Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




రోమా పత్రిక 14:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 ఒకరు ఒక రోజును మరొక రోజు కన్నా మంచిదని భావిస్తారు. మరొకరు అన్ని రోజులు ఒకేలాంటివని భావిస్తారు. వారిరువురు తమ మనస్సుల్లో దానిని పూర్తిగా నమ్ముతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 ఒకడు ఒక దినముకంటె మరియొక దినము మంచి దినమని యెంచుచున్నాడు; మరియొకడు ప్రతిదినమును సమానముగా ఎంచుచున్నాడు; ప్రతివాడు తనమట్టుకు తానే తన మనస్సులో రూఢిపరచు కొనవలెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 ఇంకొక చోట ఒకడు ఒక రోజు కంటే మరొక రోజు మంచిదని నమ్ముతున్నాడు. ఇంకొకడు రోజులన్నీ మంచివే అని నమ్ముతున్నాడు. ప్రతివాడూ తనకు తాను ఒక నిర్ణయానికి రావాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

5 ఒకడు ఒక రోజు కన్నా మరొక రోజు ముఖ్యమైనదని భావించవచ్చు. ఇంకొకడు అన్ని రోజుల్ని సమానంగా భావించవచ్చు. ప్రతి ఒక్కడూ తాను పూర్తిగా నమ్మిన వాటిని మాత్రమే చెయ్యాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 ఒకరు ఒక రోజును మరొక రోజు కన్నా మంచిదని భావిస్తారు. మరొకరు అన్ని రోజులు ఒకేలాంటివని భావిస్తారు. వారిరువురు తమ మనస్సుల్లో దానిని పూర్తిగా నమ్ముతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదము

5 ఒకరు ఒక రోజు మరొక రోజు కన్నా మంచిదని భావిస్తారు, మరొకరు అన్ని రోజులు ఒకేలాంటివని భావిస్తారు. వారిరువురు తమ మనస్సులలో దానిని పూర్తిగా నమ్ముతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




రోమా పత్రిక 14:5
9 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఘనత వహించిన థెయోఫిలా, జరిగిన సంఘటనలను కళ్లారా చూసినవారు, వాక్య ఉపదేశకులు మనకు చెప్తూ అందించిన వివరాలను అనేకులు వ్రాయడం మొదలుపెట్టారు. కాబట్టి నీకు బోధించబడిన సంగతులు ఖచ్చితంగా జరిగాయని నీవు తెలుసుకోవడానికి, దీన్ని దృష్టిలో ఉంచుకుని, నేనే ఆరంభం నుండి ప్రతిదీ జాగ్రత్తగా పరిశోధించాను కాబట్టి నేను కూడా మీ కోసం అన్నిటిని ఒక క్రమంలో వ్రాయాలని నిర్ణయించుకున్నాను, నెరవేర్చబడిన సంఘటనలన్నిటిని గురించి నేనే జాగ్రత్తగా పరిశోధించి, తద్వారా మీకు బోధించబడిన విషయాలు ఎంత ఖచ్చితమైనవో మీకు తెలుస్తుంది.


సహజంగా ఏదీ అపవిత్రమైనది కాదని యేసు ప్రభువులో నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అయితే ఎవరైనా ఒకదాన్ని అపవిత్రమైనదని భావిస్తే వానికి అది అపవిత్రమైనదే.


అయితే సందేహంతో తినేవారు విశ్వాసం లేకుండా తింటారు కాబట్టి శిక్ష పొందుతారు. విశ్వాసం లేకుండా చేసే ప్రతిదీ పాపమే అవుతుంది.


దేవుడు తాను వాగ్దానం చేసిన దానిని నెరవేర్చగల శక్తిగలవాడని అతడు గట్టిగా నమ్మాడు.


అందువల్ల ఎవరి కోసం క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనులైన ఆ సహోదరీ సహోదరులు నీ జ్ఞానాన్నిబట్టి నశిస్తారు.


అయితే ఈ జ్ఞానం అందరికి లేదు. కొందరు ఇప్పటికీ విగ్రహాలను ఆరాధించేవారు తాము తినే పదార్థాలు విగ్రహాలకు బలి అర్పించినవి అని భావిస్తారు. కాబట్టి వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమవుతుంది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ