Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




కీర్తన 22:15 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

15 నా బలం ఎండిన కుండపెంకులా అయింది, నా నాలుక నా అంగిలికి అంటుకుపోయింది; మీరు నన్ను మరణ ధూళిలో పడవేశారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

15 నా బలము యెండిపోయి చిల్లపెంకు వలె ఆయెను నా నాలుక నా దౌడను అంటుకొని యున్నది నీవు నన్ను ప్రేతల భూమిలోపడవేసి యున్నావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

15 నా బలం చిల్లపెంకులా ఎండిపోయింది. నా నాలుక నా దవడకు అంటుకుంటూ ఉంది. మరణ ధూళిలో నువ్వు నన్ను పడుకోబెట్టావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

15 నా నోరు ఎండి, పగిలిపోయిన చిల్ల పెంకులా ఉన్నది. నా నాలుక నా అంగిటికి అతుక్కొని పోతోంది. “మరణ ధూళిలో” నీవు నన్ను ఉంచావు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

15 నా బలం ఎండిన కుండపెంకులా అయింది, నా నాలుక నా అంగిలికి అంటుకుపోయింది; మీరు నన్ను మరణ ధూళిలో పడవేశారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




కీర్తన 22:15
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

అబ్రాహాము మరలా మాట్లాడాడు: “నేను ధూళిని బూడిదను, అయినాసరే నేను ప్రారంభించాను కాబట్టి నేను ప్రభువుతో ఇంకా మాట్లాడతాను.


నీవు మట్టి నుండి తీయబడ్డావు కాబట్టి నీవు మట్టికి చేరేవరకు, నీ నుదిటి మీద చెమట కార్చి నీ ఆహారాన్ని తింటావు నీవు మట్టివి కాబట్టి తిరిగి మన్నై పోతావు.”


మనమందరం చనిపోతాం గదా. ఒకసారి నేల మీద ఒలికిన తర్వాత మరలా ఎత్తలేని నీళ్లలా ఉన్నాము. అయితే దేవుడు కోరుకునేది ఇది కాదు; వెలివేయబడినవారు తన దగ్గరకు తిరిగి రావడానికి ఆయన మార్గాలు ఏర్పరుస్తారు.


బంకమట్టిలా నన్ను రూపొందించారని జ్ఞాపకం చేసుకోండి, ఇప్పుడు నన్ను తిరిగి మట్టిలా మారుస్తారా?


నేను అస్థిపంజరంలా తయారయ్యాను. నా పళ్ల చిగుళ్ళ పైచర్మం మాత్రమే మిగిలి ఉంది.


ప్రధానులు మౌనంగా ఉండేవారు. వారి నాలుకలు వారి అంగిటికి అంటుకుపోయాయి.


“ఇప్పుడు నా జీవితం దూరమవుతుంది; శ్రమ దినాలు నన్ను పట్టుకున్నాయి.


మనుష్యులంతా ఒకేసారి నశించిపోతారు, మానవులు తిరిగి దుమ్ములో కలిసిపోతారు.


ఎందుకు మీరు నా అపరాధాలను క్షమించరు? ఎందుకు నా పాపాలను తీసివేయరు? త్వరలోనే నేను మట్టిలో కలిసిపోతాను, మీరు నా కోసం వెదికినా నేనిక ఉండను.”


మీ ముఖం మరుగైతే అవి కంగారు పడతాయి; మీరు వాటి ఊపిరిని ఆపివేసినప్పుడు, అవి చనిపోయి మట్టి పాలవుతాయి.


“నేను నా రక్తాన్ని కార్చితే ఏమి లాభం? సమాధిలోనికి వెళ్తే ఏమి లాభం? మట్టి మిమ్మల్ని స్తుతిస్తుందా? అది మీ నమ్మకత్వాన్ని ప్రకటిస్తుందా?


నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. నా బలం క్షీణిస్తూ ఉంది; నా కంటి చూపు తగ్గిపోతుంది.


నా ఆహారంలో వారు చేదు కలిపారు దాహమైతే పులిసిన ద్రాక్షరసం ఇచ్చారు.


సాయం కోసం అరిచి అలసిపోయాను; నా గొంతు ఆరిపోయింది. నా దేవుని కోసం చూస్తూ, నా కళ్లు క్షీణిస్తున్నాయి.


సంతోషం గల హృదయం ఆరోగ్యకారణం, నలిగిన హృదయం ఎముకలను ఎండిపోజేస్తుంది.


కాబట్టి గొప్పవారితో నేనతనికి భాగం ఇస్తాను. బలవంతులతో కలిసి అతడు దోపుడుసొమ్ము పంచుకుంటాడు. ఎందుకంటే తన ప్రాణాన్ని మరణం పొందడానికి ధారపోసాడు, అతడు అపరాధులలో ఒకనిగా ఎంచబడ్డాడు. అతడు అనేకుల పాపభారాన్ని భరిస్తూ, అపరాధుల గురించి విజ్ఞాపన చేశాడు.


దాహం వల్ల పసివారి నాలుక నోటి అంగిటికి అంటుకుపోతుంది; పిల్లలు ఆహారం కోసం వేడుకుంటారు, కానీ ఎవరూ వారికి ఇవ్వరు.


భూలోక మట్టికి చేరి నిద్రించిన వారిలో చాలామంది లేస్తారు: కొందరు నిత్యజీవం, మరికొందరు అవమానం, శాశ్వత నిందను అనుభవించడానికి.


యేసు మరల బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచారు.


ఆ తర్వాత, యేసు అంతా ముగిసినదని గ్రహించి లేఖనాలు నెరవేరేలా, “దాహంగా ఉంది” అన్నారు.


నేను పొందిన దానిని మొదట మీకు ప్రకటించాను: అది ఏంటంటే లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపాల కోసం మరణించారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ