Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 51:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 మీ రక్షణానందం నాకు తిరిగి చేకూర్చండి, నన్ను సంరక్షించడానికి నాకు సమ్మతిగల ఆత్మను ఇవ్వండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము సమ్మతిగల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 నీ రక్షణలోని ఆనందాన్ని నాలో తిరిగి దయచెయ్యి. అంగీకరించే ఆత్మతో నన్ను బలపరచు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

12 నీచేత రక్షించబడుట మూలంగా కలిగే ఆనందం నాకు తిరిగి ఇమ్ము! నీకు విధేయత చూపుటకు నా ఆత్మను సిద్ధంగా, స్థిరంగా ఉంచుము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 మీ రక్షణానందం నాకు తిరిగి చేకూర్చండి, నన్ను సంరక్షించడానికి నాకు సమ్మతిగల ఆత్మను ఇవ్వండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 51:12
24 ပူးပေါင်းရင်းမြစ်များ  

మీ వాక్కు ప్రకారం నా అడుగుజాడలను నిర్దేశించండి; ఏ దుష్టత్వం నన్ను ఏలకుండును గాక.


అయితే నేను మారని మీ ప్రేమను నమ్ముతున్నాను; మీ రక్షణలో నా హృదయం సంతోషిస్తుంది.


నా అడుగులు మీ మార్గాల్లో నిలిచి ఉన్నాయి; నా పాదాలు తడబడలేదు.


కావాలని చేసే పాపాల నుండి మీ సేవకున్ని తప్పించండి; అవి నా మీద పెత్తనం చేయకుండా అరికట్టండి. అప్పుడు నేను యథార్థవంతుడనై ఘోరమైన అతిక్రమాలు చేయకుండ నిర్దోషిగా ఉంటాను.


యెహోవా! మీ బలంలోనే రాజు ఆనందిస్తాడు. మీ రక్షణను బట్టి అతడు ఎంతో సంతోషిస్తాడు!


ఎవరి చేతులు నిర్దోషమైనవో ఎవరి హృదయం శుద్ధమైనదో, ఎవరు విగ్రహాల మీద నమ్మిక ఉంచరో, ఎవరు మోసపూరితంగా ప్రమాణాలు చేయరో, వారే కదా!


నా ప్రాణం యెహోవాలో ఆనందిస్తుంది ఆయన రక్షణలో సంతోషిస్తుంది.


కాబట్టి భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను; దిగులుపడకు, నేను నీ దేవుడను. నేను నిన్ను బలపరచి నీకు సహాయం చేస్తాను; నీతిగల నా కుడిచేతితో నిన్ను ఆదరిస్తాను.


ఆకాశాల్లారా, ఉత్సాహ ధ్వని చేయండి; భూమీ, సంతోషించు; పర్వతాల్లారా, ఆనందంతో పాట పాడండి! ఎందుకంటే, యెహోవా తన ప్రజలను ఓదారుస్తారు, బాధించబడిన తన ప్రజల పట్ల జాలి చూపిస్తారు.


యాజకునిలా తలపాగా ధరించిన పెండ్లికుమారునిలా నగలతో అలంకరించుకున్న పెండ్లికుమార్తెలా ఆయన నాకు రక్షణ వస్త్రాలను ధరింపచేశారు ఆయన నీతి అనే పైబట్టను నాకు ధరింపచేశారు కాబట్టి యెహోవాలో నేను ఎంతో ఆనందిస్తున్నాను. నా దేవునిలో నా ఆత్మ సంతోషిస్తుంది.


యెహోవా, మనుష్యుల ప్రాణాలు వారివి కాదని నాకు తెలుసు; తమ అడుగులు నిర్దేశించుకోవడం వారికి చేతకాదు.


నా రక్షకుడైన దేవునిలో నా ఆత్మ సంతోషిస్తుంది.


వేరేవాళ్ళ సేవకునికి తీర్పు తీర్చడానికి నీవెవరవు? అతడు నిలబడినా పడిపోయినా అది అతని యజమాని చూసుకుంటాడు. ప్రభువు వారిని నిలబెట్టడానికి శక్తిగలవాడు కాబట్టి వారు నిలబడతారు.


మీరు మరలా భయంలో జీవించడానికి, మీరు పొందిన ఆత్మ మిమ్మల్ని బానిసలుగా చేయదు కాని మీరు పొందిన ఆత్మ ద్వారా దత్తపుత్రులుగా చేయబడతారు. అప్పుడు ఆ ఆత్మ ద్వారా మనం, “అబ్బా, తండ్రీ” అని మొరపెడుతున్నాము.


ఇప్పుడు ప్రభువే ఆత్మ. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉన్నాడో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది.


చివరి రోజుల్లో ప్రకటించబడే రక్షణ మీకు కలిగేలా విశ్వాసం ద్వారా దేవుని శక్తిచేత కాపాడబడుతున్నారు, ఆ వారసత్వం పరలోకంలో మీ కోసం భద్రపరచబడి ఉంది.


మీరు తొట్రిల్లకుండ కాపాడడానికి, తన మహిమ ముందు ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టడానికి, శక్తి కలిగిన, మన రక్షకుడైన అద్వితీయ దేవునికి,


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ