Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 27:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

11 యెహోవా, మీ మార్గం నాకు బోధించండి; నాకు విరోధులు మాటున పొంచి ఉన్నారు, కాబట్టి మీరే నన్ను సరియైన దారిలో నడిపించాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

11 యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము. నాకొరకు పొంచియున్నవారిని చూచి సరాళమైన మార్గమున నన్ను నడిపింపుము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

11 యెహోవా, నీ మార్గం నాకు బోధించు. నా శత్రువుల నిమిత్తం సమతలంగా ఉన్న దారిలో నన్ను నడిపించు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

11 యెహోవా, నాకు శత్రువులు ఉన్నారు, కనుక నాకు నీ మార్గాలు నేర్పించుము. సరైన వాటిని చేయటం నాకు నేర్పించుము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

11 యెహోవా, మీ మార్గం నాకు బోధించండి; నాకు విరోధులు మాటున పొంచి ఉన్నారు, కాబట్టి మీరే నన్ను సరియైన దారిలో నడిపించాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 27:11
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

నేను నా హృదయమంతటితో మిమ్మల్ని వెదకుతున్నాను; మీ ఆజ్ఞల నుండి నన్ను తొలగిపోనివ్వకండి.


చెడుమార్గమేదైనా నాలో ఉన్నదేమో చూడండి, నిత్యమైన మార్గంలో నన్ను నడిపించండి.


అప్పుడు యెహోవాకు భయపడేవారికి వారు కోరుకోవలసిన మార్గాలను ఆయన బోధిస్తారు.


న్యాయమైన మార్గాల్లో దీనులను నడిపిస్తారు, తన మార్గాలను వారికి బోధిస్తారు.


నా పాదాలను సమతలమైన నేల మీద నిలిపాను; గొప్ప సమాజాలలో నేను యెహోవాను స్తుతిస్తాను.


యెహోవా, నా శత్రువులను బట్టి మీ నీతిలో నన్ను నడిపించండి. మీ మార్గాన్ని నాకు స్పష్టం చేయండి.


వారి నోటి నుండి వచ్చే ఒక్క మాట కూడా నమ్మదగినది కాదు. వారి హృదయం అసూయతో నిండి ఉంది. వారి గొంతు తెరిచిన సమాధి; వారు నాలుకలతో అబద్ధాలు చెప్తారు.


నన్ను దూషించే వారు భయంతో వెనుకకు మరలి వెళ్లిపోవాలి; మీ నమ్మకత్వాన్ని బట్టి వారిని నిర్మూలం చేయండి.


వారు అన్యాయాలను రూపొందించి అంటారు, “మేము ఒక సంపూర్ణ ప్రణాళికను రూపొందించాము!” నిశ్చయంగా మానవుల మనస్సు హృదయం మోసపూరితమైనవి.


యెహోవా, మీ సత్యాన్ని అనుసరించి జీవించేలా, మీ మార్గాలు మాకు బోధించండి, నేను మీ నామానికి భయపడేలా నా హృదయానికి ఏకాగ్రత దయచేయండి.


సోమరి వాని బాట ముండ్లకంచె, యథార్థవంతుల త్రోవ రహదారి.


నా మాటలు వివేచనగలవానికి యథార్థమైనవిగా; జ్ఞానవంతునికి తేటగా ఉంటాయి.


అక్కడ రహదారి ఉంటుంది; అది పరిశుద్ధ మార్గమని పిలువబడుతుంది; అది ఆ మార్గంలో నడిచే వారికి మాత్రమే. అపవిత్రులు ఆ దారిలో వెళ్లకూడదు; దుర్మార్గమైన మూర్ఖులు దానిలో నడవరు.


చాలామంది గుసగుసలాడడం విన్నాను, “అన్ని వైపుల భయం! అతన్ని ఖండించండి! అతన్ని ఖండిద్దాము.” నా స్నేహితులందరూ నేను జారిపడాలని చూస్తూ ఉన్నారు, “బహుశా అతడు మోసపోవచ్చు; అప్పుడు మనం అతనిపై విజయం సాధించి అతని మీద పగ తీర్చుకుందాము.”


ఆయనపై నిఘా వేసి ఉంచడానికి, వారు యథార్థంగా ఉన్నట్లు నటించగల వేగులవారిని పంపారు. యేసు మాట్లాడే దాంట్లో ఏదో తప్పు పట్టి ఆయనను పట్టుకుని, ఆయనను అధిపతి యొక్క అధికారానికి, ప్రభావానికి అప్పగించవచ్చని వారు ఆశించారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ