Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 80:2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 ఎఫ్రాయిం, బెన్యామీను, మనష్షే గోత్రాల ఎదుట ప్రకాశించండి. మీ పరాక్రమాన్ని చూపించండి; వచ్చి మమ్మల్ని రక్షించండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 ఎఫ్రాయిము బెన్యామీను మనష్షే అనువారి యెదుట నీ పరాక్రమమును మేల్కొలిపి మమ్మును రక్షింపరమ్ము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 ఎఫ్రాయిము బెన్యామీను మనష్షే గోత్రాల ఎదుట నీ బల ప్రభావాలను చూపించు. వచ్చి మమ్మల్ని కాపాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

2 ఇశ్రాయేలీయుల కాపరీ, ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షేలకు నీ మహాత్యం చూపించుము. వచ్చి మమ్మల్ని రక్షించుము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 ఎఫ్రాయిం, బెన్యామీను, మనష్షే గోత్రాల ఎదుట ప్రకాశించండి. మీ పరాక్రమాన్ని చూపించండి; వచ్చి మమ్మల్ని రక్షించండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 80:2
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

తర్వాత యాజకులు యెహోవా నిబంధన మందసాన్ని మందిరంలోని గర్భాలయం అనే అతి పరిశుద్ధ స్థలంలో దాని స్థలానికి తీసుకువచ్చి, కెరూబుల రెక్కల క్రింద పెట్టారు.


హిజ్కియా యెహోవాకు ఇలా ప్రార్థన చేశాడు: “యెహోవా! ఇశ్రాయేలు దేవా! కెరూబుల మధ్యలో సింహాసనాసీనుడా! ఈ లోక రాజ్యాలకు మీరు మాత్రమే దేవుడు. మీరు భూమ్యాకాశాలను సృష్టించారు.


మేల్కొనండి, నన్ను రక్షించడానికి లేవండి! నా దేవా, నా ప్రభువా, నా పక్షాన వాదించండి.


సౌందర్యంలో పరిపూర్ణమైన, సీయోను నుండి, దేవుడు ప్రకాశిస్తారు.


అయినా దేవుడు దయ చూపించి; వారి పాపాలను క్షమించారు వారిని నాశనం చేయలేదు. మాటిమాటికి ఆయన తన కోపాన్ని అదుపు చేసుకున్నారు ఆయన పూర్తి ఉగ్రతను రేపలేదు.


యెహోవా పరిపాలిస్తారు, ప్రజలు భయభక్తులతో వణికి పోతున్నారు; కెరూబులకు పైగా సింహాసనాసీనుడై దేవుడు కనిపిస్తున్నారు, భూమి కంపించాలి.


అక్కడ, నిబంధన మందసం పైన ఉన్న ఆ ప్రాయశ్చిత్త మూత మీదుగా రెండు కెరూబుల మధ్యలో నుండి, నేను నిన్ను కలుసుకొని ఇశ్రాయేలీయుల కోసం నా ఆజ్ఞలన్నిటిని నీకు ఇస్తాను.


ఆ రోజున వారు ఇలా అంటారు, “నిజంగా ఈయనే మన దేవుడు ఈయనను మనం నమ్ముకున్నాం, ఈయన మనల్ని రక్షించారు. మనం నమ్మిన యెహోవా ఈయనే; ఆయన రక్షణను బట్టి సంతోషించి ఆనందిద్దాము.”


యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు; మనల్ని రక్షించేది ఆయనే.


కాబట్టి ప్రజలు కొందరిని షిలోహుకు పంపించి అక్కడినుండి కెరూబుల మధ్య ఆసీనుడై ఉన్న సైన్యాల యెహోవా యొక్క నిబంధన మందసాన్ని తెప్పించారు. దేవుని నిబంధన మందసంతో పాటు ఏలీ యొక్క ఇద్దరు కుమారులైన హొఫ్నీ, ఫీనెహాసు అక్కడే ఉన్నారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ