అతడు అక్కడినుండి బయలుదేరిన తర్వాత, తనను కలుసుకోడానికి వస్తున్న రేకాబు కుమారుడైన యెహోనాదాబును చూశాడు. యెహు అతనికి శుభమని చెప్పి, “నేను నీతో యథార్థంగా ఉన్నట్లు నీవు నాతో ఉన్నావా?” అని అడిగాడు. అందుకు యెహోనాదాబు, “ఉన్నాను” అని జవాబిచ్చాడు. “అలాగైతే, నీ చేయి ఇవ్వు” అని యెహు అనగానే అతడు తన చేయి అందించగా యెహు అతన్ని రథంలోకి ఎక్కించుకున్నాడు.
అయితే నేను వీటి గురించి జాగ్రత్తగా ఆలోచించి సంస్థానాధిపతులను, అధికారులను పిలిచి, “మీరు సోదరుల నుండి వడ్డీ తీసుకుంటున్నారు” అని చెప్పి వారిని గద్దించి, వారి గురించి వెంటనే పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి,
నేను చూశాను కాని సహాయం చేయడానికి ఎవరూ లేరు; ఎవరూ సహకారం అందించకపోవడం చూసి నేను ఆశ్చర్యపోయాను; కాబట్టి నా సొంత చేయి నాకు రక్షణ ఇచ్చింది నా కోపమే నన్ను ఆదుకుంది.
“యెరూషలేము వీధుల్లోకి వెళ్లి, చుట్టూ చూసి పరిశీలించండి, దాని కూడళ్లలో వెదకండి. నమ్మకంగా వ్యవహరించే సత్యాన్ని వెదికే ఒక్క వ్యక్తినైనా మీరు కనుగొనగలిగితే, నేను ఈ పట్టణాన్ని క్షమిస్తాను.
“నేను దేశాన్ని నాశనం చేయకుండా దాని గోడలను బాగుచేయడానికి పగుళ్లలో నా ఎదుట నిలబడడానికి నేను తగిన వాన్ని వెదికాను కాని అలాంటివాడు ఒక్కడు కూడా నాకు కనపడలేదు.
మందసం ఎప్పుడు బయలుదేరుతుందో అప్పుడు మోషే బిగ్గరగా, “యెహోవా, లేవండి! మీ శత్రువులు చెదిరిపోవుదురు గాక; మీ ఎదుట నుండి మీ శత్రువులు పారిపోవుదురు గాక” అని అనేవాడు.
యెహోవా దూత, ‘మేరోసును శపించండి, దాని ప్రజలను తీవ్రంగా శపించండి. ఎందుకంటే యెహోవాకు సహాయంగా వారు రాలేదు, శక్తిగల శూరులకు విరుద్ధంగా యెహోవాకు సహాయంగా వారు రాలేదు’ అన్నారు.