Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 94:10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 దేశాలను శిక్షణ చేసేవాడు మిమ్మల్ని శిక్షించడా? నరులకు బోధించేవానికి తెలివిలేదా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 అన్యజనులను శిక్షించువాడు మనుష్యులకు తెలివి నేర్పువాడు దండింపకమానునా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 రాజ్యాలను అదుపులో పెట్టేవాడు సరిచేయడా? మనిషికి తెలివి ఇచ్చేవాడు ఆయనే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

10 ఆ ప్రజలను దేవుడే క్రమశిక్షణలో ఉంచుతాడు. ప్రజలు చేయవలసిన వాటిని దేవుడే వారికి నేర్పిస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 దేశాలను శిక్షణ చేసేవాడు మిమ్మల్ని శిక్షించడా? నరులకు బోధించేవానికి తెలివిలేదా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 94:10
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

అంతేకాక మనుష్యజాతితో, “యెహోవాకు భయపడడమే జ్ఞానం దుష్టత్వాన్ని విడిచిపెట్టడమే వివేకం” అని అన్నాడు.


ఆయన మౌనంగా ఉంటే ఆయనకు శిక్ష విధించగలవారెవరు? ఆయన తన ముఖం దాచుకొంటే ఆయనను చూడగలవారెవరు? ఒక్క వ్యక్తికైనా దేశమంతటికైనా ఆయన విధానం ఒక్కటే,


యెహోవా నిరంతరం రాజై ఉన్నారు; దేశాల ప్రజలు ఆయన భూభాగంలో నుండి నశిస్తారు.


నేను మీ ఆజ్ఞలను నమ్ముకున్నాను, నాకు సరియైన వివేచనను గ్రహింపును బోధించండి.


దేశాలపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రజలను శిక్షించడానికి,


మీ స్వహస్తంతో దేశాలను వెళ్లగొట్టారు మా పూర్వికులను అక్కడ నిలబెట్టారు; ఆయా జాతుల ప్రజలను నాశనం చేసి మా పూర్వికులను వర్ధిల్లేలా చేశారు.


మీరు దేశాలను మందలించి దుష్టులను నిర్మూలం చేశారు; మీరు వారి పేరును ఎప్పటికీ లేకుండ తుడిచివేశారు.


ఎందుకంటే యెహోవాయే జ్ఞానాన్ని ప్రసాదించేవాడు; తెలివి వివేచన ఆయన నోట నుండే వస్తాయి.


ప్రభువు సీయోను పర్వతానికి, యెరూషలేముకు వ్యతిరేకంగా పని ముగించిన తర్వాత ఆయన ఇలా అంటారు, “నేను అష్షూరు రాజుకు ఉన్న హృదయపు గర్వం యొక్క ఫలితం బట్టి అతని కళ్లల్లో ఉన్న అహంకారపు చూపును బట్టి అతన్ని శిక్షిస్తాను.


చాలా జనాంగాలు వచ్చి ఇలా అంటారు, “రండి, మనం యెహోవా పర్వతం మీదికి, యాకోబు దేవుని ఆలయానికి వెళ్దాము. మనం ఆయన మార్గంలో నడిచేలా, ఆయన మనకు తన మార్గాల్ని బోధిస్తారు.” సీయోనులో నుండి ధర్మశాస్త్రం, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయటకు వెళ్తాయి.


అతని దేవుడు అతనికి నేర్పిస్తారు సరిగా ఎలా చేయాలో ఆయనే అతనికి బోధిస్తారు.


అప్పుడు యెహోవా దూత బయలుదేరి అష్షూరు శిబిరంలో 1,85,000 మంది సైనికులను హతం చేశాడు. ప్రొద్దున ప్రజలు లేచి చూస్తే వారంతా శవాలుగా పడి ఉన్నారు.


యెహోవా నీ పిల్లలందరికి బోధిస్తారు వారికి గొప్ప సమాధానం కలుగుతుంది.


మిమ్మల్ని గుర్తించని దేశాల మీద, మీ పేరు పెట్టుకొనని జనాంగాల మీద మీ కోపాన్ని కుమ్మరించండి. వారు యాకోబును మ్రింగివేశారు; వారు అతన్ని పూర్తిగా మ్రింగివేశారు అతని మాతృభూమిని నాశనం చేశారు.


“నా మహిమను ఇతర ప్రజలమధ్య చూపుతాను. ఇతర ప్రజలందరు నేను విధించిన శిక్షను నేను వారిపై ఉంచిన చేతిని చూస్తారు.


“భూలోకంలోని కుటుంబాలన్నిటి నుండి మిమ్మల్ని మాత్రమే ఎన్నుకున్నాను. కాబట్టి మీరు చేసిన పాపాలన్నిటిని బట్టి నేను మిమ్మల్ని శిక్షిస్తాను.”


యెహోవా, నీవు ఆరంభం నుండి ఉన్నవాడవు కావా? నా దేవా, నా పరిశుద్ధుడా, నీవు ఎన్నడు చనిపోవు. యెహోవా, నీవు వారిని తీర్పు తీర్చడానికి నియమించావు; నా రక్షకా, మమ్మల్ని దండించడానికి నీవు వారిని నియమించావు.


ఉగ్రతతో నీవు భూమిమీద తిరుగుతున్నావు ఆగ్రహంతో దేశాలను అణగద్రొక్కుతున్నావు.


‘దేవుడు వారందరికి బోధిస్తారు’ అని ప్రవక్తలచే వ్రాయబడిన విధంగా, తండ్రి మాటలను విని ఆయన నుండి నేర్చుకున్న ప్రతిఒక్కరు నా దగ్గరకు వస్తారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ