Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 68:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 దేవుడు ఒంటరిగా ఉన్నవారిని కుటుంబాలలో ఉంచుతారు, బందీలను విడిపించి వారికి ఆనందాన్ని అనుగ్రహిస్తారు; కాని తిరుగుబాటుదారులు ఎండిన భూమిలో నివసిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడినవారిని విడిపించి వారిని వర్ధిల్ల జేయువాడు విశ్వాసఘాతకులు నిర్జలదేశమందు నివసించుదురు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 దేవుడు ఒంటరి వారిని కుటుంబాలుగా చేస్తాడు. ఆయన బంధకాల్లో ఉన్న వారిని విడిపించి వారిని వృద్ధి చెందిస్తాడు. తిరుగుబాటు చేసే వారి భూములు బీడులైపోతాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

6 ఒంటరిగా ఉన్న మనుష్యులకు దేవుడు ఒక ఇంటిని ఇస్తాడు. దేవుడు తన ప్రజలను కారాగారం నుండి విడిపిస్తాడు. వారు చాలా సంతోషంగా ఉన్నారు. కాని దేవునికి విరోధంగా తిరిగే మనుష్యులు దహించు సూర్య వేడిమిగల దేశంలో నివసిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 దేవుడు ఒంటరిగా ఉన్నవారిని కుటుంబాలలో ఉంచుతారు, బందీలను విడిపించి వారికి ఆనందాన్ని అనుగ్రహిస్తారు; కాని తిరుగుబాటుదారులు ఎండిన భూమిలో నివసిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 68:6
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

దేవా, మీరైతే బాధితుల ఇబ్బందిని చూస్తారు; వారి దుఃఖాన్ని మీరు లక్ష్యపెట్టి బాధ్యత తీసుకుంటారు. నిస్సహాయులు మిమ్మల్ని ఆశ్రయిస్తారు; తండ్రిలేనివారికి మీరే సహాయకులు.


కొందరు కష్టాల ఇనుప గొలుసుల్లో బంధించబడి, చీకటిలో, కటిక చీకటిలో కూర్చుని ఉన్నారు,


ఆయన వారిని చీకటి, కటిక చీకటిలో నుండి బయటకు తెచ్చారు, వారి సంకెళ్ళను తుత్తునియలుగా చేశారు.


అతడు సంతానం లేని స్త్రీని తన ఇంట్లో సంతోషంగా ఉన్న తల్లిగా స్థిరపరుస్తారు. యెహోవాను స్తుతించండి.


ఆయన అణగారిన వారికి న్యాయం చేకూరుస్తారు, ఆకలిగొనిన వారికి ఆహారం ఇస్తారు. యెహోవా చెరసాలలో ఉన్నవారిని విడిపిస్తారు,


అవసరత ఉన్నవారి మొర యెహోవా వింటారు, బందీగా ఉన్న తన ప్రజలను ఆయన అలక్ష్యం చేయరు.


ఎందుకంటే వారిని కాపాడేవాడు బలవంతుడు; నీకు వ్యతిరేకంగా ఆయన వారి పక్షంగా నీతో పోరాడతారు.


ప్రభువైన యెహోవా ఆత్మ నా మీద ఉన్నది. బీదలకు సువార్త ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించారు. విరిగిన హృదయం గలవారిని బలపరచడానికి బందీలకు విడుదలను ఖైదీలకు చీకటి నుండి విముక్తిని ప్రకటించడానికి,


లేకపోతే ఆమెను దిగంబరిని చేస్తాను, ఆమె బట్టలు తీసివేసి ఆమె పుట్టిన రోజున ఉన్నట్లు ఆమెను నగ్నంగా చేస్తాను. ఆమెను ఎడారిలా చేస్తాను, ఎండిపోయిన భూమిలా చేస్తాను దప్పికతో ఆమె చచ్చునట్లు చేస్తాను.


ఏశావును ద్వేషించాను; నేను అతని కొండలను పాడు చేశాను. అతడు వారసత్వంగా పొందిన ప్రదేశాన్ని అడవి నక్కల పాలు చేశాను” అని యెహోవా అంటున్నారు.


అప్పుడు అకస్మాత్తుగా భయంకరమైన భూకంపం వచ్చి ఆ చెరసాల పునాదులను కదిలించింది. ఒక్కసారిగా చెరసాల గదుల తలుపులన్ని తెరవబడి, వారందరి సంకెళ్ళు ఊడిపోయాయి.


అయితే వ్రాయబడిన ప్రకారం, “గొడ్రాలా, పిల్లలు కననిదానా, ఆనందించు; ప్రసవవేదన పడనిదానా, ఆనందంతో కేకలు వేయి; ఎందుకంటే, భర్త ఉన్నదాని పిల్లలకంటే విడిచిపెట్టబడిన స్త్రీ పిల్లలు ఎక్కువమంది ఉన్నారు.”


తండ్రిలేనివారికి, విధవరాండ్రకు న్యాయం తీరుస్తారు, మీ మధ్యన ఉన్న విదేశీయులను ప్రేమించి వారికి అన్నవస్త్రాలు ఇస్తారు.


తృప్తిగా భోజనం చేసినవారు ఆహారం కోసం కూలికి వెళ్తారు, కాని ఆకలితో ఉన్నవారు ఇక ఆకలితో ఉండరు. గొడ్రాలిగా ఉన్న స్త్రీ ఏడుగురు పిల్లలను కన్నది, కాని అనేకమంది పిల్లలను కన్న స్త్రీ కృశించిపోతుంది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ