“సొలొమోనూ, నా కుమారుడా! నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయాలను పరిశోధిస్తారు, ఆలోచనల ఉద్దేశాలన్నిటిని గ్రహిస్తారు కాబట్టి నీవు ఆయనను తెలుసుకుని పూర్ణహృదయంతో చిత్తశుద్ధితో ఆయనను సేవించు. నీవు ఆయనను వెదికితే, ఆయన నీకు దొరుకుతారు; అయితే నీవు ఆయనను విడిచిపెడితే, ఆయన నిన్ను శాశ్వతంగా తిరస్కరిస్తారు.
అతడు ఆసాను కలుసుకోడానికి వెళ్లి అతనితో ఇలా చెప్పాడు, “ఆసా, సర్వ యూదా ప్రజలారా, బెన్యామీనీయులారా, నేను చెప్పేది వినండి. మీరు యెహోవాతో ఉంటే ఆయన మీతో ఉంటారు. మీరు ఆయనను వెదికితే, ఆయన మీకు కనిపిస్తారు. ఒకవేళ మీరు ఆయనను విడిచిపెడితే, ఆయన మిమ్మల్ని విడిచిపెడతారు.
అయితే మీలో కొంత మంచి కూడా ఉంది, మీరు దేశం నుండి అషేరా స్తంభాలను తొలగించి, యెహోవాను వెదికి ఆయనను అనుసరించడానికి హృదయపూర్వకంగా నిశ్చయించుకున్నారు” అని అన్నాడు.
“బందీల మూలుగులు వినడానికి మరణశిక్ష విధించబడిన వారిని విడుదల చేయడానికి, యెహోవా ఎత్తైన పరిశుద్ధాలయం నుండి క్రిందికి వంగిచూశారు, పరలోకంలో నుండి భూమిని చూశారు.”
యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నారు; యెహోవా తన పరలోక సింహాసనంపై ఆసీనులై ఉన్నారు; ఆయన భూమి మీద నరులను పరిశీలిస్తున్నారు; ఆయన కళ్లు వారిని పరీక్షిస్తున్నాయి.
వాటిని జాగ్రతగా పాటించండి. ఈ శాసనాలన్నిటి గురించి వినే దేశాలకు అవే మీ జ్ఞానాన్ని మీ వివేకాన్ని తెలియజేస్తాయి; వారు, “ఈ గొప్ప దేశం ఖచ్చితంగా జ్ఞానం వివేకం కలిగిన ప్రజలు” అని చెప్పుకుంటారు.