Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ప్రకటన 18:23 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

23 ఇక ఒక దీపపు వెలుగైనా నీలో ఎన్నడూ ప్రకాశించదు. ఇక వధువు స్వరం వరుని స్వరం నీలో ఎన్నడూ వినిపించదు. నీ వర్తకులు ప్రపంచంలో ప్రఖ్యాతి పొందినవారిగా ఉన్నారు. నీ మాయ మంత్రాలతో దేశాలన్నీ మోసపోయాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

23 దీపం వెలుతురు నీలో ఇక కనిపించదు. పెళ్ళి కొడుకు స్వరం, పెళ్ళి కూతురు స్వరం ఇక ఎన్నటికీ నీలో వినపడవు. ఎందుకంటే నీ వర్తకులు ప్రపంచంలో గొప్పవారుగా ఉండేవారు. దేశాలన్నీ నీ మాయలో పడి మోసపోయాయి.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

23 దీపపు కాంతి నీలో మళ్ళీ ప్రకాశించదు. కొత్త దంపతుల మాటలు నీలో మళ్ళీ వినిపించవు. నీ వర్తకులు ప్రపంచంలో గొప్పగా ఉన్నారు. నీ గారడీలతో దేశాలు తప్పుదారి పట్టాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

23 ఇక ఒక దీపపు వెలుగైనా నీలో ఎన్నడూ ప్రకాశించదు. ఇక వధువు స్వరం వరుని స్వరం నీలో ఎన్నడూ వినిపించదు. నీ వర్తకులు ప్రపంచంలో ప్రఖ్యాతి పొందినవారిగా ఉన్నారు. నీ మాయ మంత్రాలతో దేశాలన్నీ మోసపోయాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదము

23 ఇక ఒక దీపపు వెలుగైన నీలో ఎన్నడూ ప్రకాశించదు. ఇక వధువు స్వరం వరుని స్వరం నీలో ఎన్నడూ వినిపించదు. నీ వర్తకులు ప్రపంచంలో ప్రఖ్యాతి పొందినవారిగా ఉన్నారు. నీ మాయ మంత్రాలతో దేశాలన్ని మోసపోయాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ప్రకటన 18:23
26 ပူးပေါင်းရင်းမြစ်များ  

యెహోరాము యెహును చూడగానే, “సమాధానంతో వచ్చావా, యెహు?” అని అడిగాడు. అందుకు యెహు, “మీ తల్లి యెజెబెలు విగ్రహారాధనను మంత్రవిద్యను ప్రోత్సహిస్తున్నంత కాలం, సమాధానం ఎలా ఉంటుంది?” అని జవాబిచ్చాడు.


“అయినా ఎంత తరచుగా దుర్మార్గుల దీపం ఆరిపోతుంది? దేవుడు తన కోపంలో కేటాయించిన, విపత్తు ఎంత తరచుగా వారి మీదికి వస్తుంది?


ఎందుకంటే కీడు చేసేవారికి భవిష్యత్ నిరీక్షణ లేదు, దుష్టుల దీపము ఆరిపోతుంది.


తూరు కిరీటాలు పంచిపెట్టే పట్టణం, దాని వ్యాపారులు రాకుమారులు, దాని వర్తకులు భూమి మీద ప్రసిద్ధులు, అలాంటి తూరుకు వ్యతిరేకంగా ఎవరు ఆలోచన చేశారు?


ఒక్క క్షణంలోనే ఒక్క రోజులోనే ఈ రెండు నీకు సంభవిస్తాయి: బిడ్డల్ని పోగొట్టుకుంటావు విధవరాలిగా మారతావు. నీవు చాలా శకునాలు చూసినా, అనేక కర్ణపిశాచ తంత్రాల మీద ఆధారపడినా ఈ విషాదాలు నీ మీదికి పూర్తిగా వస్తాయి.


ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: మీ కళ్లముందు, మీ రోజుల్లో నేను ఈ స్థలంలో ఆనంద, సంతోష ధ్వనులను, వధూవరుల స్వరాలను అంతం చేస్తాను.


నేను సంతోష ధ్వనులను, వధూవరుల స్వరాలను, తిరుగటిరాళ్ల శబ్దాన్ని దీపపు వెలుగును వారి నుండి దూరం చేస్తాను.


యూదా పట్టణాల్లోనూ, యెరూషలేము వీధుల్లోనూ వధూవరుల స్వరాలను, ఆనంద సంతోష ధ్వనులను నేను అంతం చేస్తాను, ఎందుకంటే దేశం నిర్జనమైపోతుంది.


తన మంత్రవిద్య ద్వారా ప్రజలను, తన వ్యభిచారం ద్వారా దేశాలను బానిసలుగా మార్చిన వేశ్య; మంత్రగత్తెల యజమానురాలు ఇదంతా చేసింది.


అతడు తన మంత్రవిద్యతో వారిని చాలా కాలం నుండి ఆశ్చర్యపరుస్తున్నాడు కాబట్టి వారు అతన్ని వెంబడించేవారు.


ఆ తర్వాత లోకమంతటిని మోసం చేసే ఆ మహా ఘటసర్పం, అనగా సాతాను లేదా అపవాది అని పిలువబడే ఆదిసర్పాన్ని వానిని అనుసరించే దూతలందరు వానితో పాటు భూమి మీదకు పడత్రోయబడ్డారు.


భూ రాజులు ఆ వేశ్యతో వ్యభిచరించారు, ఆమె వ్యభిచారమనే మద్యంతో భూనివాసులందరు మత్తులయ్యారు” అని చెప్పాడు.


ఆమె నుదిటి మీద వ్రాసి ఉన్న పేరులో ఒక రహస్యం ఉంది: “మహా బబులోను పట్టణం, వేశ్యలకు తల్లి భూమి మీద జరిగే ప్రతి అసహ్యమైన కార్యానికి తల్లి.”


వీణ వాయించేవారి, పిల్లన గ్రోవులు బూరలు ఊదేవారి సంగీతం మరి ఎన్నడు నీలో వినబడదు. వ్యాపారం చేసే ఏ పనివాడైనా నీలో ఎన్నడు కనిపించడు. తిరుగలి రాయి తిప్పే శబ్దం మరెన్నడు నీలో వినబడదు.


ఎందుకంటే ఆమె వ్యభిచార మద్యాన్ని త్రాగి దేశాలన్నీ మత్తులయ్యాయి. భూలోక రాజులు ఆమెతో వ్యభిచరించారు. భూలోక వర్తకులు ఆమె ఇచ్చే అధిక విలాసాలతో ధనికులయ్యారు.”


ఆమెతో వ్యభిచరించి ఆమె సుఖభోగాలను అనుభవించిన భూ రాజులు ఆమె కాలుతున్నప్పుడు వచ్చే పొగను చూసి ఆమె కోసం కన్నీరు కారుస్తూ దుఃఖిస్తారు.


అయితే పిరికివారు, అవిశ్వాసులు, దుష్టులు, హంతకులు, లైంగిక నైతికత లేనివారు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరు అగ్ని గంధకాలతో మండుతున్న సరస్సు పాలవుతారు. ఇది వారికి రెండవ మరణం” అని చెప్పారు.


అయితే మాంత్రికులు, వ్యభిచారులు, హంతకులు, విగ్రహాలను పూజించే వారు, అబద్ధాలు చెప్తూ వాటిని ప్రేమించే వారందరు ఆ పట్టణానికి బయట ఉండే కుక్కలు.


అక్కడ రాత్రి ఉండదు. ప్రభువైన దేవుడే వారికి కాంతిని ఇస్తారు కాబట్టి వారికి దీపకాంతి గాని సూర్యకాంతి గాని అవసరం లేదు. వారు ఎల్లకాలం పరిపాలిస్తూ ఉంటారు.


భూ రాజులు, రాకుమారులు, ప్రధానులు, ధనవంతులు, బలవంతులు, దాసులు, స్వతంత్రులు ప్రతి ఒక్కరు గుహల్లో, కొండల రాళ్ల సందుల్లో దాక్కున్నారు.


వారు చేసే హత్యలు, మంత్రపు ప్రయోగాలు, లైంగిక దుర్నీతి, దొంగతనం అనేవి తప్పు అని గ్రహించి పశ్చాత్తాపపడి వాటిని విడిచిపెట్టి దేవుని వైపు తిరుగలేదు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ