Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 40:10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 మీ నీతిని నా హృదయంలో నేనేమి దాచుకోను; మీ విశ్వసనీయతను మీ రక్షణ సహాయాన్ని గురించి నేను మాట్లాడతాను. మీ మారని ప్రేమను, మీ నమ్మకత్వాన్ని గురించి మహా సమాజానికి చెప్పకుండ దాచిపెట్టను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 నీ నీతిని నా హృదయములో నుంచుకొని నేను ఊర కుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడిచేసియున్నాను నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగుచేయలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 నీ నీతిని నా హృదయంలో దాచుకుని ఉండలేదు. నీ విశ్వసనీయతనూ, నీ ముక్తినీ నేను ప్రకటించాను. నీ నిబంధన కృపనూ, నీ విశ్వసనీయతనూ మహా సమాజానికి ప్రకటించకుండా నేను దాచలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

10 యెహోవా, నీవు చేసిన మంచి కార్యాలను గూర్చి నేను చెబుతాను. ఆ మంచి కార్యాలను నా హృదయంలోనే రహస్యంగా ఉంచుకోను. యెహోవా, ప్రజల యెడల నీవు ఎలా వాస్తవంగాను, నమ్మకంగాను ఉన్నావో అది నేను చెబుతాను. నీవు ప్రజల్ని ఎలా రక్షిస్తావో అది చెబుతాను. నీ దయ, నమ్మకత్వాన్ని గూర్చి సమాజంలోని మనుష్యులకు నేను దాచిపెట్టను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 మీ నీతిని నా హృదయంలో నేనేమి దాచుకోను; మీ విశ్వసనీయతను మీ రక్షణ సహాయాన్ని గురించి నేను మాట్లాడతాను. మీ మారని ప్రేమను, మీ నమ్మకత్వాన్ని గురించి మహా సమాజానికి చెప్పకుండ దాచిపెట్టను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 40:10
25 ပူးပေါင်းရင်းမြစ်များ  

దీనులు తృప్తిగా భోజనం చేస్తారు; యెహోవాను వెదికేవారు ఆయనను స్తుతిస్తారు, మీ హృదయాలు నిత్యం ఆనందిస్తాయి.


తన నిబంధనలను శాసనాలను పాటించేవారి విషయంలో యెహోవా మార్గాలు, ఆయన మారని ప్రేమ నమ్మదగినవి.


ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించారు కష్టాలన్నిటిలో నుండి ఆయన నన్ను రక్షించారు.


నేనైతే నిత్యం ప్రకటిస్తాను; యాకోబు దేవునికి నేను స్తుతి పాడతాను.


యెహోవా యొక్క మారని ప్రేమను గురించి నేను ఎల్లప్పుడూ పాడతాను; నా నోటితో మీ నమ్మకత్వాన్ని అన్ని తరాలకు తెలియజేస్తాను.


ఆయన అంటున్నారు: “నీవు యాకోబు గోత్రాలను పునరుద్ధరించడానికి, ఇశ్రాయేలులో నేను తప్పించిన వారిని తిరిగి రప్పించడానికి నా సేవకునిగా ఉండడం నీకు చాలా చిన్న విషయము. నేనిచ్చే రక్షణ భూమి అంచుల వరకు చేరడానికి యూదేతర ప్రజలకు వెలుగుగా నేను నిన్ను చేస్తాను.”


వారిది తిరుగుబాటు స్వభావం కాబట్టి వారు విన్నా వినకపోయినా నేను చెప్పిన మాట వారికి తెలియజేయి.


మీరు పూర్వకాలంలో మా పూర్వికులకు ప్రమాణం చేసిన విధంగా యాకోబు పట్ల నమ్మకత్వాన్ని, అబ్రాహాము పట్ల మారని ప్రేమ చూపుతారు.


దేవుని రక్షణను ప్రజలందరు చూస్తారు.’ ”


ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడింది కాని కృప, సత్యం యేసు క్రీస్తు ద్వారా వచ్చాయి.


దేవుని నీతి వారికి తెలియకపోయినా తమ స్వనీతిని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తూ వారు దేవుని నీతికి లోబడలేదు.


క్రీస్తును సంపాదించుకుని, ధర్మశాస్త్రం వలన కలిగే నా నీతిని కాకుండా, క్రీస్తులోని విశ్వాసాన్నిబట్టి దేవుడు దయ చేసిన నీతిని కలిగి ఆయనలో కనబడాలని,


అందుకని మీ వలన ప్రభువును గురించిన వాక్యం కేవలం మాసిదోనియ అకాయ ప్రాంతాల్లో మారుమ్రోగడమే కాకుండా మీలో దేవునిపై ఉన్న విశ్వాసాన్ని గురించి ప్రతిచోట తెలిసింది. కాబట్టి దాని గురించి మేము చెప్పవలసిన అవసరం లేదు,


క్రీస్తు యేసు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చారనే మాట నమ్మదగింది పూర్తిగా అంగీకరించదగింది. అలాంటి పాపులలో నేను అతి దుష్టుడను.


“రండి!” అని ఆత్మ, పెండ్లికుమార్తె అంటున్నారు. ఈ మాటలు వింటున్నవారు, “రండి!” అని చెప్పాలి. దప్పికగల వారందరు రండి; ఆశపడినవారు జీవజలాన్ని ఉచితంగా పొందుకోండి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ