Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 27:1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 యెహోవాయే నాకు వెలుగు నా రక్షణ నేను ఎవరికి భయపడతాను? దేవుడే నా జీవితానికి బలమైన కోట నేను ఎవరికి భయపడతాను?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 యెహోవా నాకు వెలుగును రక్షణయునైయున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 యెహోవా నాకు వెలుగు, నాకు రక్షణ. నేను ఎవరికి భయపడాలి? యెహోవా నా ప్రాణానికి ఆశ్రయం, నేను ఎవరికి బెదరాలి?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

1 యెహోవా, నీవే నా వెలుగు, నా రక్షకుడవు. నేను ఎవరిని గూర్చి భయపడనక్కర్లేదు. యెహోవా, నీవే నా జీవిత క్షేమస్థానం. కనుక నేను ఎవరికి భయపడను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 యెహోవాయే నాకు వెలుగు నా రక్షణ నేను ఎవరికి భయపడతాను? దేవుడే నా జీవితానికి బలమైన కోట నేను ఎవరికి భయపడతాను?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 27:1
45 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆయన దీపం నా తలపై వెలిగినప్పుడు ఆయన వెలుగును బట్టి చీకటిలో నేను నడిచాను!


నేను యెహోవాను ఆశ్రయించాను. “పక్షిలా మీ కొండ మీదికి పారిపో.


మీరు నాకు జవాబిచ్చారు, కాబట్టి నేను మీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను; మీరు నాకు రక్షణ అయ్యారు.


యెహోవా నా పక్షాన ఉన్నారు; నేను భయపడను. నరమాత్రులు నన్నేమి చేయగలరు?


యెహోవా, నా దీపాన్ని వెలిగించేది మీరే; నా దేవుడు నా చీకటిని వెలుగుగా మారుస్తారు.


మీ సహాయంతో నేను సైన్యాన్ని ఎదుర్కోగలను; నా దేవుని తోడుతో నేను గోడను దాటుతాను.


యెహోవా సజీవుడు! నా కొండకు స్తుతి! నా రక్షకుడైన దేవునికి మహిమ!


యెహోవా, నా కొండ, నా విమోచకా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారంగా ఉండును గాక.


రక్షణ యెహోవా నుండి వస్తుంది. మీ ప్రజలపై మీ ఆశీర్వాదం ఉండును గాక. సెలా


మీరే దేవుడు, నా బలమైన కోట. నన్నెందుకు ఇలా తిరస్కరించారు? శత్రువులచేత అణచివేయబడుతూ నేనెందుకు దుఃఖంతో గడపాలి?


ఆయనే నా కొండ నా రక్షణ; ఆయన నా బలమైన దుర్గం, నేను ఎప్పటికీ కదల్చబడను.


ఆయన నా కొండ నా రక్షణ; ఆయన నా కోట, నేను కదల్చబడను.


యెహోవా దేవుడు మాకు సూర్యుడు డాలు; యెహోవా దయను ఘనతను అనుగ్రహిస్తారు; నిందారహితులుగా నడుచుకునే వారికి ఆయన ఏ మేలు చేయకుండ మానరు.


“యెహోవాయే నా బలము నా పాట; ఆయన నాకు రక్షణ అయ్యారు. ఆయన నా దేవుడు నేను ఆయనను స్తుతిస్తాను, ఆయన నా తండ్రికి దేవుడు నేనాయనను మహిమపరుస్తాను.


నిజంగా దేవుడే నా రక్షణ; నేను భయపడను ఆయనను నమ్ముతాను. యెహోవా యెహోవాయే నా బలం, నా ఆత్మరక్షణ; ఆయనే నా రక్షణ అయ్యారు.”


యాకోబు వారసులారా రండి, మనం యెహోవా వెలుగులో నడుద్దాము.


‘యెహోవాలోనే నీతి, బలము’ అని ప్రజలు నా గురించి చెప్తారు.” ఆయన మీద కోప్పడిన వారందరు ఆయన దగ్గరకు వస్తారు, వారు సిగ్గుపరచబడతారు.


యాజకునిలా తలపాగా ధరించిన పెండ్లికుమారునిలా నగలతో అలంకరించుకున్న పెండ్లికుమార్తెలా ఆయన నాకు రక్షణ వస్త్రాలను ధరింపచేశారు ఆయన నీతి అనే పైబట్టను నాకు ధరింపచేశారు కాబట్టి యెహోవాలో నేను ఎంతో ఆనందిస్తున్నాను. నా దేవునిలో నా ఆత్మ సంతోషిస్తుంది.


అయితే పరాక్రమంగల బలాఢ్యుడైన యెహోవా నాకు తోడు; కాబట్టి నన్ను హింసించేవారు నిలువలేక తడబడతారు, వారు అనుకున్నది సాధించే యుక్తి లేక అవమానపాలవుతారు; వారి అవమానం ఎన్నటికీ మరవబడదు.


అయితే నా పేరుకు భయపడే మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు, అతని కిరణాలతో స్వస్థత కలుగుతుంది. మీరు శాలలోనుండి బయటకు వెళ్లిన క్రొవ్వినదూడల్లా ఉల్లాసంగా గంతులు వేస్తారు.


అందుకు ఆయన, “అల్పవిశ్వాసులారా, మీరు ఎందుకంతగా భయపడుతున్నారు?” అని కోప్పడి లేచి గాలులను అలలను గద్దించారు. అప్పుడు అంతా ప్రశాంతంగా మారిపోయింది.


సర్వలోక ప్రజల కోసం నీవు సిద్ధపరచిన, నీ రక్షణను నా కళ్లారా చూశాను, అది యూదేతరులందరికి నిన్ను ప్రత్యక్షపరచే వెలుగుగా, నీ ప్రజలైన ఇశ్రాయేలు యొక్క మహిమగా ఉన్నది.”


దేవుని రక్షణను ప్రజలందరు చూస్తారు.’ ”


ప్రతి వ్యక్తికి వెలుగునిచ్చే నిజమైన వెలుగు ఈ లోకంలోనికి వస్తూ ఉండేది.


యేసు ప్రజలతో మాట్లాడుతూ, “నేనే లోకానికి వెలుగు. నన్ను వెంబడించేవారు చీకటిలో నడవరు, కాని వారిలో జీవం కలిగించే వెలుగును కలిగి ఉంటారు” అని చెప్పారు.


అయితే ఈ విషయాల గురించి మనమేమి చెప్పాలి? ఒకవేళ దేవుడే మన వైపు ఉండగా, మనకు విరోధి ఎవడు?


అందుకు, “నా కృప నీకు చాలు, బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుతుంది” అని ఆయన నాతో చెప్పారు. అందువల్ల క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండేలా నా బలహీనతల్లోనే నేను గర్విస్తాను.


అయితే వారికి భయపడకండి; మీ దేవుడైన యెహోవా ఫరోకు, ఈజిప్టు దేశమంతటికి చేసింది జాగ్రతగా జ్ఞాపకం చేసుకోండి.


మీరు వారికి భయపడకండి, ఎందుకంటే మీ మధ్య ఉన్న మీ దేవుడైన యెహోవా గొప్పవాడు, అద్భుత దేవుడు


నన్ను బలపరిచే ఆయనలోనే నేను ఇవన్నీ చేయగలను.


కాబట్టి మనం ధైర్యంతో ఇలా చెబుదాం, “ప్రభువే నాకు సహాయకుడు; నేను భయపడను. నరమాత్రులు నన్నేమి చేయగలరు?”


ఆ పట్టణంపై సూర్యుడు గాని చంద్రుడు గాని ప్రకాశించాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుని మహిమ దానికి వెలుగు ఇస్తుంది గొర్రెపిల్ల దానికి దీపము.


అక్కడ రాత్రి ఉండదు. ప్రభువైన దేవుడే వారికి కాంతిని ఇస్తారు కాబట్టి వారికి దీపకాంతి గాని సూర్యకాంతి గాని అవసరం లేదు. వారు ఎల్లకాలం పరిపాలిస్తూ ఉంటారు.


వారు తమ స్వరాలను ఎత్తి బిగ్గరగా ఇలా అన్నారు: “సింహాసనం మీద ఆసీనుడైన మా దేవునికి, వధించబడిన గొర్రెపిల్లకే, రక్షణ చెందుతుంది.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ