Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




రోమా పత్రిక 9:20 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

20 కాని ఓ మానవుడా, దేవుని తిరిగి ప్రశ్నించడానికి నీవు ఎవరు? “నీవు నన్ను ఇలా ఎందుకు చేశావు? అని రూపించబడింది తనను రూపించినవానితో అంటుందా?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

20 అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీ వెవడవు? నన్నెందు కీలాగు చేసితివని రూపింపబడినది రూపించినవానితో చెప్పునా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

20 అది సరే గానీ, ఓ మనిషీ, దేవుణ్ణి ఎదురు ప్రశ్నించడానికి నీ వెవరివి? నన్నెందుకిలా చేశావు అని తయారైనది తనను తయారు చేసిన వానితో చెప్పగలదా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

20 కాని, ఓ మనిషీ! దేవునితో ఎదురు తిరిగి మాట్లాడటానికి నీవెవరవు? సృష్టింపబడింది సృష్టికర్తతో, “నన్నీవిధంగా ఎందుకు సృష్టించావు?” అని అడగవచ్చా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

20 కాని ఓ మానవుడా, దేవుని తిరిగి ప్రశ్నించడానికి నీవు ఎవరు? “నీవు నన్ను ఇలా ఎందుకు చేశావు? అని రూపించబడింది తనను రూపించినవానితో అంటుందా?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదము

20 కాని ఓ మానవుడా, దేవుని తిరిగి ప్రశ్నించడానికి నీవు ఎవరు? “నీవు నన్ను ఇలా ఎందుకు చేసావు? అని రూపించబడింది తనను రూపించినవానితో అంటుందా?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




రోమా పత్రిక 9:20
30 ပူးပေါင်းရင်းမြစ်များ  

అందుకు రాజు, “సెరూయా కుమారులారా! ఈ విషయంతో మీకేమి సంబంధం? ‘దావీదును శపించు’ అని ఒకవేళ యెహోవా అతనితో చెప్పినందుకు అతడు శపిస్తున్నాడేమో, అలాంటప్పుడు, ‘నీవు ఎందుకిలా చేస్తున్నావు’ అని ఎవరు అడగగలరు?” అన్నాడు.


మీ గాలిమాటలకు అంతం లేదా? మీరు ఇలాంటి సమాధానం ఇచ్చేలా ఏది మిమ్మల్ని బలవంతం చేస్తుంది?


ఒకని మాటలకు ఆయన స్పందించరని ఎందుకు నీవు ఆయనకు ఫిర్యాదు చేస్తావు?


ఆయనకు మార్గాలను ఎవరు నిర్దేశించారు, ‘నీవు తప్పు చేశావు’ అని ఆయనతో ఎవరు చెప్పారు?


“సర్వశక్తిమంతునితో పోరాడేవారు ఆయనను సరిచేయగలరా? దేవునితో నిందించేవారు ఆయనకు జవాబు చెప్పాలి!”


ఒకసారి మాట్లాడాను, కాని నా దగ్గర జవాబు లేదు; రెండు సార్లు, ఇక నేను ఏమి చెప్పను.”


“నీవు నా న్యాయాన్ని కించపరుస్తావా? నిన్ను నీవు సమర్థించుకోడానికి నన్ను ఖండిస్తావా?


“నేను జవాబివ్వడానికి, ఒకరిపై ఒకరం న్యాయస్థానంలో పోరాడడానికి దేవుడు నాలాంటి మనిషి కాదు.


గొడ్డలి తనను ఉపయోగించే వ్యక్తి కన్నా అతిశయపడుతుందా, రంపం దానిని ఉపయోగించే వ్యక్తి మీద ప్రగల్భాలు పలుకుతుందా? కర్ర తనను ఎత్తేవానిని ఆడించినట్లు దుడ్డుకర్ర కర్రకానివాన్ని ఆడిస్తుంది!


మీరు విషయాలను తలక్రిందులుగా చూస్తారు కుమ్మరిని మట్టితో సమానంగా చూస్తారు! చేయబడిన వస్తువు దానిని చేసినవానితో, “నీవు నన్ను చేయలేదు” అని అనవచ్చా? కుండ కుమ్మరితో, “నీకు ఏమి తెలియదు” అని అనవచ్చా?


అయినా యెహోవా! మీరే మాకు తండ్రి. మేము మట్టి, మీరు కుమ్మరి. మేమందరం మీ చేతి పనిగా ఉన్నాము.


ఆయన, “ఇశ్రాయేలూ, ఈ కుమ్మరి చేసినట్టు నేను నీకు చేయకూడదా?” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “కుమ్మరి చేతిలోని మట్టిలా, ఇశ్రాయేలూ, నీవు నా చేతిలో ఉన్నావు.


ఆయన దృష్టిలో భూప్రజలు శూన్యులు. పరలోక శక్తుల పట్ల భూప్రజల పట్ల ఆయనకు నచ్చింది చేస్తారు. ఆయనను ఎవరూ ఆపలేరు. “మీరు చేసింది ఏంటి?” అని ఆయనను అడగలేరు.


ఓ మనుష్యుడా, ఏది మంచిదో ఆయన నీకు చూపించారు. యెహోవా నీ నుండి కోరేదేంటి? న్యాయంగా ప్రవర్తించడం, కరుణను ప్రేమించడం, వినయం కలిగి నీ దేవునితో కలిసి నడవడమే కదా.


నా సొంత డబ్బును నా ఇష్ట ప్రకారం ఖర్చు చేసుకోవడానికి నాకు అనుమతి లేదా? లేదా నేను ధారాళంగా ఇస్తున్నానని నీవు అసూయపడుతున్నావా?’ అని అడిగాడు.


అందుకు యేసు, “అయ్యా, నన్ను మీకు న్యాయాధిపతిగా గాని మధ్యవర్తిగా గాని నన్నెవరు నియమించారు?” అని జవాబిచ్చారు.


వేరేవాళ్ళ సేవకునికి తీర్పు తీర్చడానికి నీవెవరవు? అతడు నిలబడినా పడిపోయినా అది అతని యజమాని చూసుకుంటాడు. ప్రభువు వారిని నిలబెట్టడానికి శక్తిగలవాడు కాబట్టి వారు నిలబడతారు.


ఇతరులకు తీర్పు తీర్చే వారెవరైనా సరే తప్పించుకునే అవకాశం లేదు. మీరు ఏ విషయంలో ఇతరులకు తీర్పు తీరుస్తున్నారో ఆ విషయంలో మీకు మీరే తీర్పు తీర్చుకుంటున్నారు, ఎందుకంటే తీర్పు తీరుస్తున్న మీరు కూడా అవే పనులు చేస్తున్నారు.


కాబట్టి అలాంటివి చేసేవారికి తీర్పు తీరుస్తూ వాటినే చేస్తూ ఉన్న సాధారణ మనుష్యులైన మీరు దేవుని తీర్పును తప్పించుకోగలరని అనుకుంటున్నారా?


ఒకే మట్టి ముద్ద నుండి కొన్ని ప్రత్యేకమైన పాత్రలను, కొన్ని సాధారణమైన పాత్రలను చేయడానికి కుమ్మరివానికి అధికారం లేదా?


దేవుడు తన ఉగ్రతను చూపించడానికి, తమ శక్తిని తెలియజేయడానికి కోరుకున్నప్పటికి, నాశనం కోసం సిద్ధపరచబడిన ఆయన ఉగ్రతకు పాత్రలైన వారిని ఆయన గొప్ప సహనంతో భరిస్తే ఏంటి?


జ్ఞాని ఎక్కడ? ధర్మశాస్త్ర బోధకుడు ఎక్కడ? ఈ కాలపు పండితుడు ఎక్కడ? ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేశాడు కదా?


ఓ భార్యా, నీ భర్తను రక్షించగలవో లేదో నీకు ఎలా తెలుసు? ఓ భర్తా, నీ భార్యను రక్షించగలవో లేదో నీకు ఎలా తెలుసు?


దుష్ట ఆలోచనలు కలిగిన ప్రజల మధ్యలో తరచూ ఘర్షణలు జరుగుతాయి, అలాంటివారు సత్యం నుండి తొలగిపోయి, దైవభక్తి అనేది ఆదాయం తెచ్చే ఒక మార్గమని భావిస్తారు.


ఒక పెద్ద ఇంట్లో బంగారు, వెండి పాత్రలే కాకుండా కర్రవి మట్టివి కూడా ఉంటాయి; వాటిలో కొన్ని ప్రత్యేకమైన వాటికి ఉపయోగపడితే, మరికొన్ని సాధారణమైన పనులకు వాడబడతాయి.


దాసులుగా ఉన్నవారు తమ యజమానులకు ప్రతి విషయంలో లోబడి ఉండాలని, అన్ని విధాలుగా వారిని సంతోషపరచడానికి ప్రయత్నించాలని, వారికి ఎదురు చెప్పకూడదని,


వివేకంలేనివాడా, క్రియలు లేని విశ్వాసం వ్యర్థమని నీకు రుజువులు కావాలా?


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ