Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




రోమా పత్రిక 2:29 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

29 అయితే అంతరంగంలో కూడా యూదులుగా ఉన్నవారే యూదులు. ఆత్మ వలన హృదయం పొందే సున్నతియే సున్నతి అవుతుంది కాని వ్రాయబడిన నియమాల ప్రకారం పొందింది కాదు. అలాంటి వారికి ఘనత మనుష్యుల నుండి కాదు గాని దేవుని నుండే కలుగుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

29 అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరమువలన కలుగు నది కాదు. అట్టివానికి మెప్పు మనుష్యులవలన కలుగదు దేవునివలననే కలుగును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

29 అంతరంగంలో యూదుడైన వాడే యూదుడు. సున్నతి హృదయానికి చెందింది. అది ఆత్మలో జరిగేదే గాని అక్షరార్ధమైనది కాదు. అలాటి వాణ్ణి మనుషులు కాదు, దేవుడే మెచ్చుకుంటాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

29 అంతరంగంలో యూదునిగా ఉన్నవాడే నిజమైన యూదుడు. హృదయపు సున్నతి అంటే పరిశుద్ధాత్మ ద్వారా సున్నతి పొందటం అన్నమాట. ధర్మశాస్త్ర నియమంతో కాదు. ఇలాంటివాణ్ణి దేవుడు మెచ్చుకొంటాడు. మానవులు కాదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

29 అయితే అంతరంగంలో కూడా యూదులుగా ఉన్నవారే యూదులు. ఆత్మ వలన హృదయం పొందే సున్నతియే సున్నతి అవుతుంది కాని వ్రాయబడిన నియమాల ప్రకారం పొందింది కాదు. అలాంటి వారికి ఘనత మనుష్యుల నుండి కాదు గాని దేవుని నుండే కలుగుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదము

29 అయితే అంతరంగంలో కూడా యూదునిగా ఉన్నవారే యూదులు. ఆత్మ వలన హృదయం పొందే సున్నతియే సున్నతి అవుతుంది కాని వ్రాయబడిన నియమాల ప్రకారం పొందింది కాదు. అలాంటి వారికి ఘనత మనుష్యుల నుండి కాదు గాని దేవుని నుండే కలుగుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




రోమా పత్రిక 2:29
27 ပူးပေါင်းရင်းမြစ်များ  

నా దేవా! మీరు హృదయాన్ని పరిశోధిస్తారని, నిజాయితీ అంటే మీకు ఇష్టమని నాకు తెలుసు. నేను ఇవన్నీ ఇష్టపూర్వకంగా నిజాయితితో ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న మీ ప్రజలు కూడా మీకు ఇష్టపూర్వకంగా ఇవ్వడం చూసి నేను సంతోషిస్తున్నాను.


అంతఃపురంలో రాజకుమారి వైభవంలో నిండుతనం ఉంది. ఆమె ధరించిన ఖరీదైన వస్త్రాలు బంగారంతో బుట్టా వేసినవి.


యెరూషలేమా, నీ హృదయంలోని చెడును కడిగి రక్షించబడు. మీరు ఎంతకాలం చెడ్డ ఆలోచనలను కలిగి ఉంటారు?


మిమ్మల్ని మీరు యెహోవాకు సున్నతి చేసుకోండి, మీ హృదయాలను సున్నతి చేసుకోండి, యూదా ప్రజలారా, యెరూషలేము నివాసులారా, లేకపోతే మీరు చేసిన చెడును బట్టి నా కోపం అగ్నిలా మండుతుంది, ఆర్పడానికి ఎవరూ ఉండరు.


“కేవలం శరీర సంబంధంగా మాత్రమే సున్నతి పొందిన వారందరినీ నేను శిక్షించే రోజులు రాబోతున్నాయి” అని యెహోవా ప్రకటిస్తున్నారు.


అందుకు ప్రభువు అతనితో, “పరిసయ్యులైన మీరు పాత్రను, గిన్నెను బయట శుభ్రం చేస్తారు, కాని లోపల అత్యాశతో, దుష్టత్వంతో నిండి ఉన్నారు.


దేవుని రాజ్యం మీలోనే ఉంది కాబట్టి ‘ఇదిగో ఇక్కడ ఉంది’ లేదా ‘అదిగో అక్కడ ఉంది’ అని ఎవరు చెప్పలేరు” అని జవాబిచ్చారు.


ఎందుకంటే వారు దేవుని మెప్పు కన్నా, ప్రజల మెప్పునే ఎక్కువగా ఇష్టపడ్డారు.


అయినా నిజమైన ఆరాధికులు పరలోక తండ్రిని ఆత్మతో, సత్యంతో ఆరాధించే ఒక సమయం వస్తుంది. అది ఇప్పటికే వచ్చేసింది. ఎందుకంటే అలాంటి ఆరాధికుల కోసమే తండ్రి చూస్తున్నారు.


ఏకైక దేవుని నుండి వచ్చే కీర్తిని వెదకకుండా ఒకరి నుండి ఒకరికి వచ్చే కీర్తిని అంగీకరించే మీరు నన్ను ఎలా నమ్ముతారు?


దేవుని రాజ్యం తినడం త్రాగడం కాదు. అది నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందం.


శారీరకంగా సున్నతి పొందకపోయినా ధర్మశాస్త్రం ప్రకారం జీవిస్తున్నవారు, ధర్మశాస్త్రాన్ని సున్నతిని కలిగి ఉన్నప్పటికీ ధర్మశాస్త్రానికి విరుద్ధంగా జీవిస్తున్న మీకు తీర్పు తీరుస్తారు.


అయితే యూదునిగా ఉండడం వల్ల ప్రయోజనమేమిటి? సున్నతిలో ఉన్న విలువేమిటి?


కాని ఇప్పుడు, మనల్ని బంధించి ఉంచిన దాని విషయమై చనిపోయి, ధర్మశాస్త్రం నుండి విడుదలను పొందాము కాబట్టి, వ్రాయబడి ఉన్న నియమం ప్రకారం కాకుండా ఆత్మానుసారమైన నూతన మార్గంలో మనం సేవిస్తాము.


అందుకే నిర్ణీత సమయం రాకముందే తీర్పు తీర్చవద్దు, ప్రభువు వచ్చేవరకు ఆగాలి. చీకటిలో దాచబడిన రహస్యాలను వెలుగులోకి తెచ్చి హృదయంలోని ఉద్దేశాలను ఆయనే బయటపెడతారు. ఆ సమయంలో ప్రతి ఒక్కరు దేవుని నుండి తమ ఘనతను పొందుకొంటారు.


సున్నతి పొందడంలో గాని పొందకపోవడంలో ఏమి లేదు. దేవుని ఆజ్ఞలను పాటించడమే ముఖ్యం.


తనను తానే మెచ్చుకొనేవారు యోగ్యులు కారు గాని, ప్రభువు మెచ్చుకొనేవారే యోగ్యులు.


వ్రాతపూర్వకమైన నియమాలను కాక, ఆత్మతో కూడిన క్రొత్త నిబంధనను సేవించగల సామర్ధ్యాన్ని ఆయనే మాకు ఇచ్చారు. అక్షరం చంపుతుంది కాని ఆత్మ జీవం ఇస్తాడు.


కాబట్టి మీ హృదయాలను సున్నతి చేసుకుని ఇకపై మొండిగా ఉండకండి.


మీ దేవుడైన యెహోవా మీ హృదయాలను, మీ సంతతివారి హృదయాలను సున్నతి చేస్తారు. అప్పుడు మీరు ఆయనను మీ పూర్ణ హృదయం, మీ పూర్ణ ఆత్మతో ప్రేమించి జీవిస్తారు.


ఎందుకంటే, మనం సున్నతి పొందినవారం, దేవుని ఆత్మ చేత ఆయనను ఆరాధిస్తాం, క్రీస్తు యేసులో అతిశయపడతాం, శరీరంపై నమ్మకం ఉంచండి.


దానికి బదులు, దేవుడు మాకు ఈ సువార్తను అప్పగించడానికి ఆయనచే యోగ్యులుగా ఎంచబడిన వారిలా మేము బోధిస్తున్నాము. కాబట్టి మేము మనుష్యులను మెప్పించడానికి కాకుండా మన హృదయాలను పరిశీలించే దేవుని మెప్పించడానికి ప్రయత్నిస్తున్నాము.


మృదువైన, సాధు స్వభావమనే అక్షయమైన అలంకారం గల హృదయపు సౌందర్యాన్ని కలిగి ఉండాలి. అదే దేవుని దృష్టిలో అమూల్యమైనది.


అయితే యెహోవా సమూయేలుతో, “అతని రూపాన్ని ఎత్తును చూసి అలా అనుకోవద్దు, నేను అతన్ని తిరస్కరించాను. మనుష్యులు చూసే వాటిని యెహోవా చూడరు. మనుష్యులు పైరూపాన్ని చూస్తారు కాని యెహోవా హదృయాన్ని చూస్తారు” అన్నారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ