్డలారా, యెహోవా హస్తం నాకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి మీకంటే ఎక్కువ బాధ నాకు ఉంది!” అని జవాబిచ్చింది.


నయోమి రూతుతో, “చూడు, నీ తోడి కోడలు తన ప్రజల దగ్గరకు, తన దేవుళ్ళ దగ్గరకు తిరిగి వెళ్తుంది. నీవు తనతో వెళ్లు” అన్నది.


తన ఇద్దరు కోడళ్ళతో కలిసి తాను ఉంటున్న స్థలం విడిచి యూదా దేశానికి వెళ్లే మార్గంలో బయలుదేరింది.


అందుకు బోయజు ఆమెతో అన్నాడు, “నీ భర్త చనిపోయిన తర్వాత నీ అత్తకు నీవు చేసినదంతా అనగా ఎలా నీవు నీ తండ్రిని తల్లిని, నీ కుటుంబాన్ని, నీ స్వదేశాన్ని విడిచి ఇంతకుముందు నీకు తెలియని ఈ ప్రజల మధ్యకు వచ్చావో నేను విన్నాను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ