Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




ప్రకటన 15:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 అప్పుడు దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చే పొగతో ఆ దేవాలయమంతా నిండిపోయి ఆ ఏడుగురు దేవదూతలు ఆ ఏడు తెగుళ్ళను కుమ్మరించే వరకు ఆ దేవాలయంలోనికి ఎవరు ప్రవేశించలేకపోయారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 అంతట దేవుని మహిమనుండియు ఆయన శక్తినుండియు వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ యేడుగురు దూతలయొద్ద ఉన్న యేడు తెగుళ్లు సమాప్తియగువరకు ఆలయమందు ఎవడును ప్రవేశింపజాలకపోయెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 దేవుని యశస్సు నుండీ, బలం నుండీ లేచిన పొగతో అతి పరిశుద్ధ స్థలం నిండిపోయింది. కాబట్టి ఆ ఏడుగురు దూతలకిచ్చిన కీడులన్నీ జరిగే వరకూ అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరూ ప్రవేశించలేకపోయారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

8 ఆ మందిరమంతా దైవశక్తి వల్ల మరియు ఆయన తేజస్సు వల్ల కలిగిన పొగలతో నిండిపోయింది. ఏడుగురు దూతలు తెచ్చిన ఏడు తెగుళ్ళు పూర్తి అయ్యేవరకు ఆ మందిరంలో ఎవ్వరూ ప్రవేశించలేకపోయారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 అప్పుడు దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చే పొగతో ఆ దేవాలయమంతా నిండిపోయి ఆ ఏడుగురు దేవదూతలు ఆ ఏడు తెగుళ్ళను కుమ్మరించే వరకు ఆ దేవాలయంలోనికి ఎవరు ప్రవేశించలేకపోయారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదము

8 అప్పుడు ఆ దేవాలయమంతా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చే పొగతో నింపబడినందున ఆ ఏడుగురు దేవదూతలు ఆ ఏడు తెగుళ్ళను కుమ్మరించే వరకు ఆ దేవాలయంలోనికి ఎవరు ప్రవేశించలేకపోయారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




ప్రకటన 15:8
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

యెహోవా స్వరం లేళ్లను ఈనజేస్తుంది అడవిలోని ఆకులు రాలిపోయేలా చేస్తుంది. ఆయన ఆలయంలోని సమస్తం ఆయనకే, “మహిమ” అంటున్నాయి.


యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చారు కాబట్టి ఆ పర్వతమంతా పొగతో నిండిపోయింది. కొలిమి నుండి పొగ వచ్చినట్లుగా ఆ పొగ పైకి లేచింది. ఆ పర్వతమంతా భయంకరంగా కంపించింది.


వారి స్వరాల ధ్వనికి ద్వారబంధాలు, పునాదులు కదిలాయి. మందిరం పొగతో నిండిపోయింది.


అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నారు: “మోషే, సమూయేలు నా ముందు నిలబడినా, నా హృదయం ఈ ప్రజల వైపుకు వెళ్లదు. వారిని నా సన్నిధి నుండి దూరంగా పంపివేయి! వారిని వెళ్లనివ్వు!


ఏ ప్రార్థన ఫలించకుండా, మీరు ఒక మేఘంతో మిమ్మల్ని మీరు కప్పుకున్నారు.


యెహోవా మోషేతో అన్నారు: “నీ సహోదరుడైన అహరోను మందసం మీద ఉన్న ప్రాయశ్చిత్త మూతకు ఎదురుగా ఉన్న తెర వెనుక ఉన్న అతి పరిశుద్ధ స్థలంలోకి ఎప్పుడంటే అప్పుడు రావద్దు అని చెప్పు, అలా వస్తే అతడు చస్తాడు. ఎందుకంటే నేను మేఘంలో ఆ ప్రాయశ్చిత్త మూత మీదే మీకు ప్రత్యక్షమవుతాను.


ఆహా, దేవుని బుద్ధి జ్ఞానాల సమృద్ధి ఎంతో లోతైనది! ఆయన తీర్పులు ఎంతో నిగూఢమైనవి, ఆయన మార్గాలు మన ఊహకు అందనివి!


వారు అనుభవించే శిక్ష నిత్య నాశనంగా ఉంటుంది, అలాంటివారు ప్రభువు సన్నిధి నుండి ఆయన మహాప్రభావం నుండి వెళ్లగొట్టబడతారు,


నేను పరలోకంలో మరొక గొప్ప అద్భుతమైన సూచన చూశాను: ఏడుగురు దేవదూతలు చివరి ఏడు తెగుళ్ళను పట్టుకుని వస్తున్నారు. అవి చివరివి ఎందుకంటే ఈ తెగుళ్ళతో దేవుని కోపం తీరిపోతుంది.


అది దేవుని మహిమతో సూర్యకాంతం అనే బహు అమూల్యమైన రత్నపు తేజస్సు కలిగి స్ఫటికంలా మెరుస్తుంది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ