Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 33:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 యెహోవా వాక్కు న్యాయమైనది; ఆయన చేసే ప్రతిదీ నమ్మకమైనది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 యెహోవా వాక్యము యథార్థమైనది ఆయన చేయునదంతయు నమ్మకమైనది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 ఎందుకంటే యెహోవా వాక్కు న్యాయబద్ధమైనది. ఆయన చేసే ప్రతిదీ న్యాయమే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

4 దేవుని మాట సత్యం! ఆయన చేసే ప్రతిదాని మీద నీవు ఆధారపడవచ్చును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 యెహోవా వాక్కు న్యాయమైనది; ఆయన చేసే ప్రతిదీ నమ్మకమైనది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 33:4
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

“నా యజమానియైన అబ్రాహాము దేవుడైన యెహోవాకు స్తుతి, ఆయన నా యజమానికి తన దయను, తన నమ్మకత్వాన్ని చూపడం మానలేదు. నా మట్టుకైతే, యెహోవా నా ప్రయాణాన్ని సఫలపరచి నా యజమాని బంధువుల ఇంటికి నన్ను నడిపించారు” అని అన్నాడు.


నేను మీ కట్టడలన్నిటిని యథార్థమైనవిగా పరిగణిస్తాను, ప్రతి తప్పుడు మార్గం నాకసహ్యము.


యెహోవా, మీ న్యాయవిధులు నీతిగలవని నాకు తెలుసు, నమ్మకత్వంలో మీరు నన్ను బాధించారని నాకు తెలుసు.


యెహోవా మాటలు నిర్దోషమైనవి, అవి మట్టి మూసలో శుద్ధి చేసిన వెండిలా పవిత్రమైనవి, ఏడుసార్లు శుద్ధి చేయబడిన బంగారం లాంటివి.


యెహోవా కట్టడలు సరియైనవి, హృదయానికి ఆనందం కలిగిస్తాయి. యెహోవా ఆజ్ఞలు ప్రకాశవంతమైనవి, కళ్లకు కాంతి కలిగిస్తాయి.


తన నిబంధనలను శాసనాలను పాటించేవారి విషయంలో యెహోవా మార్గాలు, ఆయన మారని ప్రేమ నమ్మదగినవి.


యెహోవా రాబోతున్నారు. భూలోకానికి తీర్పు తీరుస్తారు. నీతిని బట్టి లోకానికి, తన నమ్మకత్వాన్ని బట్టి ప్రజలకు తీర్పు తీరుస్తారు.


“దేవుని మాటలు పరీక్షించబడినవి; ఆయనను ఆశ్రయించువారికి ఆయన ఒక డాలు.


ఇప్పుడు నెబుకద్నెజరు అనే నేను పరలోక రాజును స్తుతిస్తూ, కీర్తిస్తూ, కొనియాడుతున్నాను, ఎందుకంటే ఆయన చేసే ప్రతిదీ సత్యమైనది, ఆయన విధానాలన్నీ న్యాయమైనవి. గర్వంతో జీవించేవారిని ఆయన అణచివేయగలడు.


యాకోబు వారసులారా, “యెహోవా సహనం కోల్పోయారా? ఆయన ఇలాంటి పనులు చేస్తారా?” అని అనవచ్చా? “యథార్థంగా ప్రవర్తించే వారికి నా మాటలు క్షేమం కలిగించవా?


అందుకు యేసు ఇలా జవాబిచ్చారు, “నేనే మార్గం, సత్యం, జీవం. నా ద్వారానే తప్ప తండ్రి దగ్గరకు ఎవరు రాలేరు.


కాబట్టి ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది. ఆజ్ఞలు పరిశుద్ధమైనవి, నీతి కలిగినవి, మంచివి.


ఆయన మనకు ఆశ్రయదుర్గం, ఆయన పనులు పరిపూర్ణం, ఆయన మార్గాలన్నీ న్యాయమైనవి. ఆయన తప్పుచేయని నమ్మదగిన దేవుడు, ఆయన యథార్థవంతుడు న్యాయవంతుడు.


ఈ సత్యం వారికి అబద్ధమాడని దేవుడు యుగయుగాలకు ముందే వాగ్దానం చేసిన నిత్యజీవాన్ని గురించిన నిరీక్షణతో,


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ