Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 40:17 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

17 కాని నా మట్టుకైతే, నేను దీనుడను, అవసరతలో ఉన్నవాడను; ప్రభువు నా గురించి ఆలోచించుదురు గాక. మీరే నా సహాయం, నా విమోచకుడు; మీరే నా దేవుడు, ఆలస్యం చేయకండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

17 నేను శ్రమలపాలై దీనుడనైతిని ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకుము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

17 నేను పేదవాణ్ణి. అవసరాల్లో ఉన్నాను. అయినా ప్రభువు నా గురించి ఆలోచిస్తున్నాడు. నా సహాయం నువ్వే. నన్ను కాపాడటానికి నువ్వు వస్తావు. నా దేవా, ఆలస్యం చేయకు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

17 ప్రభూ, నేను కేవలం నిస్సహాయ, నిరుపేద మనిషిని. యెహోవా, నన్ను గూర్చి ఆలోచించుము. నాకు సహాయం చేయుము. నన్ను రక్షించుము, నా దేవా, త్వరగా రమ్ము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

17 కాని నా మట్టుకైతే, నేను దీనుడను, అవసరతలో ఉన్నవాడను; ప్రభువు నా గురించి ఆలోచించుదురు గాక. మీరే నా సహాయం, నా విమోచకుడు; మీరే నా దేవుడు, ఆలస్యం చేయకండి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 40:17
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఎందుకంటే నేను దీనుడను అవసరతలో ఉన్నవాడను, నా హృదయం నాలో గాయపడి ఉంది.


నేను యెహోవాను వెదికాను, ఆయన నాకు జవాబిచ్చారు; నా భయాలన్నిటి నుండి ఆయన నన్ను విడిపించారు.


ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించారు కష్టాలన్నిటిలో నుండి ఆయన నన్ను రక్షించారు.


నా నిర్దోషత్వాన్ని బట్టి ఆనందించేవారు ఆనంద సంతోషాలతో కేకలు వేయుదురు గాక; “తన సేవకుని క్షేమాన్ని చూసి ఆనందించే యెహోవా ఘనపరచబడును గాక” అని వారు నిత్యం అందురు గాక.


యెహోవా నా దేవా, మీరు మాకోసం ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో ప్రణాళికలు వేశారు. మీతో పోల్చదగిన వారు లేరు; మీ క్రియల గురించి నేను చెప్పాలనుకుంటే అవి లెక్కకు మించినవి.


ఖచ్చితంగా దేవుడే నాకు సహాయం; ప్రభువే నన్ను సంరక్షించేవారు.


అవసరత ఉన్నవారి మొర యెహోవా వింటారు, బందీగా ఉన్న తన ప్రజలను ఆయన అలక్ష్యం చేయరు.


కాని నా మట్టుకైతే, నేను దీనుడను అవసరతలో ఉన్నవాడను; దేవా! నా దగ్గరకు త్వరగా రండి, మీరే నా సహాయం, నా విమోచకుడు; యెహోవా, ఆలస్యం చేయకండి.


యెహోవా, చెవియొగ్గి ఆలకించండి, నాకు జవాబివ్వండి, ఎందుకంటే నేను దీనుడను నిరుపేదను.


ఆ రోజున వారు ఇలా అంటారు, “నిజంగా ఈయనే మన దేవుడు ఈయనను మనం నమ్ముకున్నాం, ఈయన మనల్ని రక్షించారు. మనం నమ్మిన యెహోవా ఈయనే; ఆయన రక్షణను బట్టి సంతోషించి ఆనందిద్దాము.”


“పేదవారు, దరిద్రులు నీళ్లు వెదకుతారు కాని వారికి నీరు దొరకక వారి నాలుకలు దాహంతో ఎండిపోతాయి. అయితే, యెహోవానైన నేను వారికి జవాబిస్తాను; ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడిచిపెట్టను.


అందుకు యేసు, “నక్కలకు గుంటలు, ఆకాశపక్షులకు గూళ్లు ఉన్నాయి గాని మనుష్యకుమారునికి కనీసం తలవాల్చుకోడానికి స్ధలం లేదు” అని అతనికి జవాబిచ్చారు.


మన ప్రభువైన యేసు క్రీస్తు కృప ఎలాంటిదో మీకు తెలుసు. ఆయన ధనవంతుడైనా తన పేదరికం ద్వారా మిమ్మల్ని ధనవంతులను చేయడానికి మీ కోసం ఆయన పేదవానిగా అయ్యారు.


కాబట్టి మనం ధైర్యంతో ఇలా చెబుదాం, “ప్రభువే నాకు సహాయకుడు; నేను భయపడను. నరమాత్రులు నన్నేమి చేయగలరు?”


నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వినండి. దేవుడు తనను ప్రేమించినవారికి వాగ్దానం చేసిన ప్రకారం విశ్వాసంలో ధనవంతులుగా ఉండడానికి, తన రాజ్యానికి వారసులుగా ఉండడానికి ఈ లోకంలో పేదవారిని దేవుడు ఎంచుకోలేదా?


తాను దూషించబడినా తిరిగి దూషించలేదు. తాను హింసించబడుతున్నా ఎవరిని బెదిరించలేదు. కాని న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి తనను తాను అప్పగించుకున్నారు.


ఆయన మీ గురించి చింతిస్తున్నారు కాబట్టి మీ చింతలన్ని ఆయనపై మోపండి.


ఈ సంగతుల గురించి సాక్ష్యమిచ్చేవాడు, “నిజమే, నేను త్వరగా వస్తున్నాను!” అంటున్నాడు. ఆమేన్! రండి, ప్రభువైన యేసు!


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ